Are Mahalakshmi and Ravindra Chandrasekhar Expecting Their First Baby - Sakshi
Sakshi News home page

Mahalakshmi-Ravindran Chandrasekaran: మహాలక్ష్మి తల్లి కాబోతుందా? వైరల్‌ అవుతున్న ఫొటో..

Published Fri, Nov 18 2022 5:50 PM | Last Updated on Fri, Nov 18 2022 6:50 PM

Are Mahalakshmi and Ravindra Chandrasekhar Expecting Their First Baby - Sakshi

తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ జంట ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు. దీనికి కారణం నిర్మాత రవీందర్‌ అతి బరువు ఉండటమే.  మహాలక్ష్మి మాత్రం పొట్టిగా, నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు  ట్రోల్‌ చేశారు. అంతేకాదు రవీందర్‌ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్‌ చేశారు నెటిజన్లు. అయితే అవేవి తమను బాధించవని, తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామంటూ ట్రోల్స్‌పై ఈ జంట స్పందించింది.

చదవండి: ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్‌ ఆరోగ్యం, నడవలేని స్థితిలో..

అంతేకాదు తరచూ ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేస్తూ ట్రోలర్స్‌ నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది ఈ జంట. అయినప్పటికీ వారిపై ట్రోల్స్‌ ఆగడం లేదు. ఇదిలా ఉంటే ఈ జంట త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెప్పనుందని తెలుస్తోంది. మహాలక్ష్మి గర్భవతి అయినట్లు సోషల్‌ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ జంట డిన్నర్‌ డేట్‌కు వెళ్లిన ఫొటోలను షేర్‌ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను రవీందర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అయితే ఈ ఫొటోలో మహాలక్ష్మీ కాస్తా లావుగా, పొట్ట భాగం ముందుకు ఉన్నట్లుంది. చూస్తుంటే ఆమె గర్భవతి అన్నట్లుగాకనిపించింది. దీంతో ఆమెను చూసి మహాలక్ష్మి ప్రెగ్నెంటా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దీనికి రవీందర్‌ ఇచ్చిన క్యాప్షన్‌ చూస్తుంటే అదే నిజం అనేట్టుగా ఉంది.

చదవండి: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్‌ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక

‘ఐ లవ్‌ యూ చెప్పడంలోనే నా సంతోషం లేదు.. నేను వ్యక్తం చేయకపోయినా నువ్వు నా కోసమే జీవించావంటూ నువ్వు చూపించే నీ నిజమైన ప్రేమ కూడా కారణం’ అంటూ ఈ ఫొటోకి రాసుకొచ్చాడు. దీంతో పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్‌ 1న ఈ జంట ఇరువురి కుంటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం​. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. కెరీర్ మధ్యలో, మహాలక్ష్మి అనిల్ నేరేడిమిల్లిని వివాహం చేసుకుంది. మహాలక్ష్మికి తన మొదటి భర్తతో మగబిడ్డ జన్మనిచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement