భోజ్యేషు ఇండస్ట్రీ | special story to Cooked and served the food industry | Sakshi
Sakshi News home page

భోజ్యేషు ఇండస్ట్రీ

Published Mon, Mar 12 2018 11:32 PM | Last Updated on Tue, Mar 13 2018 7:13 AM

special  story to  Cooked and served the food industry - Sakshi

రవీందర్‌ భోగల్‌

మహిళ ‘భోజ్యేషు మాత’ అయితే కావచ్చు. అయితే భోజనాన్ని వండి వడ్డించే పరిశ్రమలో ఆమె రాణించగలదా అనే సంశయం అనేకమందిలో ఇప్పటికీ ఉంది. ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ ‘రాణించగలం’ అని.. గత దశాబ్దకాలంగా లండన్‌లో తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఓ ఐదుగురు భారతీయ మహిళలు. 

దీప్నా ఆనంద్‌
లండన్‌లోని భారతీయ భోజన పరిశ్రమ రంగంలో దాదాపుగా మొదటి స్థానంలో ఉన్నారు దీప్నా ఆనంద్‌. ఈమె తాతగారు కెన్యాలో 1950లో ఒక రెస్టారెంట్‌ ప్రారంభించి దానికొక బ్రాండ్‌ ఇమేజిని సృష్టించుకున్నారు. అయితే పదిహేనేళ్ల తర్వాత దాని ప్రాభవం తగ్గిపోయింది. దాంతో ఆమె తండ్రి రంగంలోకి దిగి  ‘డిప్‌ ఇన్‌ బ్రిలియంట్‌’ పేరుతో లండన్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సంప్రదాయ పంజాబీ తాలీని, తన కుటుంబంలో అంతా ఇష్టపడే రుచులను రెస్టారెంట్‌లో ప్రవేశపెట్టారు. దీంతో ఆ కెన్యా ఘుమఘుమలు లండన్‌కు వ్యాపించాయి. తర్వాత తండ్రి నుంచి తను స్వీకరించారు దీప్నా. ఇప్పుడు ‘ఇన్‌ కిచెన్‌ ఆన్‌ బి 4 యు’ అనే టీవీ షోతో లండన్‌లో చాలా పాపులర్‌ అయ్యారు. 

రవీందర్‌ భోగల్‌
రవీందర్‌ భోగల్‌ అనే ఈ ఫ్యాషన్‌ జర్నలిస్ట్‌ కూడా రెస్టారెంట్‌ వైపు తన దృష్టిని మరల్చారు. చెఫ్, కుకరీ రైటర్‌గా లండన్‌లో పేరొందారు. ‘జెంటిల్‌మెన్స్‌ క్లబ్‌ డెకార్‌’ పేరుతో రెస్టారెంట్స్‌ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. కెన్యా, నార్త్‌ ఇండియన్‌ వంటకాలను ఈమె తన రెస్టారెంట్‌ ద్వారా అందిస్తున్నారు. 

ఆస్మాఖాన్‌
ఇరవై నాలుగు గంటలూ ఈమె రెస్టారెంట్‌లో ఛాయ్‌ కోసం ఆర్డర్‌ ఇవ్వచ్చు. కోల్‌కతా వాసి అయిన ఆస్మా ఖాన్‌ తన ఇండియన్‌ రెస్టారెంట్‌ ద్వారా రాయల్‌ మొఘల్‌ ఘుమఘుమలను అందిస్తున్నారు. కొన్నేళ్లక్రితం కుటుంబంతో లండన్‌ చేరిన ఆస్మా లాయర్‌గానూ రాణించారు.  హైదరాబాద్‌ రాయల్‌ డిషెస్, కోల్‌కతా స్ట్రీట్‌ ఫుడ్, బెంగాల్‌ క్లాసికల్‌ రిఫ్లెక్ట్స్‌.. ఆస్మా అందించే రుచులలో జిహ్వను మైమరపిస్తాయి. 

చెఫ్‌ శిల్పా దండేకర్‌
పూర్తిగా ఇండియన్‌ వంటకాలను మూడేళ్లుగా అందిస్తున్నారు. శిల్ప ఇండియన్‌ తాజ్‌ హోటల్‌ గ్రూప్‌లో శిక్షణ తీసుకున్నారు. యు.కె. వెళ్లిన తర్వాత అక్కడి పబ్బులలో రుచికరమైన వంటలను అందించారు. ఆ తర్వాత తనే సొంతంగా రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కాలానుగుణంగా లభించే పదార్థాలతో వంటలను రుచికరంగా అందించడం శిల్ప ప్రత్యేకత.

ఏంజెలా మాలిక్‌ 
ఈమెది పంజాబీ నేపథ్యం. చెఫ్‌గా రాణించడమే కాకుండా సొంతంగా కుకరీ స్కూల్‌ను నడుపుతున్నారు. టీవీల్లోనూ, రేడియోలోనూ తన క్లాసుల ద్వారా నగరవాసులకు చేరువయ్యారు. ఏంజెలా మాలిక్‌ అనే మరో చెఫ్‌ ‘లండన్‌ ఫుడ్‌ బోర్డ్‌’ సభ్యురాలిగా భారతీయ రుచులపై స్థానికులకు ఆసక్తి కలిగించడంతో పాటు, భారతీయ భోజన పరిశ్రమకు విస్తృతినీ కల్పిస్తున్నారు. ‘ప్రతిభ ఉన్న ఏ రంగంలో అయినా అవకాశాల కోసం ఎదురుచూడటం కాదు, ఆ అవకాశాలను మనమే కల్పించుకోవాలి’ అనేది ఈ ఆధునిక మహిళలు వంట ద్వారా నిరూపిస్తూ చెబుతున్నారు.         

ఫైవ్‌ ఉమెన్‌ 
వీళ్ల కన్నా ముందులండన్‌లో మొదటిసారి‘చట్నీ మేరీ’ అనే పేరుతో మోడ్రన్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ని నమిత, కామెలియా అనే ఇద్దరు అక్కచెల్లెళ్లు 1990లలో ప్రారంభించారు.  పంజాబీయులు అయిన ఈ అక్కచెల్లెళ్లు తమ కుటుంబ సంప్రదాయ రుచులను వండి వడ్డించారు. వంటల పుస్తకాలు, టీవీ షోల ద్వారా భోజనప్రియుల మనసులను కొల్లగొట్టారు. కొన్నాళ్లలోనే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement