ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డప్యూటీ సీఎం అజిత్ పవార్.. తన అంకుల్ శరద్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీని.. 24ఏళ్ల పాటు సుధీర్ఘంగా నడిపించిన శరద్ పవార్‌కు అజిత్ పవార్ ధన్యవాదాలు తెలిపారు.
1999లో ఎన్సీపీ ఆవిర్భావించింది. ఈ ఏడాదితో 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. మేరకు సోమవారం ముంబైలో అజిత్ కుమార్ మాట్లాడుతూ.. గత 24 సంవత్సరాలుగా పార్టీని నడిపించినందుకు శరద్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. వారితోపాటు పార్టీని స్థాపించినప్పటి నుంచి కొనసాగుతున్న వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.
శివాజీ మహారాజ్, షాహూ మహారాజ్, మహాత్మా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలపైనే మా సిద్ధాంతాలు ఆధారపడి ఉన్నాయని నేను అందరికీ హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు.
రాయ్‌గఢ్ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా పార్టీ నాయకుడు సునీల్ తట్కరే ఎన్సీపీ ప్రతిష్టను కాపాడారని ఆయన పేర్కొన్నారు. ఎన్సీపీలో అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
అదే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో కేబినెట్ బెర్త్ కంటే తక్కువ స్థాయిలో ఏ పదవిలో ఉండకూడదని ఎన్సీపీ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. `కేబినెట్ పోర్ట్‌ఫోలియో కంటే తక్కువ పదవిని మేము అంగీకరించబోమని బీజేపీకి స్పష్టం చేస్తున్నాం. వారు చాలా మంది సభ్యులకు కేబినెట్ పదవులు ఇవ్వాలని మాతో చెప్పారు. మేము ఇప్పటికీ ఎన్డీయేలో భాగమే` అని ఆయన అన్నారు. స్తుతం 284 సీట్లు ఉన్న ఎన్డీయ బలం రాబోయే నెలల్లో 300 మార్కును దాటుతుందని పేర్కొన్నారు.
కాగా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నాలుగు చోట్ల పోటీ చేయగా.. కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పోటీ చేసిన పది నియోజకవర్గాలలో ఎనిమిదింటిని గెలుచుకుంది. ముఖ్యంగా, అజిత్ భార్య సునేత్రా పవార్.. సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే చేతిలో బారామతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment