Harshvardhan Patil
-
బీజేపీకి షాక్.. శరద్ పవార్ ఎన్సీపీలోకి మాజీ మంత్రి
ముంబై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో బీజేపీకి షాక్ తగిలింది. పార్టీ నేత, మాజీ మత్రి హర్షవర్దన్ పాటిల్ తర్వలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయిన మరుసటి రోజు హర్షవర్దన్ ఈ ప్రకటన చేశారు. శుక్రవారం పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమై.. తాను బీజేపీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘నేను గత రెండు నెలలుగా ఇందాపూర్ నియోజకవర్గం అంతటా పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నాను. ఒక విషయం స్పష్టంగా ఉంది. నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు పట్టుబడుతున్నారు. నా మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. అయితే పుణెలోని ఇందాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్సీపీ ఎమ్మెల్యే దత్తమామ భర్నేపై పోటీ చేయాలని హర్షవర్దన్ భావిస్తున్నారు.కాగా అక్టోబరు 7న ఇందాపూర్‌లో జరిగే భారీ ర్యాలీలో ఎన్సీపీ (ఎస్పీ)లో ఆయన చేరుతారని మద్దతుదారులు తెలిపారు. ఇక ఆయన కుమార్తె అంకితా పాటిల్, మాజీ పూణె జిల్లా పరిషత్ సభ్యురాలు కూడా శరద్ పవార్ వర్గంలో చేరనున్నట్లు సమాచారం. పాటిల్ ఇందాపూర్ నుంచి నాలుగుసార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ను బీజేపీలో చేరారు.అయితే ప్రస్తుతం ఇందాపూర్ నుంచి ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి బీజేపీ తమ అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు అసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఇందాపూర్ నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిత్వంపై సరైన నిర్ణయం తీసుకోనందుకు బీజేపీపై అసంతృప్తితో ఉన్న పాటిల్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. -
మంత్రి కంట్లో నల్లసిరా
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ధన్‌గర్‌ల ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతోంది. ధన్గర్లు శుక్రవారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్ర సహకారశాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ కంట్లో ఓ ఆందోళనకారుడు నల్లసిరా పోయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పుణే జిల్లా, ఇంద్రాపూర్‌లోని భిగవణ్లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకెళ్తే... తమను షెడ్యూల్డ్ ట్రైబల్స్(ఎస్టీ) జాబితాలో చేర్చాలంటూ కొన్నిరోజులుగా ధన్గర్లు రకరకాల రూపాల్లో తమ డిమాండ్‌ను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా పుణేలోని ఇంద్రాపూర్ తాలూకా, భిగవణ్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి హర్షవర్ధన్ పాటిల్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ధన్గర్ సామాజికవర్గానికి చెందిన కొందరు అక్కడకు చేరుకున్నారు. కార్యక్రమం ముగిసేంతవరకు వేచి చూసి, తిరిగి వస్తుండగా ఆయన కారును చుట్టుముట్టారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చొరవ చూపాలంటూ నినాదాలు చేశారు. వారితో మంత్రి మాట్లాడుతుండగానే ఓ వ్యక్తి మంత్రి ముఖంపై నల్లసిరా పోశాడు. ఒక్కసారిగా సిరా గుమ్మరించడంతో అది మంత్రి కంట్లో పడింది. దీంతో మంత్రి కంటికి గాయమైంది. సిరాలో యాసిడ్ ఉంటుందని, ఫలితంగానే ఇబ్బంది కలిగి ఉండవచ్చని స్థానిక వైద్యుడొకరు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రిని అక్కడ నుంచి పంపేశారు. ఇరువర్గాల వాగ్వాదం.. తమ పార్టీకి చెందిన మంత్రిపై సిరా పోయడంతో ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులైన కాంగ్రెస్ కార్యకర్తలు, మంత్రి అనుచరులు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. ఓ సందర్భంలో ఇరువర్గాలు కొట్టుకున్నారు కూడా. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. ఆ తర్వాత కూడా ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు కొనసాగాయి. భిగవణ్ బంద్‌కు కాంగ్రెస్ పిలుపు... మంత్రి కంట్లో సిరా పోయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఇంద్రాపూర్, భిగ్వణ్ బంద్‌కు పిలుపునిచ్చారు. అనంతరం పుణే-ఇంద్రాపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపైనే భైటాయించి నినాదాలు చేశారు. దీంతో ఈ ర హదారిపై దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరకు పోలీసులు కలుగజేసుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ప్రకటనల ఆదాయంలో సగం.
సాక్షి, ముంబై: సొసైటీ భవనాలపై ఏర్పాటుచేసే మొబైల్ టవర్లు, ప్రకటనల బోర్డుల ద్వారా వచ్చే ఆదాయాన్ని దాని సభ్యులు కూడా పొందేలా నియమాల్లో మార్పులు చేయనున్నట్లు సహకారశాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ వెల్లడించారు. ఇదివరకు ఇలాంటి నిబంధన లేకపోవడంతో ప్రకటనలతో వచ్చిన ఆదాయాన్ని ఆయా సొసైటీలు భవనాల నిర్వహణకు ఖర్చు చేస్తున్నాయి. అయితే వాటి లెక్కలను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. నిధుల్లో చాలా వరకు దుర్వినియోగం అవుతున్నాయనే చెబుతున్నారు. అంతేగాక ప్రకటనల ఆదాయంపై సొసైటీలు ఆడిటింగ్ కూడా జరిపిం చడం లేదు. అందుకే వీటికి సంబంధించిన నియమాల్లో మార్పులు చేస్తే బాగుంటుందని పాటిల్ అభిప్రాయపడ్డారు. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తం గా 88,433 రిజిస్టర్డ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు ఉన్నాయి. ఈ భవనాల్లో ఇళ్లు, వ్యాపార సంస్థ లు, దుకాణాలు ఉన్నాయి. వేలాది సొసైటీలు తమ భవనాలపై మొబైల్ టవర్లు, ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేసేందుకు అనుమతించాయి. ఫలితంగా ఇవి నెలకు అద్దె రూపంలో లక్షలాది రూపాయలు పొందుతున్నాయి. ఇక నుంచి ఈ నిధులు దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించనుంది. ఇక నుంచి నిధు ల్లో 50 శాతం మొత్తాన్ని నివాసులకు డివిడెండ్ రూపంలో పంపిణీ చేయాలి. మిగతా 50 శాతం నగదును సొసైటీ నిర్వహణకు వెచ్చించాలని చట్టాన్ని రూపొంధించనున్నట్లు పాటిల్ చెప్పారు. మొబైల్ టవర్లు, ప్రకటన బోర్డు లు ఏర్పాటుకు అనుమతినిచ్చే ముందు భవనానికి స్ట్రక్చరల్ ఆడిట్ కచ్చితంగా చేయించాలి. ముఖ్యంగా ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న లేదా జంక్షన్ల వద్ద ఉన్న భవనాలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ హోర్డింగులు ఏర్పాటుచేయడానికి వాణిజ్య సంస్థలు పోటీ పడతాయి. అందుకు ఎంతై నా చెల్లించడానికి ముం దుకువస్తాయి. కానీ వీటిని ఏర్పాటు చేయడంవల్ల భవనాలపై అదనపు భారం పడుతుంది. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశముంది. అదనంగా వచ్చే ఆదాయాన్ని వదులుకునేందుకు సొసైటీ యాజమాన్యాలు సిద్ధంగా లేవు. దీంతో విచ్చలవిడిగా టవర్లు, హోర్డింగులు వెలుస్తున్నాయి. దీంతో స్ట్రక్చరల్ ఆడిట్ తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రభుత్వం సొసైటీలను ఆదేశించింది. -
డ్యాన్స్బార్లు బంద్
జూన్‌లో బిల్లు మంత్రి పాటిల్ ప్రకటన సభ ముందుకు రానున్న 13 బిల్లులు శనివారం కూడాఅసెంబ్లీ కొనసాగింపు సాక్షి ముంబైః ఎన్నో అక్రమాలకు కారణమవుతున్న డ్యాన్స్‌బార్లపై నిషేధం విధించాలని ప్రతిపాదిస్తూ ఈ వర్షాకాల సమావేశంలో బిల్లును ప్రవేశపెడతామని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ ప్రకటించారు. వర్షాకాల సమావేశాలు జూన్ రెండో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాల్లో మొత్తం 13 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. వీటిలో పెండింగ్‌లో ఉన్న ఏడు పాత బిల్లులతోపాటు మరో ఆరు కొత్తవి ఉన్నాయి. శాసనసభ సమావేశాల వివరాలు తెలియజేయడానికి హర్షవర్ధన్ పాటిల్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. డ్యాన్స్‌బార్లపై నిషేధం విధించే బిల్లును ఈసారే ప్రవేశపెట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించామని వెల్లడించారు. వీటిపై నిషేధం విధించేందుకు గతంలోనే రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ చట్టం మరింత పటిష్టంగా లేకపోవడంతో న్యాయస్థానం కొట్టివేసింది. డ్యాన్స్‌బార్ల అనుమతులను నవీకరించడాన్ని రాష్ట్రప్రభుత్వం నిలిపివేసింది. ఫలితంగా డ్యాన్స్‌బార్లను ప్రారంభించలేకపోయారు. దీంతో ఈ విషయంపై డ్యాన్స్‌బార్ల యజమాన్యం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు డ్యాన్స్‌బార్ల అనుమతులను ఎందుకు నవీకరించలేదో 15 రోజుల్లోపు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశంలో డ్యాన్స్‌బార్ల నిషేధం బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు హర్షవర్ధన్ పాటిల్ పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయంపై హోంశాఖ మంత్రి ఆర్.ఆర్. పాటిల్ మాట్లాడుతూ డ్యాన్స్‌బార్ల నిషేధంపై గతంలో ప్రభుత్వం అమలు చేసిన చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి మరింత పటిష్ట సవరణలు తేవాలా లేక కొత్త బిల్లునే తీసుకురావడమా..? అనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ విషయంపై వచ్చే వారంలోపు నిర్ణయం తీసుకునే అవకాశముందని పాటిల్ చెప్పారు. జూన్ ఐదున అదనపు బడ్జెట్... వర్షాకాల సమావేశాల సందర్భంగా జూన్ ఐదున పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా గత సమావేశాల్లో కేవలం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్టు ఆర్థికశాఖ మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పూర్తిస్థాయి బడ్జెట్‌తోపాటు డ్యాన్స్‌బార్ల నిషేధం బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు పాటిల్ వివరించారు. శనివారం కూడా సమావేశాలు కొనసాగుతాయి... జూన్ రెండు నుంచి జూన్ 14వ తేదీ వరకు జరగనున్న వర్షాకాల సమావేశాల్లో శనివారం కూడా సభాకార్యకలాపాలు కొనసాగుతాయని మంత్రి హర్షవర్ధన్ పాటిల్ ప్రకటించారు. సాధారణంగా అసెంబ్లీకి శనివారం, ఆదివారం సెలవుదినాలుగా ప్రకటిస్తారు. కానీ ప్రజాస్వామ్య కూటమి చివరి సమావేశాలు కాబట్టి సెలవు రోజైన శనివారం కూడా కార్యకలాపాలు నిర్వహించి మొత్తం 12 రోజులు భేటీలు కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. అధిక సమయం సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కూడా కోరాయి. 1999లో అధికారంలోకి వచ్చిన కాషాయ కూటమి హయాంలో చివరి సమావేశాలు కేవలం నాలుగు రోజులు జరిగాయి. అదే ప్రజాసామ్య కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు 2004, 2009లో చివరి సమావేశాలను దాదాపు 13 రోజులపాటు కొనసాగించాయని మంత్రి వివరించారు. ఈసారి కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తామని వివరించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభుత్వం పరిపాలన గడువు అక్టోబరు 25తో ముగియనుంది. దీనికి ముందు ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తారని మంత్రి హర్షవర్ధన్ పాటిల్ విశదీకరించారు. రాయిగఢ్ జిల్లా కాలాపూర్‌లో 1980లో డ్యాన్స్‌బార్ల సంస్కృతి మొదలయింది. వీటిలో వ్యభిచారం జరుగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అశ్లీల నృత్యాల కోసం గ్రామీణ ప్రాంతాల బాలికలను బార్ల నిర్వాహకులు కొనుగోలు చేసినట్టు కూడా విమర్శలు వినిపించాయి. దీంతో శివసేన వంటి పార్టీలు డ్యాన్స్బార్లు నిషేధం కోసం పోరాడాయి.