బీజేపీకి షాక్‌.. శరద్ పవార్ ఎన్సీపీలోకి మాజీ మంత్రి | Maharashtra BJP Harshvardhan Patil Will Join Sharad Pawar NCP | Sakshi
Sakshi News home page

బీజేపీకి షాక్‌.. శరద్ పవార్ ఎన్సీపీలోకి మాజీ మంత్రి

Published Fri, Oct 4 2024 5:01 PM | Last Updated on Fri, Oct 4 2024 6:09 PM

Maharashtra BJP Harshvardhan Patil Will Join Sharad Pawar NCP

ముంబై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో బీజేపీకి షాక్‌ తగిలింది. పార్టీ నేత, మాజీ మత్రి హర్షవర్దన్‌ పాటిల్‌ తర్వలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో భేటీ అయిన మరుసటి రోజు హర్షవర్దన్‌ ఈ ప్రకటన చేశారు. శుక్రవారం పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమై.. తాను బీజేపీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘నేను గత రెండు నెలలుగా ఇందాపూర్ నియోజకవర్గం అంతటా పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నాను. ఒక విషయం స్పష్టంగా ఉంది. నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు పట్టుబడుతున్నారు. నా మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. అయితే పుణెలోని ఇందాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్సీపీ ఎమ్మెల్యే దత్తమామ భర్నేపై పోటీ చేయాలని హర్షవర్దన్‌ భావిస్తున్నారు.

కాగా  అక్టోబరు 7న ఇందాపూర్‌లో జరిగే భారీ ర్యాలీలో ఎన్సీపీ (ఎస్పీ)లో ఆయన చేరుతారని మద్దతుదారులు తెలిపారు. ఇక ఆయన కుమార్తె అంకితా పాటిల్, మాజీ పూణె జిల్లా పరిషత్ సభ్యురాలు కూడా శరద్ పవార్ వర్గంలో చేరనున్నట్లు సమాచారం. పాటిల్‌ ఇందాపూర్‌ నుంచి నాలుగుసార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ను బీజేపీలో చేరారు.

అయితే ప్రస్తుతం ఇందాపూర్‌ నుంచి ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి బీజేపీ తమ అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు అసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఇందాపూర్ నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిత్వంపై సరైన నిర్ణయం తీసుకోనందుకు బీజేపీపై అసంతృప్తితో ఉన్న పాటిల్‌ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement