
సంతోష్ నగర్: హోంగార్డులు ఆత్మహత్యలు చేసుకోవద్దని..పోరాడి హక్కులు సాధించుకుందామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణాపాయస్థితిలో అపోలో డీఆర్‌డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌ను ఆయ న గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హోంగార్డుల విషయంలో శ్రమదోపిడీ జరుగుతోందని..వారికి కనీస హక్కు లు ఇవ్వడం లేదన్నారు. హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తుందన్నారు. ఈ ఘటనపై విచారణ జరగాలన్నారు. ఆయన కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు.
ధర్నాకు కిషన్‌రెడ్డి మద్దతు: అపోలో డీఆర్‌డీఓ ఆస్పత్రి ఆవరణలో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న హోంగార్డులకు కిషన్‌రెడ్డి మద్దతు తెలిపారు. 17 సంవత్సరాలుగా హోంగార్డుగా సేవలు అందిస్తున్న రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. మనం అవసరమైతే పోరాటం చేద్దాం కానీ.., ప్రాణాలు తీసుకోవద్దన్నారు. కాగా, హోంగార్డులను ఇలాంటి పరిస్థితిలో తాను ఎప్పుడూ చూడలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. అంతకు ముందు ఆయన రవీందర్‌ను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment