Ravinder
-
జమ్ముకశ్మీర్ ఫలితాలు.. బీజేపీ చీఫ్ ఓటమి
పదేళ్ల తర్వాత జరిగిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకుపోతుంది. మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన మెజార్జీకి(45)మించి 49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో కేంద్రపాలిత ప్రాంతంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు లాంఛనంగా మారింది.ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. నౌషేరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాష్ట్ర బీజేపీచీఫ్ రవీందర్ రైనా ఓటమి చెందారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి సురీందర్ చౌదరి చేతిలో 7, 819ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈసీ ప్రకారం.. చౌదరికి 35,069 ఓట్లు రాగా, రైనాకు 27,250 ఓట్లు వచ్చాయి.కాగా జమ్ముకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. హంగ్ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాటికి భిన్నంగా ఫలితాల్లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్లింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు దక్కించుకుంది. దీంతో బుద్గామ్‌లో గెలుపొందిన ఒమర్ అబ్దుల్లానే సీఎంగా బాధ్యతలు చేపడతారని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దులా పేర్కొన్నారు. -
జమ్మికుంట కౌన్సిలర్ అరాచకం..
జమ్మికుంట: ప్రభుత్వ భూమి కబ్జా చేసి బోరు వేయడమే కాకుండా.. ఆక్రమణ సరికాదని అడ్డుచెప్పిన ముగ్గురు గ్రామస్తులపై కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. రామన్నపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మూడోవార్డులోని రామన్నపల్లి ప్రభుత్వ పాఠశాల, వాటర్ ట్యాంక్ సమీప సర్వే నంబర్ 422లో కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ ప్రభుత్వ భూమి కబ్జా చేశాడు. అక్రమంగా బోరు వేసేందుకు యత్నిస్తుండగా , గ్రామస్తులు మర్రి మల్లయ్య, కోలకాని రాజు, మేడిపల్లి రమేశ్ అడ్డుకున్నారు. ఆగ్రహించిన కౌన్సిలర్ రవీందర్.. బుధవారం ఇనుప రాడ్‌తో ముగ్గురిపై విచక్షణ రహితంగా దాడిచేశాడు. దాడిలో మల్లయ్య, రాజుకు తీవ్రగాయాలు కాగా రమేశ్‌కు గాయాలయ్యాయి. మల్లయ్యను జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మిగిలిన ఇద్దరినీ స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, మల్లయ్య భార్య రజిత ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వి.రవి తెలిపారు. -
ఆయన తగ్గలేదు.. నేనే లావెక్కుతా: మహాలక్ష్మి
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి వివాహం తర్వాత చాలా మంది నుంచి ట్రోల్స్ ఎదుర్కొన్నారు. చాలా రహస్యంగా పెళ్లి చేసుకున్న వారిద్దరి పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో భారీగా వైరల్ అయ్యాయి. వివాహం తర్వాత రవీందర్ చాలా అవహేళనలు ఎదుర్కొన్నాడు. దీనికి ప్రధాన కారణం ఆయన మితిమీరిన బరువు ఉండటమే.. మహాలక్ష్మి మాత్రం నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న ఈ జంట మాత్రం లైఫ్‌ను ఆనందంగానే లీడ్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహాలక్ష్మి తన వ్యక్తిగత జీవితం గురించి, భర్త గురించి ఓపెన్‌గా చెప్పింది. తనను ఎక్కువగా బాధపెట్టిన దాని గురించి బహిరంగంగా మాట్లాడింది. 'మా పెళ్లి సందర్భంగా చాలా మంది ట్రోల్స్ చేశారు. కానీ వాటన్నింటినీ పట్టించుకోలేదు. అలాగే నా భర్త రవీందర్ బరువు ఎక్కువగా ఉండడంతో ఆయన కోసం నేనూ బరువు పెరిగేందుకు ప్లాన్ చేస్తున్నాను. బరువు తగ్గాలని రవీందర్ ఎంత ప్రయత్నం చేసినా అది కుదరడం లేదు.. కాబట్టి నేనే ఆయన మాదిరి బరువు పెరగాలని చూస్తున్న. బరువు పెరిగేందుకు నేను అధికంగా కొవ్వు పదర్థాలు కూడా తీసుకుంటున్నాను. ఆర్ధరాత్రి సమయంలో ఎక్కువగా ఫుడ్ తింటున్నాను. ఆ సమయంలో నాకు నిద్ర కూడా పోతుంది. ఎలాగైనా నేను కూడ ఆయనలా మారాలి. అప్పుడైనా ఈ ట్రోల్స్ ఆగిపోతాయి అనుకుంటా.' అని ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. కానీ తన భర్త రవీందర్ జుట్టు నెరిసిపోవడం చాలా బాధగా ఉందని ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. మహాలక్ష్మి నిర్ణయాన్ని మార్చుకోవాలని లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తన భర్త చెప్పినా అందుకు ఆమె అంగీకరించలేదని తెలిపింది. ఏమేమైనా త్వరలో బరువు పెరగాలనే ఆలోచనతో మహాలక్ష్మి ఉంది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. మహాలక్ష్మి, రవీందర్ ఇద్దరిదీ కూడా రెండో పెళ్లినే.. ఇద్దరికీ మొదటి వివాహం నుంచి ఒక బిడ్డ ఉంది. మొదటి వివాహం ముగిసిన తర్వాత ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.పెళ్లి సమయంలో మహాలక్ష్మి డబ్బు కోసమే రవీందర్‌ని పెళ్లిచేసుకుందని, అతని సంపద చూసి నటి పెళ్లికి సిద్ధమైందని పలువురు చెప్పారు. అంతేకాదు మహాలక్ష్మి లాంటి అందమైన అమ్మాయిని పొందడానికి నిర్మాత రవీందర్ ఎన్నో ట్రిక్కులు వేశారని సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే ట్రోల్స్‌ను అధిగమించి మంచి వైవాహిక జీవితాన్ని గడపగలమని వారు చాలాసార్లు నిరూపించారు. ఆ మధ్య వారిద్దరూ విడాకులు తీసుకున్నారనే పుకార్లు వచ్చాయి. వాటిలో నిజం లేదని ఆమె తెలిపింది. ఆ మధ్య రవీందర్‌పై చీటింగ్ కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లే పరిస్థితి కూడా వచ్చింది. ఒకరిని మోసం చేసి డబ్బులు తీసుకున్నారంటూ నిర్మాతపై కేసు నమోదైంది. చివరికి ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. View this post on Instagram A post shared by Mahalakshmi Shankar (@mahalakshmi_actress_official) -
పిడుగుపాటుకు ముగ్గురు రైతుల మృతి
జైనథ్, వాంకిడి, కోటపల్లి: రాష్ట్రంలో పిడుగు పాటుకు గురై వేర్వేరు జిల్లాల్లో ఓ మహిళ సహా ముగ్గురు రైతులు దుర్మరణం పాలైన ఘటనలు శుక్రవారం చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ గ్రామానికి చెందిన రైతు షేక్ యాసిన్(41) తన భార్య అఫ్సానాతో పొలంలో పత్తికి పురు గుల మందు పిచికారీ చేస్తుండగా భారీ వర్షం మొదలైంది. దీంతో ఇంటికి వెళ్లేందుకు ఎడ్లబండిని సిద్ధం చేసేందుకు చెట్టు కిందకు వెళ్ల గా ఒక్కసారిగా పిడుగుపడటంతో యాసిన్ అక్కడికక్కడే కుప్పకూలాడు. రెండు ఎడ్లు సైతం అక్కడికక్కడే మృతి చెందాయి. కొంత దూరంలో ఉన్న అఫ్సానాకు తలకు గాయాలై స్పృహ కోల్పోవడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలం వెల్గి గ్రామ పంచాయతీ పరిధిలో పత్తి చేనులో ఎరువు వేస్తు న్న క్రమంలో భారీ వర్షం రావడంతో చింత చెట్టు వద్దకు వెళ్లి పిడుగు పాటుకు గురై మన్నెగూడ గ్రామానికి చెందిన పద్మబాయి(23) మృతి చెందారు. పక్కనే ఉన్న ఆమె భర్త గేడం టుల్లికి తీవ్రగాయాలు కావడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన రైతు రావుల రవీందర్ (25) పత్తి చేనులో పురుగుల మందు పిచికారీ చేస్తుండగా పిడుగు పడి స్పృహకోల్పోయాడు. దగ్గరలోనే ఉన్న భార్య లావణ్య వెంటనే రవీందర్‌ను చెన్నూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఏడాది క్రితమే వారికి వివాహమైంది. -
హోంగార్డులను స్టేషన్లోనే ఉంచండి
సాక్షి, హైదరాబాద్: హోంగార్డు రవీందర్ మృతి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోంగార్డులకు పోలీస్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. హోంగార్డులంతా డ్యూటీలోనే ఉండాలని, డ్యూటీ అయిపోయిన వారిని కూడా పోలీస్ స్టేషన్లకే పరిమితం చేయాలని హుకుం జారీ చేసినట్టు ఓ ఆడియో వైరల్ అయ్యింది. రవీందర్ మృతికి నిరసనగా ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తం అయినట్టు తెలిసింది. ఆదేశాలు మీరితే విధుల నుంచి బహిష్కరణకు గురవుతారని ఓ దశలో బెదిరింపు ధోరణిలో హెచ్చరించినట్టు తెలిసింది. ’రెస్ట్ ఉంది కదా.. ఇంటికి పోతాం అంటే కుదరదు’ ‘విధుల్లో ఉండే హోంగార్డులు, డ్రైవర్లు, ఆఫీసర్ల దగ్గర పనిచేసే వాళ్లయినా, డే డ్యూటీ చేసేవాళ్లు, ఇంకే డ్యూటీలో ఉండేవాళ్లయినా సరే ప్రతి ఒక్కరూ ఈ రోజు పోలీస్ స్టేషన్లోనే ఉండాలి. స్టేషన్ వదిలి బయటికి వెళ్లకూడదు. డ్యూటీ అయిపోయిన వాళ్లను కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచండి..రెస్ట్ ఉంది కదా.. ఇంటికి పోతాం అంటే కుదరదు. ఎవరెవరైతే ఆబ్సెంట్‌లో ఉన్నారో వాళ్ల పేర్లు రాసి పెట్టండి. పది నిమిషాల తర్వాత మళ్లీ నాకు చెప్పండి. ఎవరైతే ఆబ్సెంట్ అవుతారో వాళ్లను మిస్కండక్ట్ కింద తీసుకోబడుతుంది. వాళ్ల ఉద్యోగానికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్. అందరికీ పేరు పేరున ఫోన్ చేసి తెలపండి. ఇది మీ రెస్పాన్సిబిలిటీ...’అని ఓ పోలీస్ అధికారి సెట్లో ఆదేశాలిస్తున్న ఆడియో ఒకటి శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉన్నతాధికారుల ఒత్తిళ్లపై బహిరంగంగా చెప్పుకోలేకపోతున్నా...హోంగార్డులు అంతర్గతంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కుట్రతోనే డీఎంకే వ్యాఖ్యలు: పొంగులేటి సాక్షి, హైదరాబాద్: రాజకీయకుట్రలో భాగంగా, తమ ప్రభుత్వ వైఫల్యాల నుంచి, మంత్రులపై ఉన్న అవినీతి, ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే అధికార డీఎంకే గందరగోళం సృష్టిస్తోందని బీజేపీ నేత తమిళనాడు సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఉదయనిధిస్టాలిన్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టాలిన్‌తో పాటు కేంద్రమాజీమంత్రి ఎం.రాజాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ...తాను యజ్ఞయాగాలకు కేరాఫ్ అని చెప్పుకునే సీఎం కేసీఆర్, ఉదయనిధి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. -
హోంగార్డు రవీందర్ మృతి..ఉస్మానియా వద్ద హైటెన్షన్ వాతావరణం
-
హోంగార్డు రవీందర్ మృతి
సాక్షి, హైదరాబాద్: జీతం కోసం వెళ్తే అధికారులు అవమానించారంటూ ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్ డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్ను మూశారు. గోషామహల్‌లోని హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయం వద్ద మంగళవారం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న రవీందర్‌కు 55 శాతం కాలిన గాయాలైన విషయం తెలిసిందే. ఆయనకు తొలుత ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించగా.. మెరుగైన చికిత్స కోసం డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. మృతదేహాన్ని ఉస్మా నియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రవీందర్ భార్య సంధ్య, కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నాకు దిగడంతో రోజంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేతనం కోసం వెళ్లి.. ఆందోళనకు గురై.. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. హైదరా బాద్ పాతబస్తీలోని రక్షాపురం ప్రాంతానికి చెందిన రవీందర్ (38) చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. తనకు జీతం రాకపోవడంతో రవీందర్ మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాల యానికి వెళ్లి వాకబు చేశారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేసే ఏఎస్సై నర్సింగ్‌రావు, కానిస్టేబుల్ చందు చులకనగా మాట్లాడటంతో రవీందర్ ఆవేదనకు లోనయ్యారు. ఆ కార్యాలయం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఆస్పత్రి వద్ద ఆందోళనతో.. పోలీసులు రవీందర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించగా.. ఆయన భార్య, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసు అధికా రుల వేధింపులతోనే రవీందర్ ఆత్మహత్యకు పాల్ప డ్డారని ఆరోపించారు. బాధ్యులైన ఇద్దరు పోలీసుల ను ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. తన భర్త మృతిపై కనీస సమాచారం ఇవ్వకుండా మృతదేహా న్ని ఉస్మానియా మార్చురీకి తరలించడం ఏమిటని, తన భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించారా? అనే సందేహాలు వస్తున్నాయని సంధ్య ఆరోపించారు. ఆమెకు సంఘీభావంగా రక్షాపురం బస్తీవాసులు, హోంగార్డులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరు కున్నారు. దీనితో ఉద్రిక్తత నెలకొంది. చివరికి డీసీపీ లు సునీల్‌దత్, కిరణ్ ఖేర్, ఏసీపీ బాల గంగిరెడ్డి తదితరులు సంధ్యతో మాట్లాడి.. త్వరలో డీజీపీ వద్ద కు తీసుకెళ్లి న్యాయం చేస్తామని, పోలీసు విభాగంలో ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో సంధ్య ఆందోళన విరమించారు. వైద్యులు పోస్టు మార్టం అనంతరం రవీందర్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. శనివారం రక్షాపురంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఇద్దరు పోలీసులపై కేసు నమోదు రవీందర్ ఆత్మహత్యపై భార్య సంధ్య చేసిన ఫిర్యాదు మేరకు షాహినాయత్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య ఆరోపణల మేరకు హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయంలోని ఏఎస్సై నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ నాగం రవీందర్ తెలిపారు. రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలి: రాజకీయ పక్షాలు ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన రవీందర్ భార్య సంధ్యకు పలువురు రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, నేతలు మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తదితరులు ఆమెకు బాసటగా నిలిచారు. ♦ రవీందర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, రూ.25 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.2 లక్షలు ఆర్థికసాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఇక కేఏ పాల్ రూ.3.1 లక్షల చెక్కును సంధ్యకు అందించి ఓదార్చారు. ♦ హోంగార్డు రవీందర్ ఆత్మహత్య బాధాకరమని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ వేర్వేరు ప్రకటనల్లో ఆరోపించారు. హోంగార్డులకు సకాలంలో జీతాలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. రవీందర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ♦ హోంగార్డు రవీందర్ మృతికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. హోంగార్డులను రెగ్యుల రైజ్ చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. రవీందర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, ఆ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: రవీందర్ మృతి.. హోంగార్డ్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీ ఏమైంది? -
నా భర్త మృతికి కారణం వాళ్లిద్దరే: రవీందర్ భార్య
సాక్షి, హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్ సూసైడ్ కేసు ఊహించని మలుపు తిరిగింది. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే అధికారుల వేధింపులూ కూడా తన భర్త మరణానికి కారణమంటూ చెబుతూ వచ్చిన రవీందర్ భార్య సంధ్య.. తాజాగా సంచలన ఆరోపణలకు దిగారు. ‘‘నా భర్తను తగలబెట్టారు. కానిస్టేబుల్‌చందు, ఏఎస్ఐ నర్సింగరావులు కలిసి నా భర్తపై పెట్రోల్ పోశారు. కానీ, ఈ ఇద్దరూ ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు. హోంగార్డ్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేదు. అది దొరికితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి’’ అని పేర్కొన్నారామె. తన భర్తను తీవ్రంగా వేధించారన్న ఆమె.. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. "నా భర్త ఫోన్ అన్‌లాక్ చేసి మొత్తం డేటా డిలీట్ చేశారు. హమీద్ అనే అధికారి నా దగ్గరకు వచ్చి పెట్రోల్ బంక్‌లో ప్రమాదం జరిగిందని చెప్పాలన్నారు. అలా అయితేనే బెనిఫిట్స్ వస్తాయని చెప్పి.. నన్ను పక్కదారి పట్టించే యత్నం చేశారు" అని సంధ్య ఆరోపించారు. తన భర్తను చంపిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కన్నీళ్లతో డిమాండ్ చేస్తున్నారామె. జీతం పడకపోవడంతో.. మనస్తాపానికి గురైన రవీందర్.. మంగళవారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందారు. రవీందర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో రవీందర్ భార్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె సంతకం చేస్తేనే మృతదేహానికి పోస్ట్‌మార్టం చేస్తారు వైద్యులు. దీంతో ఉస్మానియా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఆమె ఆరోపణలపై పోలీస్ శాఖ స్పందించాల్సి ఉంది. -
హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్ కన్నుమూత
సాక్షి,హైదరాబాద్: టైంకి జీతం పడలేదని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు రవీందర్ మృతి చెందారు. చికిత్స పొందుతూ ఇవాళ(శుక్రవారం) ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు కంచన్‌బాగ్ డీఆర్డీవో అపోలో వైద్యులు ప్రకటించారు. నాలుగు రోజుల కిందట.. జీతాలు పడలేదనే ఆవేదనతో ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు. తీవ్ర గాయాలైన ఆయన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించడంతో డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. హోంగార్డ్ రవీందర్ మృతిపై హోంగార్డ్ జేఏసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఏం జరిగిందంటే.. పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం (సెప్టెంబర్ 5వ తేదీన) సాయంత్రం గోషామహల్‌లోని ఓ ఏటీఎంకు వెళ్లి తన బ్యాంకు ఖాతాను చూసుకోగా ఇంకా జీతం పడలేదు. వెంటనే గోషామహల్లోనే ఉన్న హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో తన జీతం గురించి వాకబు చేశాడు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జీతం డబ్బులు జమ అవుతాయని వారు బదులిచ్చారు. అయినప్పటికీ ఆవేదనకు గురైన రవీందర్ సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. సకాలంలో జీతాలు అందక.. బ్యాంక్ ఈఎంఐ చెల్లింపు ఆలస్యం అవుతోందన్న మనస్థానంతో రవీందర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 5వ తేదీన) షాయినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 55 శాతం పైగా కాలిన గాయాలతో ఆయన తొలుత ఉస్మానియా ఆస్పత్రిలో చేరారు. ఆపై పరిస్థితి విషమించడంతో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. వేధింపులు కూడా.. అయితే ఆయన భార్య సంధ్య మాత్రం.. సకాలంలో జీతం అందకపోవడం మాత్రమే కాదని.. అధికారుల వేధింపులు కూడా తన భర్త ఆత్మహత్యకు ప్రయత్నించడానికి కారణమని చెబుతున్నారు. జీతాలు అందకపోవడం మాత్రమే కాదు.. ఇప్పుడు తన భర్తకి మంచి చికిత్స అందించలేని స్థితిలో ఉన్నానని, హోంగార్డుల దుస్థితికి ఇది నిదర్శనమని ఆమె పేర్కొంటూ.. సీఎం కేసీఆర్ స్పందించాలంటూ కోరారామె. మరోవైపు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటన హోంగార్డుల్లో ఆవేశాగ్రహాలకు దారి తీసింది. విధుల బహిష్కరణతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యాచరణకు పిలుపు ఇచ్చింది హోంగార్డ్ జేఏసీ. హోంగార్డులను వెంటనే పర్మినెంట్ చేయాలంటూ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. సకాలంలో హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రవీందర్‌కు మద్దతుగా హోంగార్డులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని సంఘీభావం కూడా ప్రకటించారు. ఇంతలోనే ఆయన కన్నుమూశారు. రాజకీయ విమర్శలు ఇంకోవైపు రవీందర్ ఆత్మహత్యాయత్నం రాజకీయ దుమారం రేపింది. ఎమ్మెల్యే రాజాసింగ్.. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వమే రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి రవీందర్‌ను, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. కనీస హక్కులను కూడా పరిరక్షించకుండా.. హోంగార్డ్ వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం అవమానిస్తోందని, హామీ ఇచ్చి ఐదేళ్లైనా హోంగార్డుల ఉద్యోగ భద్రత విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
హోంగార్డులూ..ఆత్మహత్యలు చేసుకోకండి
సంతోష్ నగర్: హోంగార్డులు ఆత్మహత్యలు చేసుకోవద్దని..పోరాడి హక్కులు సాధించుకుందామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణాపాయస్థితిలో అపోలో డీఆర్డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌ను ఆయ న గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హోంగార్డుల విషయంలో శ్రమదోపిడీ జరుగుతోందని..వారికి కనీస హక్కు లు ఇవ్వడం లేదన్నారు. హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తుందన్నారు. ఈ ఘటనపై విచారణ జరగాలన్నారు. ఆయన కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ధర్నాకు కిషన్‌రెడ్డి మద్దతు: అపోలో డీఆర్డీఓ ఆస్పత్రి ఆవరణలో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న హోంగార్డులకు కిషన్‌రెడ్డి మద్దతు తెలిపారు. 17 సంవత్సరాలుగా హోంగార్డుగా సేవలు అందిస్తున్న రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. మనం అవసరమైతే పోరాటం చేద్దాం కానీ.., ప్రాణాలు తీసుకోవద్దన్నారు. కాగా, హోంగార్డులను ఇలాంటి పరిస్థితిలో తాను ఎప్పుడూ చూడలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. అంతకు ముందు ఆయన రవీందర్‌ను పరామర్శించారు. -
అవమానించడంతోనే పెట్రోల్ పోసుకున్నా
అఫ్జల్‌గంజ్/సంతోష్‌నగర్: న్యాయంగా రావాల్సిన జీతాన్ని అడిగేందుకు వెళ్లిన తనను హోంగార్డు కార్యాలయ సిబ్బంది దూషించడంతోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు హోంగార్డు రవీందర్ తెలిపారు. చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రక్షాపురం నివాసి రవీందర్ తనకు రావాల్సిన జీతం కోసం గోషామహల్‌లోని హోంగార్డు కార్యాలయానికి మంగళవారం వెళ్లారు. అక్కడి సిబ్బంది అసభ్య పదజాలంతో దూషించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలు కాగా వైద్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రవీందర్ బుధవారం మీడియాతో మాట్లాడారు. హోంగార్డు అంటే ప్రతి నెలా 1వ తారీఖునే జీతాలిచ్చేయాలా అని చిన్నచూపు చూశారని ఆవే దన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానం రాష్ట్రంలోని ఏ హోంగార్డుకూ జరగకూడదన్నారు. కాగా ఉస్మానియాలో చికిత్స పొందుతున్న రవీందర్‌ను రాష్ట్ర హోంగార్డు జేఏసీ చైర్మన్ నారాయణ పరామర్శించారు. రవీందర్ భార్య సంధ్యతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. రవీందర్‌కు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. హోంగార్డుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 16 వరకు విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నిరసన తెలిపిన హోంగార్డులు..: సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం హోంగార్డులను వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుతూ బుధవారం సాయంత్రం అపోలో డీఆర్డీఓ ఆసుపత్రి ఆవరణలో హోంగార్డులు ఆందోళనకు దిగారు. రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలనీ, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. సీఎందే బాధ్యత: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రవీందర్ ఆత్మహత్యాయ త్నా నికి కేసీఆరే బాధ్యత వహించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా 2017లో సీఎం కేసీఆర్ హోంగార్డులను పర్మనెంట్ చేస్తానని మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. హోంగార్డులకు బీజేపీ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలి: బండి అమెరికా పర్యటనలో ఉన్న ఎంపీ బండి సంజయ్ బుధవారం రాత్రి (భారత సమయం) హోంగార్డు కుటుంబ సభ్యులతోపాటు హోంగార్డ్ అసోసియేష న్ జేఏసీ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ వీడియోకాల్ చేసి మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ దృశ్యాలను వెంటనే బయటపెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. -
రవీందర్‌కు సీరియస్.. విధుల బహిష్కరణకు హోంగార్డ్ జాక్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: జీతాల ఆలసత్వంపై ఆవేదనతో.. ఆత్మహత్యకు ప్రయత్నించిన హోంగార్డు రవీందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రవీందర్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం అందుకున్న హోంగార్డు జేఏసీ ఆస్పత్రికి చేరుకోగా.. బుధవారం ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రవీందర్‌కు మద్దతుగా.. ఉస్మానియా హాస్పిటల్‌కు భారీగా తరలి రావాలని హోం గార్డ్ JAC పిలుపు ఇచ్చింది. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా విధుల బహిష్కరణకు పిలుపు ఇచ్చింది. అదే సమయంలో.. హోంగార్డులు ఎవరు అఘాయిత్యాలకు ప్రయత్నించొద్దని విజ్ఞప్తి చేసింది. జేఏసీ పిలుపు మేరకు హోంగార్డులు ఉస్మానియాకు తరలి వస్తున్నారు. ఇక శాంతిభద్రతల పరిరక్షణ పేరిట ఆస్పత్రికి భారీగా చేరుకుంటున్నాయి పోలీస్ బలగాలు. సకాలంలో జీతం రావట్లేదనే ఆవేదనతో చాంద్రాయణగుట్ట ట్రాఫిక్పీఎస్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. 55 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడరు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం గోషామహల్‌లోని ఓ ఏటీఎంకు వెళ్లి తన బ్యాంకు ఖాతాను చూసుకోగా ఇంకా జీతం పడలేదు. వెంటనే గోషామహల్లోనే ఉన్న హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో తన జీతం గురించి వాకబు చేశాడు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జీతం డబ్బులు జమ అవుతాయని వారు బదులిచ్చారు. అయినప్పటికీ ఆవేదనకు గురైన రవీందర్ సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మరోవైపు హోంగార్డులను పర్మినెంట్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై అధికార కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవితలను హోమ్ గార్డ్ జేఏసీ నేతలు కలిశారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో హోమ్ గార్డులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో.. ఈనెల 16, 17న పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది హోంగార్డుల జేఏసీ. ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎమ్మెల్యే రాజాసింగ్ హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మాట్లాడుతూ.. హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలి అని డిమాండ్ చేశారు. హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణలో పనిచేస్తోన్న 22వేల హోంగార్డులను పర్మినెంట్ చేయాలన్నారు. మరొక హోంగార్డు రవీందర్ మాదిరి ఆత్మహత్య ప్రయత్నం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. -
మీకు దండం సారూ.. మీ వల్లే నేను ఇప్పుడు బతికున్నా..
హైదరాబాద్: ఆర్పీరోడ్ లోని దర్గా ప్రాంతం..ఆదివారం ఉదయం..కొద్దిసేపట్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అక్కడ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం వస్తున్నారు. బందోబస్తులో భాగంగా మహంకాళి ఏసీపీ రవీందర్‌తో పాటు మిగతా పోలీసులు, నాయకులు అక్కడ ఉన్నారు. ఇంతలో ఓ మహిళ దూరం నుంచి పరుగెత్తుకుంటూ..అయాసపడుతూ వారి దగ్గరకు వచ్చింది. పోలీసులతో పాటు అందరూ ఏమైందా, అని కంగారు పడ్డారు. కానీ వచ్చీ రావడంతోనే ఆ మహిళ ఏసీపీ రవీందర్ వద్దకు వెళ్లి ‘మీకు దండం సారూ..మీ వళ్లే నేను ఇప్పుడు బతికున్నా..మీరు చేసిన సహాయం మరచిపోలేను..అప్పుడు ఆపరేషన్ చేయించడం వల్లే ప్రాణాలతో ఉన్నా అంటూ ఆయాసపడుతూ చెప్పింది. వెంటనే అక్కడున్న వాళ్లు ఆమెను కొద్దిసేపు కూర్చోబెట్టి మంచి నీళ్లు తాగించి..ఏమైందంటూ ఆరాతీయగా...తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యంతో ఉన్న ఆమెకు ప్రస్తుత మహంకాళి ఏసీపీ రవీందర్ సొంత డబ్బుతో ఆస్పత్రిలో చేరి్పంచి ఆపరేషన్ చేయించిన సంగతి చెప్పింది. 2014 సంవత్సరంలో టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్లో రవీందర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కన కార్వాన్కు చెందిన కవిత అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆస్పత్రిలో చేర్పించి సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించగా పూర్తి ఆరోగ్యంతో బయటపడింది. ఆ తర్వాత మళ్లీ ఆయన ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లడంతో కలవలేకపోయింది. ఆదివారం ఆమె కార్వాన్ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళుతుంది. బస్సులో నుంచి బందోబస్తు విధుల్లో ఉన్న ఏసీపీ రవీందర్‌ను చూసి..గుర్తించి బస్సు ఆపాలని డ్రైవర్‌ను కోరింది. కానీ డ్రైవర్ ఆపకుండా ప్యాట్నీ సిగ్నల్ వరకు వెళ్లాడు. సిగ్నల్ దగ్గర బస్సు ఆగడంతో ఆమె బస్సు దిగి పరుగెత్తుకుంటూ దర్గా వరకు వచి్చంది. వచ్చీ రావడంతో ఆయనకు దండాలు పెడుతూ కన్నీరు పెట్టింది. మీ వల్లే ఈ రోజు ప్రాణాలతో ఉన్నా సారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మీరు కలుస్తారో లేదో అనుకుంటూ పరుగెత్తుకొచ్చాను అంటూ చెప్పుకొచి్చంది. మీరు ఇంకా పెద్ద పోస్టులోకి రావాలి, ఎమ్మెల్యే అంత ఎదగాలి సారూ అంటూ కృతజ్ఞతాభావాన్ని చాటింది. ‘నా అన్న కోసం వెండి రాఖీ కొని తీసుకుని వచ్చి కడతా’ అంటూ చెప్పింది. అంతే కాకుండా తన ఫోన్లో భద్రపరుచుకున్న ఏసీపీ ఫొటోను చూపించి ఆశ్చర్య పరిచింది. ఈ సంఘటన చూసిన పోలీసులు, మీడియా ప్రతినిధులు, నాయకులు అందరూ ఆ మహిళ కృతజ్ఞతాభావాన్ని, ఏసీపీ మానవతా దృక్పథాన్ని అభినందించారు. -
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్‌ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్‌రూమ్‌లు సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్‌ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
విల్లు.. వివాదాలకు చెల్లు
రఘు వయసు 51. అప్పటివరకూ కష్టపడి కూడబెట్టింది ఫిక్స్డ్ డిపాజిట్‌గా దాచుకున్నాడు. నామినీగా భార్య పేరు రాశాడు. కొన్నాళ్లకు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. మరి.. రఘు డిపాజిట్లు మొత్తం నామినీగా ఉన్న భార్యకే దక్కాయా? అంటే లేదనే చెప్పాలి. సరస్వతి భర్త చిన్న వయసులోనే కాలం చేశాడు. వారికి పిల్లలు కూడా లేరు. ఉన్నదల్లా తల్లి, తండ్రి, అత్త మాత్రమే. ఈ పరిస్థితుల్లో సరస్వతి కూడా మరణిస్తే ఆమె సంపాదించినది ఎవరికి దక్కుతుంది? ముగ్గురికీ అనుకుంటున్నారా? కానీ చట్టప్రకారం ఒక్క అత్తకు మాత్రమే దక్కింది. సాక్షి, హైదరాబాద్: ఇలాంటి ఘటనలు ఏ ఒకరిద్దరికో పరిమితం కాదు.. ఇటీవలి కాలంలో చాలా మంది ఇళ్లలో ఎదురవుతున్నవే. మరి ఒక వ్యక్తి తన ఆస్తులను ఇష్టం వచ్చిన వారికి ఇవ్వాలనుకుంటే ఎలా? నామినీకి, వీలునామాకు తేడా ఏమిటి? దాన్ని ఎప్పుడు రాయాలి.. ఎలా రాయాలి లాంటి వివరాలతో కథనం. వీలునామా అంటే... : ఒక వ్యక్తి మరణం తరువాత తన స్థిర, చరాస్తులు ఎవరికి చెందాలో, ఎలా పంపకాలు జరగాలో తెలియజెప్పే చట్టబద్ధమైన డాక్యుమెంటే వీలునామా. మరణ వాంగ్మూలానికి ఎంత చట్టబద్ధత ఉందో అలాంటి చట్టబద్ధతే ఈ వీలునామాకు ఉంది. మనిషి బతికున్నంత వరకు వీలునామా ఎన్ని సార్లయినా మార్చుకోవచ్చు. కానీ చివరిసారిగా రాసిన వీలునామానే చట్టప్రకారం చెల్లుబాటు అవుతుంది. వీలునామాపై ఇద్దరు సాక్షుల సంతకం తప్పనిసరి. ఆర్యోగంగా, మానసికంగా సరిగ్గా ఉన్న మేజర్లు రాసిన విల్లు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. భారతీయ వారసత్వ చట్టం సెక్షన్ 59 ప్రకారం విల్లు రాయాలి. నామినీ వేరు.. వారసులు వేరు..: చాలా మంది జీవిత బీమాకో.. బ్యాంకు ఖాతాకో.. ఇతర ఆర్థిక లావాదేవీలకో.. నామినీగా ఎవరినో ఒకరిని పెడతారు. తమకేమన్నా అయితే నామినీకి ఆ మొత్తం వెళుతుందనుకుంటారు. అయితే చట్టప్రకారం నామినీ అనేది వారసుల కిందకు రాదు. వ్యక్తి మరణించిన తర్వాత ఆ నగదు నామినీకి చెందదు. వారసుల్లో నామినీ ఉంటే వారికి చట్టప్రకారం వాటా మాత్రమే వస్తుంది. నామినీగా ఒక వారసుడి పేరో లేదా వారసురాలి పేరో పెట్టినంత మాత్రాన ఆ నగదు మొత్తం వారికే చెందదు. ఇది తెలియని చాలా మంది నామినీగా ఫలానా వారి పేరు పెట్టారని వారికి రావాల్సిన వాటాను కోల్పోతుంటారు. వీలునామా రిజిస్ట్రేషన్అవసరమా?..: వీలునామాను రిజిస్ట్రేషన్ చేయిస్తే.. దాంతో లబ్దిదారులు బ్యాంకు రుణాలు, ఇతర అవసరాలకు వాడుకొనే వీలు ఉంటుంది. రిజిస్టర్ అయిన వీలునామాకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నామమాత్రపు చార్జీతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. తెల్ల కాగితంపై రాసినా చట్టబద్ధమే. కుటుంబంలో కనీసం ఒక్క వ్యక్తికయినా వీలునామాను ఎక్కడ భద్రపరిచిందీ తెలియజేయాలి. ఆన్లైన్లో వీలునామా సేవల కోసం ఓ సంస్థ..: అత్యంత స్వల్ప రుసుముతో ఆన్లైన్ ద్వారా చట్ట ప్రకారం విల్లు సిద్ధం చేసే లక్ష్యంతో ఆసాన్విల్ అనే సంస్థ ఏడాది క్రితం ప్రారంభమైంది. ఈ సంస్థ రూపకర్త తెలంగాణ వ్యక్తి విష్ణు చుండి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ ఉన్నట్లు.. వీలునామా కూడా ఉండాలన్నదే ఆ సంస్థ లక్ష్యం. అంతేకాదు.. తమ వద్దకు వచ్చే వారిని సేవా కార్యక్రమాలు, అవయవదానం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు రూ. 100 కోట్లను వివిధ చారిటీలకు అందించారు. దీనికిగాను 2018లో ది సొసైటీ ఆఫ్ విల్ రైటర్స్ నుంచి గుర్తింపు పత్రం అందుకున్నారు. రూ. 1,50,000 కోట్లు.. ఎవరికీ చెందకుండా దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాల్లో, బీమా పాలసీ కంపెనీల్లో పేరుకుపోయిన నగదు లెక్క ఇది. (లెక్కల్లోకి రానిది ఈ మొత్తంకన్నా ఇంకా ఎక్కువ ఉండొచ్చు.) స్పృహలో లేనప్పుడు రాస్తే చెల్లదు... సొంతంగా సంపాదించిన ఆస్తులకు, ఆదాయానికి సంబంధించి మాత్రమే వీలునామా రాయొచ్చు. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు చట్టప్రకారం వారసులకే ఆ ఆస్తులు దక్కుతాయి. ఆ వ్యక్తి మరణానంతరమే వీలునామా అమల్లోకి వస్తుంది. మత్తులో ఉన్న సమయంలోనూ, తీవ్ర అనారోగ్యంగా ఉన్నప్పుడు, తాను ఏం చేస్తున్నానన్న దానిపై స్పృహ లేని వ్యక్తులు వీలునామా రాయడానికి అవకాశం లేదు. – సామల రవీందర్, ప్రభుత్వ న్యాయవాది, హైకోర్టు -
బర్త్‌డే కానుకగా భర్తకు 6 అడుగుల గిఫ్ట్ ఇచ్చిన నటి.. వైరల్ వీడియో!
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ జంట పాపులర్ అయిపోయింది. దీనికి కారణం నిర్మాత రవీందర్ అతి బరువు ఉండటమే. మహాలక్ష్మి మాత్రం పొట్టిగా, నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ కూడా చేశారు నెటిజన్లు. (ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్ అయిన హీరోయిన్) వారి పెళ్లి అయి రెండేళ్లు దాటింది.. ఈ జర్నీలో వారిద్దరిపై భారీగానే ట్రోలింగ జరిగింది. ఒకసారి అయితే ఏకంగా ఈ జంట విడాకులు తీసుకుంటుందని ప్రచరాం జరిగింది. పెళ్లి అయి అన్నేళ్లైనా ఇంకా ఎందుకు తల్లివి కాలదేని ఇలా పలు రకాలుగా ఆ జంటపై పలు కామెంట్లు వచ్చేవి. అయితే అవేవి తమను బాధించవని, తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి సంతోషంగా ఉన్నామని బహిరంగానే ఆ జంట చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ప్రముఖ సింగర్‌తో అనిరుధ్ ప్రేమాయణం) తాజాగా రవీందర్ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు 6 అడుగుల ప్రత్యేక బహుమతిని ఇచ్చి మహాలక్ష్మి ఆశ్చర్య పరిచింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రత్యేక బహుమతి ఏమిటంటే... 6 అడుగుల ఎత్తు ఉన్న రవీంద్ర ఫోటోను చక్కటి పెయింటింగ్‌తో తయారు చేయించి తన భర్తకు పుట్టినరోజు కానుకగా ఇచ్చింది. మహాలక్ష్మి బర్త్‌డే విషెష్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసింది. 'జీవితంలో నాకు మళ్లీ ధైర్యం తెచ్చిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరే నా బలం. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని.' అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు లైక్‌లతో పాటు పాజిటివ్ కామెంట్లు పెట్టారు. పలువురు రవీందర్‌కు విషెస్ చెబుతూ.. చెత్తగ మాట్లాడే వారిని పట్టించుకోకుండా ఇలా సంతోషంగా జీవితంలో ముందుకు సాగాలని కోరారు. -
కూతురు ప్రేమపెళ్లి.. ఇటుకలపల్లిలో సర్పంచ్ వీరంగం..
సాక్షి, వరంగల్ జిల్లా: నర్సంపేట మండలం ఇటికాలపల్లి సర్పంచ్ మండల రవీందర్ వీరంగం సృష్టించారు. కూతురు కావ్యశ్రీ అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం ఇష్టంలేని అమ్మాయి తండ్రి సర్పంచ్ ఆగ్రహంతో తన బిడ్డను పెళ్ళి చేసుకున్న యువకుడి ఇంటితో పాటు వారి సహకరించిన ఇద్దరు స్నేహితుల ఇళ్లపై దాడి చేయించాడు. నిప్పంటించడంతో పర్నిచర్ దగ్ధమయ్యింది. ప్రేమజంట హసన్‌పర్తి పరిధిలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ప్రేమపెళ్లి అనంతరం సర్పంచ్ హసన్‌పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కావ్యను తనతో రమ్మని తండ్రి ఎంత బతిమలాడిన రాకపోవడంతో ఆగ్రహంతో స్వగ్రామానికి వెళ్లి రంజిత్ ఇంటితో పాటు అతనికి సహకరించిన ఇద్దరు మిత్రుల ఇళ్లను దగ్ధం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు! -
ఓయూ కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు కృషి
లాలాపేట: ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో దాదాపుగా రూ. 120 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ యాదవ్ తెలిపారు. రీఫార్మ ఫర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్లో భాగంగా రెండేళ్ల కాలంలో చేపట్టిన సంస్కరణల ప్రగతిని వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. ఓయూ వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో కలిసి ఇనిషి యేటివ్స్.. ఈవెంట్స్... అచీవ్మెంట్స్ 2021–23 పేరుతో రూపొందించిన ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. పాలనా వ్యవస్థను గాడిలో పెట్టడం అకడమిక్ పరిపాలనా వ్యవస్థలను పటిష్టం చేయడం, విద్యా పరిశోధనా రంగాల్లో మేటిగా నిలపడమే ధ్యేయంగా తాము చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. మరో వందేళ్ల పాటు ఓయూ తన కీర్తి ప్రతిష్టను కొనసాగించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్‌రావు, విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో యూనివర్సిటీని విద్యారంగంలో అగ్రగామిగా నిలిపే కార్యక్రమం కొనసాగతోందని స్పష్టం చేశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఓయూ 22వ స్థానాన్ని సాధించడం, డబ్ల్యూసీఆర్‌సీ లీడర్స్ ఆసియా వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్ 2022 యూకేలోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో అవార్డు అందుకోసం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. రూ. 120 కోట్లతో బాయిస్ హాస్టల్స్, శతాబ్ది నూతన పరిపాలనా భవనం, పైలాన్, ఓపెన్ ఎయిర్ థియేటర్‌తో పాటు అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వీసీ వివరించారు. ఓయూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు తక్ష పేరుతో ప్రత్యేకంగా మూడు రోజుల కార్యక్రమాలతో పాటు ఉస్మానియా ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించామన్నారు. అకడమిక్ కేలండర్‌ను సరిదిద్దడం, ఏటా స్నాతకోత్సవం నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని వీసీ వెల్లడించారు. మార్కెట్‌కు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగు పరచడంతో పలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. ఇంజినీరింగ్‌లో కృత్రిమ మేధ మిషన్ లెరి్నంగ్, మైనింగ్, బీఏ హానర్స్, డిగ్రీలో ఏ కోర్సు చదివిన వారైనా ఆర్ట్స్ సోషల్ సైన్సెస్‌లో పీపీ చేసే వినూత్న అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చామని వీసీ వివరించారు. ఇది సివిల్ సర్విసెస్ వైపు వెళ్లేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. వివిధ అంశాలపై దాదాపు 10 విదేశీ యూనివర్సిటీలతో ఎంఓయూ చేసుకున్నామన్నారు. ఎలాంటి ఫైరవీలు, ఒత్తిళ్లకు తావు లేకుండా ఆన్లైన్ అర్హతా పరీక్షలు, అకడమిక్ మెరిట్ ఆధారంగా అర్హులైన వారికే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించామన్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, బోధన, బోధనేతర సిబ్బంది యూనివర్సిటీ తీసుకునే నిర్ణయాల్లో భాగస్వాములై ఉస్మానియా యూనివర్సిటీ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగరవేసేందుకు కలిసి రావాలనీ ఓయూ వీసీ రవీందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్లు స్టీవెన్సన్, జి.మల్లేషం, శ్రీరాం వెంకటేష్, గణేష్, వీరయ్య, ప్యాట్రిక్, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, సీనియర్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ వర్సిటీలో పాలకమండలి సభ్యులు, వైస్ చాన్స్‌లర్ మధ్య న డుస్తున్న పోరు మరో స్థాయికి చేరుకుంది. శుక్రవా రం వీసీ రవీందర్ గుప్తా ఉన్నతవిద్యా శాఖ కమిష నర్ నవీన్ మిట్టల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వర్సిటీ నుంచి ప్రకటన విడుదల చేశారు. మరోవై పు నవీన్ మిట్టల్ చైర్మన్‌గా శుక్రవారం హైదరాబాద్ లోని రూసా భవనంలో తెయూ పాలకమండలి 57వ సమావేశం జరిగింది. వీసీ రవీందర్ గుప్తా న వీన్ మిట్టల్‌పై ఆరోపణల పర్వాన్ని మరింత పెంచ గా, పాలకమండలి సభ్యులు సైతం తమ చర్యలకు మరింత పదును పెడుతున్నారు. ఏకంగా వర్సిటీ వ్యవహారాల విషయమై ఉన్నత స్థాయి దర్యాప్తు చే యించేందుకు, ముగ్గురు రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసు లు పెట్టేందుకు తీర్మానం చేయడం గమనార్హం. నవీన్ మిట్టల్ చైర్మన్‌గా.. వర్సిటీలో చోటుచేసుకున్న అక్రమాలపై ఉన్నత స్థా యిలో విచారణ చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు పాలకమండలి తీర్మానం చేసింది. తె లంగాణ యూనివర్సిటీల చట్టం 1991 మేరకు సెక్ష న్ 18(1) ప్రకారం 10 మంది సభ్యుల కోరం ఉండడంతో ఈసీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి వీసీ హాజరు కాకపోవడంతో ఉన్నతవిద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ చైర్మన్‌గా వ్యవహరించా రు. 1991 తెలంగాణ యూనివర్సిటీల చట్టంలోని సెక్షన్ 15(1) ప్రకారం రిజిస్ట్రార్‌ను నియమించేందుకు ఉన్న పూర్తి అధికారంతో పాలకమండలి ప్రొఫెసర్ యాదగిరిని పునర్నియామకం చేసింది. 2021 అక్టోబర్ 30న యాదగిరిని రిజిస్ట్రార్‌గా ఈసీ నియమిస్తే, వర్సిటీల చట్టంలోని 50.6(ఏ) నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్లుగా వీసీ నియమించడం చట్టవ్యతిరేకమన్నారు. ఈసీ నియమించిన రిజిస్ట్రార్ పదవీకాలం పూర్తయితే లేదా ఆ స్థానం ఖాళీ గా ఉంటే మాత్రమే కొత్త రిజిస్ట్రార్‌ను నియమించాల్సి ఉంటుందన్నారు. అయితే ఈసీ ఆమోదం లేకుండా శివశంకర్, విద్యావర్ధిని, నిర్మలాదేవి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించారు. అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగం తదితరాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, ఏసీబీ డీజీ, నిజామాబాద్ సీపీలతో విచారణ చేయించాల ని తీర్మానించారు. 2022–23, 2023– 24 బడ్జెట్‌కు సంబంధించి సైతం విచారణ చేపట్టాలని, ఈ నెల 12న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించా రు. తెయూలో అక్రమాలపై వరుస కథనాలను ప్రచురించిన ‘సాక్షి’కి ధన్యవాదాలు తెలిపారు. స మావేశంలో ఈసీ సభ్యు లు గంగాధర్ గౌడ్, వసుంధరా దేవి, మారయ్య గౌడ్, ఎన్ఎల్ శాస్త్రి, రవీందర్‌రెడ్డి, ఆరతి, నసీమ్, ప్రవీణ్‌కుమార్, చంద్రకళ పాల్గొన్నారు. వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.. తెయూ (డిచ్పల్లి) : నాపై తప్పుడు, లేనిపోని అవినీతి ఆరోపణలతో తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టను నాశనం చేస్తూ.. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ నవీన్‌మిట్టల్ లక్ష్యమని తెయూ వీసీ ప్రొఫెసర్ డి రవీందర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని వారాలుగా తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని పరిణామాలపై తీవ్ర వేదనతో, బాధతో మీడియా ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తెయూ వీసీగా నియమించారని, అయితే నవీన్ మిట్టల్ ఇప్పుడు బ్యాక్‌డోర్ పద్ధతుల ద్వారా తన పరువు తీయాలని చూస్తున్నారని అన్నారు. యూనివర్సిటీ కొన్ని నిరాధారమైన ఆరోపణలకు వివాదాలకు కేంద్రంగా మారిందన్నారు. వీటన్నింటికీ నవీన్ మిట్టల్ కారణమని చెప్పడానికి తనకు బాధగా ఉందన్నారు. మిట్టల్ తన నామినీ అయిన ప్రొఫెసర్ యాదగిరిని రిజిస్ట్రార్‌గా ఎలాగైనా నియమించాలనే తపనతో ఇదంతా చేస్తున్నారన్నారు. ప్రొఫెసర్ యాదగిరిని తాను వ్యతిరేకిస్తున్నానని, వర్సిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో సహకరించలేడని పేర్కొన్నారు. ఏప్రిల్ 19, 2023 న హైదరాబాద్ రూసా కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశాన్ని తాను వ్యతిరేకించినప్పటికీ, రిజిస్ట్రార్‌గా యాదగిరిని నియమించాలని తీర్మానాన్ని ఆమోదించారని తెలిపారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించి ఈసీ నిర్ణయాలపై స్టే తెచ్చినట్లు తెలిపారు. ఒకే ఒక్క ఐఏఎస్ అధికారి తన ఉద్దేశాలు, చట్టవిరుద్ధమైన నిర్ణయాలతో విద్యాశాఖలోని మొత్తం వ్యవస్థలను తారుమారు చేయడం దురదృష్టకరమని వీసీ పేర్కొన్నారు. తెలంగాణ గ్రామీణ విద్యార్థులకు సేవలందిస్తున్న గొప్ప యూనివర్సిటీ ఖ్యాతిని పణంగా పెట్టి ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ యూనివర్సిటీకి విడుదల చేయాల్సిన రూసా (రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్షా అభియాన్) మంజూరు నిధులను రూ.20 కోట్లను మిట్టల్ నిలిపివేస్తున్నారని ఆరోపించారు. రూసా డైరక్టర్‌గా ఉన్న మిట్టల్ తనకు నచ్చిన వ్యక్తిని ఇక్కడ రిజిస్ట్రార్‌గా నియమించినప్పుడే వర్సిటీకి ఈ మొత్తాన్ని విడుదల చేసేందుకు సుముఖంగా ఉండటం శోచనీయమన్నారు. మిట్టల్ అనవసర జోక్యాన్ని అడ్డుకుని యూనివర్సిటీని యథావిధిగా నిర్వహించేలా చూడాలని సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఇతర ఉన్నతాధికారులకు వీసీ విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఏ ఏజెన్సీ ద్వారానైనా న్యాయవిచారణకు తాను సిద్ధంగా ఉన్నట్లు వీసీ స్పష్టం చేశారు. -
మహాలక్ష్మి తల్లి కాబోతుందా? ఫొటో వైరల్
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ జంట ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. దీనికి కారణం నిర్మాత రవీందర్ అతి బరువు ఉండటమే. మహాలక్ష్మి మాత్రం పొట్టిగా, నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ చేశారు నెటిజన్లు. అయితే అవేవి తమను బాధించవని, తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామంటూ ట్రోల్స్‌పై ఈ జంట స్పందించింది. చదవండి: ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో.. అంతేకాదు తరచూ ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేస్తూ ట్రోలర్స్ నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది ఈ జంట. అయినప్పటికీ వారిపై ట్రోల్స్ ఆగడం లేదు. ఇదిలా ఉంటే ఈ జంట త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. మహాలక్ష్మి గర్భవతి అయినట్లు సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ జంట డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫొటోలను షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను రవీందర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే ఈ ఫొటోలో మహాలక్ష్మీ కాస్తా లావుగా, పొట్ట భాగం ముందుకు ఉన్నట్లుంది. చూస్తుంటే ఆమె గర్భవతి అన్నట్లుగాకనిపించింది. దీంతో ఆమెను చూసి మహాలక్ష్మి ప్రెగ్నెంటా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దీనికి రవీందర్ ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే అదే నిజం అనేట్టుగా ఉంది. చదవండి: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక ‘ఐ లవ్ యూ చెప్పడంలోనే నా సంతోషం లేదు.. నేను వ్యక్తం చేయకపోయినా నువ్వు నా కోసమే జీవించావంటూ నువ్వు చూపించే నీ నిజమైన ప్రేమ కూడా కారణం’ అంటూ ఈ ఫొటోకి రాసుకొచ్చాడు. దీంతో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 1న ఈ జంట ఇరువురి కుంటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. కెరీర్ మధ్యలో, మహాలక్ష్మి అనిల్ నేరేడిమిల్లిని వివాహం చేసుకుంది. మహాలక్ష్మికి తన మొదటి భర్తతో మగబిడ్డ జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) -
ఓయూలో అడోబ్ పరిశోధనాకేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా క్యాంపస్‌లో అత్యాధునిక సమీకృత పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అడోబ్ ముందుకొచ్చిందని ఉస్మానియా యూని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో, ఉస్మానియా పూర్వవిద్యార్థి శంతను నారాయణ్ హామీ ఇచ్చినట్టు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న రవీందర్ అక్కడ ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. ఈ వివరాలను శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ఫోన్ ద్వారా పంచుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో శంతను నారాయణ్‌తో భేటీ అయినట్టు తెలిపారు. ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్‌లో భాగంగా మెషిన్ లెర్నింగ్ సాంకేతికతతో విద్యార్థులు, పరిశోధకులకు ఉప యోగపడేలా ప్రతిపాదనలు రూపొందించాలని అడోబ్ సీఈవో కోరినట్టు తెలిపారు. శాన్‌ఫ్రాన్సి స్కోలో పలువురు పూర్వ విద్యార్థులను కలసి ఓయూ నిధుల సమీకరణపై చర్చించినట్టు చెప్పా రు. ఎంఐటీ, హార్వర్డ్ సహా ఇతర అమెరికన్ వర్సిటీలు ఆర్థిక సమీకరణ కోసం ఉపయోగించే ఎండోమెంట్లను అధ్యయనం చేయాలని, ఉస్మాని యాకు సైతం ఓ క్రమబద్ధమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలని శంతను నారాయణ్ ప్రతి పాదించినట్టు రవీందర్ చెప్పారు. ఓయూ మరో పూర్వవిద్యార్థి, ప్రఖ్యాత అప్లైడ్ మెటీరియల్ శాస్త్ర వేత్త, అప్లైడ్ వెంచర్స్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఓంకారం నలమాసతో కూడా చర్చించి నట్టు తెలిపారు. 21–పాయింట్స్ అజెండా, క్లస్టర్ సిస్టమ్, ఫ్యాకల్టీ పబ్లికేషన్లకు వీసీ అవార్డును ప్రవేశపెట్టడం, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు, సంక్రమిత త్రీడీ తయారీ కేంద్రం ఏర్పాటు సహా వివిధ సంస్కర ణల గురించి వివరించినట్టు చెప్పారు. సిలికాన్ వ్యాలీలో పన్నెండు మంది పూర్వ విద్యార్థులు, వివిధ కంపెనీల సీఈవోలతో భేటీ అయినట్టు చెప్పారు. ఓయూకు సహకరించేందుకు వారు సమ్మతిం చినట్టు తెలిపారు. -
విద్యార్థిగా చేరి.. నాయకుడిగా వెళ్లండి
సాక్షి, హైదరాబాద్: వినూత్న ఆలోచనలతో, ఆధునిక సంస్కరణలతో ఉస్మానియా యూనివర్సిటీ కీర్తిప్రతిష్టలను పెంచేందుకు కృషి చేస్తున్నామని ఓయూ ఉప కులపతి దండెబోయిన రవీందర్ అన్నారు. సంస్కరణలు, పనితీరు, రూపాంతరం అనే నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయ చరిత్రలో తొలిసారిగా క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చి నిజాం కాలేజీ, విశ్వవిద్యాలయ మహిళా కళాశాల సహా 9 కళాశాలలను ఎంపిక చేసి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఓయూ వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో రవీందర్ శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఓయూ పురోగతిని ఆయన వివరించారు. ఆయన చెప్పిందేంటంటే... సివిల్ సర్వీస్ అకాడమీ.. ♦హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. దీనివల్ల ఉద్యోగాల కల్పన తేలికవుతుంది. కంపెనీలకు అనుగుణమైన నైపుణ్యాలను విద్యార్థులకు తర్ఫీదునిచ్చే అవకాశం ఏర్పడింది. అంతర్జాతీయ విద్యా అవకాశాలపట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం సహా ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందించేందుకు ఈ కేంద్రం పనిచేస్తోంది. ♦పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు సివిల్ సర్వీసెస్ అకాడమీ ఏర్పాటు చేశాం. విద్యార్థిగా ఓయూలో చేరి నాయకత్వ లక్షణాలతో బయటకు వెళ్లాలన్నదే ఈ అకాడమీ లక్ష్యం. విద్యార్థి సమన్వయ కేంద్రం, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు సత్ఫలితాలనిస్తుంది. ♦సెమినార్లు, సమావేశాలు, చర్చాగోష్టులు, ప్రదర్శనలు సహా ఇతర ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థులు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా స్టూడెంట్ డిస్కోర్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. క్యాంపస్‌లో రాజకీయ కార్యకలాపాలకు అవకాశం లేకుండా వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ ఇది అమలులో ఉంటుంది. విద్యార్థులకు యునీక్ ఐడీ.. ♦సెంటినరీ హాస్టల్ విద్యార్థులకు యునీక్ ఐడెంటిటీ సంఖ్యను కేటాయించి ప్రతి ఒక్కరికీ వైఫై సౌకర్యం అందుబాటులోకి తెచ్చాం. సెంటినరీ హాస్టల్ బిల్డింగ్ చుట్టూ 120 సీసీ కెమెరాలు అమర్చి విద్యార్థుల రక్షణకు పెద్దపీట వేశాం. క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణం కల్పించి శాంతిభద్రతలను కట్టుదిట్టం చేసే బాధ్యతను విశ్రాంత ఆర్మీ ఉద్యోగులకు అప్పగించాం. ♦రూ. 11 కోట్లతో 300 మంది నిజాం కళాశాల విద్యార్థినుల కోసం నూతన హాస్టల్ భవనాన్ని నిర్మించాం. రూ.26 కోట్లతో 500 మంది బాలుర కోసం నిర్మించిన హాస్టల్ భవనాన్ని విద్యార్థినుల కోసం కేటాయించాం. మరిన్ని బాలికల నూతన హాస్టల్ భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. విద్యార్థినులకు ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించాం. ♦క్యాంపస్‌లోని ఓయూ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండో పసిఫిక్ స్టడీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. సోషల్ సైన్సెస్‌లో పరిశోధనలకు ఊతమిచ్చేలా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ కేంద్రాలు నెలకొల్పాం. ♦‘ఆరోగ్యం, సౌందర్య సాధనాలలో సహజ పదార్థాల వాడకం’ హైబ్రిడ్ మాస్టర్ ప్రోగ్రామ్‌ను నిర్వహించడానికి ఫ్రాన్స్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బోర్డియాక్స్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటివ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్నాం. -
కష్టపడితే నెలలో ‘గ్రూప్స్’ కొట్టొచ్చు
సాక్షి, హైదరాబాద్: పరీక్షల కోసం కాకుండా, పరిశోధనాత్మకంగా అభ్యాసన చేస్తే గ్రూప్స్‌లోనే కాదు సివిల్స్‌లోనూ రాణిస్తారని ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ డి.రవీందర్ అభిప్రాయపడ్డారు. కోచింగ్ సెంటర్స్‌కు వెళ్తేనే పోటీ పరీక్షలో విజయం సాధిస్తామనేది భ్రమని చెప్పారు. గ్రూప్స్‌లో ఇంటర్వ్యూ తొలగించినందున పరిజ్ఞానం ఉన్నవాడికి పారదర్శకంగా ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. గ్రూప్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ నేపథ్యంలో అభ్యర్థులు ఏ విధంగా సన్నద్ధమవ్వాలనే అంశంపై రవీందర్ ‘సాక్షి’తో పంచుకున్న అంశాలు ఆయన మాటల్లోనే... లక్ష్య సాధన దిశగా విద్యార్థుల పాత్రేంటి? ఉస్మానియా యూనివర్సిటీ ఈ మధ్య దీనిపై లోతుగా అధ్యయనం చేసింది. చాలామంది విద్యార్థుల్లో అంతర్లీనంగా సామర్థ్యాలున్నాయి. దృష్టి పెడితే పోటీ పరీక్షల్లో విజయం సాధించగల సత్తా ఉంది. కానీ వాళ్లు స్వల్పకాలిక లక్ష్యాలకే ప్రాధాన్య మిస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నారు. దీంతో గ్రూప్స్ పోటీకి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోలేకపోతున్నారు. దీన్ని గమనిం చిన తర్వాత ఓయూలో సివిల్స్ అకాడమీని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీని కోసం రూ.37 లక్షలు ఖర్చు పెట్టాం. కోచింగ్ కేంద్రాలతో ఫలితం ఎలా ఉంటుంది? లక్షల మంది విద్యార్థులు కోచింగ్ కేంద్రాల బాట పడుతున్నారు. అక్కడికి వెళ్తేనే పోటీ పరీక్షల్లో రాణిస్తామని భ్రమ పడుతున్నారు. నా అనుభవం ప్రకారం ఇది శుద్ధ దండగ. అక్కడ కేవలం షార్ట్ కట్ పద్ధతులు మాత్రమే చెబుతారు. ఒకరకంగా ఇది మల్టిపుల్ చాయిస్ లాంటిదే. ఆ మాదిరి ప్రశ్న వస్తేనే అభ్యర్థి సమాధానం ఇవ్వగలడు. కానీ సొంతంగా సబ్జెక్టుపై అవగాహన పెంచుకుంటే మెరుగైన రీతిలో గ్రూప్స్‌లో రాణించే వీలుంది. కాబట్టి కోచింగ్ కేంద్రాలకు వెళ్లి విద్యార్థులు తమ విలువైన కాలాన్ని వృథా చేసుకోవద్దు. ఏం చదవాలి? గ్రూప్స్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవాలి. ముఖ్యంగా 8 నుంచి ఇంటర్ వరకూ ఉన్న పుస్తకాలను అభ్యసించాలి. వీటిల్లో లోతైన విషయ పరిజ్ఞానం ఉంటుంది. ఎన్సీఈ ఆర్టీ, సీబీఎస్సీ ఇంటర్మీడియెట్ పుస్తకాలు.. రాష్ట్ర సిలబస్‌తో పోలిస్తే పోస్ట్‌గాడ్యుయేషన్ పుస్తకాలతో సమానం. ప్రతీ పాఠం తర్వాత పాఠానికి కొనసాగింపు ఉంటుంది. దీనివల్ల సబ్జెక్టుపై పట్టు వస్తుంది. ఫలితంగా గ్రూప్స్‌లో ఏ రూపంలో ప్రశ్న వచ్చినా తేలికగా సమాధానం ఇవ్వగలిగే సత్తా విద్యార్థులకు ఉంటుంది. ఆప్షన్స్ ఎంపిక ఎలా ఉండాలి? ఈ మధ్య గ్రూప్–2లో సోషల్ సబ్జెక్టు ఆప్షన్‌గా తీసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులే మంచి స్కోర్ సాధించారు. కొత్త సబ్జెక్టు అయితే, మూలాల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి లోతుగా అధ్యయనం చేసే విద్యార్థి ఆప్షన్ విషయంలో ఏది తీసుకున్నా మెరుగైన ఫలితాలే ఉంటాయి. సివిల్స్‌లో కూడా ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. తక్కువ సమయంలో ప్రిపరేషన్ ఎలా? సాధ్యమే. రోజూ ఒక గంట ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు చదవాలి. ఆ తర్వాత దినపత్రికల్లో సంపాదకీయాలు చదవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రముఖ రచయితల పుస్తకాలు చదవాలి. పోటీ పరీక్షలకు గ్రూప్ డిస్కషన్స్ చాలా ముఖ్యం. ఈ తరహా చర్చల వల్ల లోతైన పరిజ్ఞానం అలవడే వీలుంది. నెల రోజులు సీరియస్‌గా చదివితే కోచింగ్ సెంటర్‌కు వెళ్లకుండానే గ్రూప్స్ కొలువు కొట్టొచ్చు. అలాగే, ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. మానసిక ఒత్తిడిని జయించాలి. సమయపాలన చాలా ముఖ్యం. దీనిపై ప్రిపరేషన్ నుంచే దృష్టి పెట్టాలి. -
World Senior Wrestling Championship: రవిందర్ ఓటమి
World Senior Wrestling Championship: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రవీందర్ దహియాకు నిరాశ ఎదురైంది. నార్వేలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో ఆదివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 61 కేజీల విభాగం కాంస్య పతక పోరులో రవీందర్ 0–10తో హరుతున్యాన్ (అర్మేనియా) చేతిలో ఓటమి చవిచూశాడు. భారత్‌కే చెందిన పంకజ్ (57 కేజీలు), రోహిత్ (65 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో... యశ్ (74 కేజీలు), గౌరవ్ (79 కేజీలు), పృథ్వీరాజ్ (92 కేజీలు), అనిరుధ్ (125 కేజీలు) తొలి రౌండ్లో పరాజయం పాలయ్యారు. చదవండి: Ind W Vs Aus W: 30 ఏళ్ల తర్వాత... తొలిసారిగా.. -
జూనియర్ల జోరు
వుఫా (రష్యా): జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రవీందర్ ‘బంగారు’ ఆశలు ఫైనల్లో ఆవిరయ్యాయి. 61 కేజీల విభాగంలో అతను రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఇరాన్ రెజ్లర్ రహ్మాన్ ముసా అమోజద్కలి 9–3తో రవీందర్‌ను ఓడించాడు. రెపిచేజ్ దారిలో ఉన్న రజతం అవకాశాల్ని యశ్ (74 కేజీలు), పృథ్వీ పాటిల్ (92 కేజీలు), అనిరుధ్ (125 కేజీలు) సద్వినియోగం చేసుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో మరో మూడు కాంస్య పతకాలు చేరాయి. రజతం సహా మొత్తం 6 పతకాలు ఫ్రీస్టయిల్ రెజ్లర్లు గెలిచారు. 74 కేజీల కాంస్య పతక పోరులో యశ్ 12–6తో కిర్గిజిస్తాన్‌కు చెందిన స్టాంబుల్ జానిబెక్పై గెలుపొందగా, పృథ్వీ పాటిల్ (92 కేజీలు) 2–1తో ఇవాన్ కిరిలోవ్ (రష్యా)ను కంగుతినిపించాడు. అనిరుధ్ (125 కేజీలు) 7–2తో అయిదిన్ అహ్మదోవ్ (అజర్బైజాన్)ను ఓడించాడు. ఫైనల్లో బిపాషా: మహిళల ఈవెంట్లో బిపాషా (76 కేజీలు) స్వర్ణ బరిలో నిలిచింది. ఆమె ఫైనల్ చేరడంతో భారత్‌కు కనీసం రజతం ఖాయమైంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో బిపాషా 9–4తో మంగోలియాకు చెందిన ఒద్బాగ్ ఉల్జిబాత్పై అలవోక విజయం సాధించింది. అంతకు ముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆమె 6–3తో కజకిస్తాన్ రెజ్లర్ దిల్నాజ్ ముల్కినోవాను ఓడించింది. 50 కేజీల విభాగంలో సిమ్రాన్ ఉడుం పట్టు సెమీస్‌లో సడలింది. ఎమిలీ కింగ్ షిల్సన్ (అమెరికా)తో జరిగిన పోరులో ఆమె ‘టెక్నికల్ సుపీరియారిటీ’లో పరాజయం చవిచూసింది. మిగతా రెజ్లర్లు సితో (55 కేజీలు), కుసుమ్ (59 కేజీలు), అర్జూ (68 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ► 4 X 400 మీ. మిక్స్డ్ రిలేలో భారత్‌కు కాంస్యం ► జావెలిన్‌లో ఇద్దరు ఫైనల్‌కు నైరోబీ: వరల్డ్ జూనియర్ (అండర్–20) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తొలి రోజు భారత్ సత్తా చాటింది. 4 X 400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. మన బృందం 3 నిమిషాల 20.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. కాంస్యం గెలిచిన భారత జట్టులో శ్రీధర్ భరత్, ప్రియా మోహన్, సుమ్మీ, కపిల్ సభ్యులుగా ఉన్నారు. శ్రీధర్ ముందుగా పరుగు మొదలు పెట్టగా...ప్రియా, సుమ్మీ తర్వాతి లెగ్‌లలో పరుగెత్తారు. చివర్లో బ్యాటన్ అందుకున్న కపిల్...తనకు పోటీగా దూసుకొచ్చిన జమైకా అథ్లెట్‌ను వెనక్కి నెట్టి భారత్‌ను గెలిపించాడు. ఈ ఈవెంట్లో నైజీరియా (3 నిమిషాల 19.70 సెకన్లు), పోలండ్ (3 నిమిషాల 19.80 సెకన్లు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నాయి. అంతకు ముందు హీట్స్‌లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ పరుగులో పాల్గొన్న అబ్దుల్ రజాక్ స్థానంలో ఫైనల్లో శ్రీధర్ బరిలోకి దిగాడు. వరల్డ్ జూనియర్ అథ్లెటిక్స్‌లో గతంలో భారత్ తరఫున సీమా అంటిల్ (కాంస్యం – డిస్కస్, 2002), నవజీత్ కౌర్ (కాంస్యం – డిస్కస్ 2014), నీరజ్ చోప్రా (స్వర్ణం – జావెలిన్, 2016), హిమ దాస్ (స్వర్ణం – 400 మీ., 2018) పతకాలు గెలుచుకున్నారు. షాట్‌పుట్‌లో ఫైనల్‌కు: వరల్డ్ చాంపియన్‌షిప్ మరో మూడు ఈవెంట్లలో భారత్‌కు మంచి ఫలితాలు లభించాయి. షాట్‌పుట్‌లో అమన్‌దీప్ సింగ్ గుండును 17.92 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ప్రియా మోహన్ 400 మీటర్ల పరుగులో కూడా ఫైనల్‌కు చేరుకుంది. జావెలిన్ త్రోలో ఇద్దరు ఫైనల్లోకి అడుగు పెట్టడం విశేషం. అజయ్ సింగ్ రాణా (71.05 మీటర్లు), జై కుమార్ (70.34 మీటర్లు) క్వాలిఫయింగ్‌లో సత్తా చాటి ఫైనల్ చేరారు.