
హైదరాబాద్: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా హైకోర్టు న్యాయవాది సామల రవీందర్‌ను నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్‌పవార్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఎన్సీపీ జాతీయ కార్యదర్శి ఎస్‌ఆర్ కోహ్లి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం సామల మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించను న్నట్లు స్పష్టం చేశారు.
త్వరలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచారంలో శరద్‌పవార్, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, మాజీ మంత్రి ధర్మారావ్‌బాబా ఆత్రం తదితరులు పాల్గొంటారని సామల రవీందర్ వెల్లడించారు. రవీందర్ గతంలో బహుజన సమాజ్‌వాది పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014లో చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment