సుల్తానాబాద్: మండల కేంద్రంలోని మార్కండేయ కాలనీ, బస్టాండ్ సమీపంలో ఉన్న జాపతి రాజిరెడ్డి, బాకం సంపత్ ఇళ్లలో 75 క్వింటాళ్ల 80 కిలోల పీడీఎస్ బియ్యాన్ని శనివారం పట్టుకున్నట్లు తహశీల్దార్ రజిత, డీటీసీఎస్ కాశీవిశ్వనాథం తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని స్థానిక డీలర్ కొమురయ్యగౌడ్‌కు అప్పగించారు. వీరిపై క్రిమినల్ కేసు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈ దాడుల్లో డీటీసీఎస్ ఎన్.మల్లికార్జున్‌రెడ్డి, హరికిరణ్, ఆర్‌ఐ సురేందర్ పాల్గొన్నారు.
ఓదెల రైల్వేస్టేషన్‌లో ఏడు క్వింటాళ్ల బియ్యం..
ఓదెల : మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో ఏడు క్వింటాళ్ల రేషన్‌బియ్యంను గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా తరలిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఇన్‌చార్జి తహశీల్దార్ తూము రవీందర్ పట్టుకున్నారు. రాత్రిసమయంలో కాజీపేట్ నుంచి బల్లార్షా వరకు నడిచే నాగపూర్ ప్యాసింజర్ ద్వారా రేషన్‌బియ్యంను అక్రమంగా తరలిస్తుండగా స్థానికుల సమాచారం మేరకు తనిఖీ చేసి బియ్యంను స్వాధీనం చేసుకున్నట్లు తహశీల్దార్ వివరించారు. గుర్తు తెలియని వ్యక్తులు బియ్యంను రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపైన వదిలేసి పరారయ్యారని ఆయన పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యంను పొత్కపల్లి రేషన్‌డీలర్ ఇస్మత్‌తారకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వోలు కనుకయ్య, సదయ్య, బషీర్, ఎల్లయ్య పాల్గొన్నారు.
నీరుకుల్లలో రేషన్‌షాప్ సీజ్
సుల్తానాబాద్ : మండలంలోని నీరుకుల్ల డీలర్‌షాపు (నంబరు21)ను సీజ్ చేసినట్లు తహశీల్దార్ రజిత తెలిపారు. మండల కేంద్రంలో శనివారం పట్టుబడ్డ బియ్యంతో పాటు 14 కిలోల గోధుమలు నీరుకుల్ల గ్రామానికి చెందిన డీలర్ అంజయ్య తమకు అమ్మినట్లు పట్టుబడ్డ బాకం సంపత్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో అధికారులు నీరుకుల్లకు వెళ్లి డీలర్‌షాను సీజ ్‌చేసినట్లు తెలిపారు. పీడీఎఫ్ సరుకులను పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సహించేది లేదని ఆమె హెచ్చరించారు.
పైడిచింతలపల్లి డీలర్‌పై 6ఏ కేసు
ధర్మారం : ధర్మారం మండలం పైడిచింతలపల్లి రేషన్ డీలర్ బీసగోని మల్లేశంపై శనివారం 6ఏ కేసు నమోదు చేసినట్లు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రమేశ్‌కుమార్ తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు.. డీటీసీఎస్ మల్లిఖార్జున్, వీఆర్వో ప్రసాద్ విచారణ చేపట్టారు. గత నెల పంపిణీ చేయాల్సిన నాలుగు వందల లీటర్ల కిరోసిన్‌ను అక్రమంగా నిల్వ ఉంచినట్లు విచారణలో తేలిందన్నారు. అక్రమంగా నిల్వ చేసిన డీలర్ మల్లేశంపై 6ఏ కేసునమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
రేషన్ సరుకులు పక్కదారి
Published Sun, Feb 15 2015 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement
Advertisement