NCP Leadership Crisis: NCP Ajit Pawar And Other Ministers Meets Sharad Pawar At Mumbai - Sakshi
Sakshi News home page

NCP Leadership Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌.. పవార్‌ రియాక్షన్‌?

Published Sun, Jul 16 2023 3:33 PM | Last Updated on Sun, Jul 16 2023 4:22 PM

NCP Ajit Pawar Camp Meets Sharad Pawar At Mumbai - Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌కు షాకిస్తూ అజిత్‌ పవార్‌.. అధికారంలో ఉన్న ఏక్‌నాథ్‌ షిండే టీమ్‌లో చేరిపోయారు. అనంతరం.. అజిత్‌ పవార్‌ను డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌, మంత్రులుగా పలువురు నేతలు ప్రమాణస్వీకారం చేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనల వేళ మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 

తాజాగా మహారాష్ట్రలో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఇటీవల నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నుంచి తిరుగుబాటు చేసిన అజిత్‌ పవార్‌ సహా పలువురు నేతలు ముంబైలో శరద్‌ పవార్‌ను కలిశారు. అయితే, శరద్‌ పవార్‌ను కలిసిన వారిలో మహారాష్ట్ర  డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌‌తో పాటు ప్రఫుల్‌ పటేల్‌, ఛగన్‌ భుజ్‌బల్‌, దిలీప్‌ పాటిల్‌ తదితరులు ఉన్నారు. ఇక, వీరంతా తిరుగుబాటు చేసిన శరద్‌ పవార్‌ను కలవడం ఇదే తొలిసారి. 

కాగా, పవార్‌ను కలిసిన అనంతరం ఎన్సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. శరద్‌పవార్‌ ఆశీస్సుల కోసమే ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. ఎన్సీపీని ఐక్యంగా ఉంచాలని శరద్‌ను కోరినట్టు పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిపై ఆయనేమీ స్పందించలేదని వెల్లడించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు పొలిటికల్‌గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా..  అంతకుముందు శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ వర్గాల మధ్య మాటల వార్‌ చోటుచేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య తమనే అసలైన ఎన్సీపీగా గుర్తించాలంటూ అజిత్‌ వర్గం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది. అటు తానే ఎన్సీపీ చీఫ్‌ అంటూ శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: ఎస్పీకి దెబ్బ మీద దెబ్బ.. ఎన్డీయే కూటమిలో చేరిన ఎస్‌బీస్పీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement