Is Actress Mahalakshmi And Ravindar Chandrasekaran Getting Divorce? Here Is Clarity - Sakshi
Sakshi News home page

Mahalakshmi: రెండో పెళ్లితో వార్తల్లో నిలిచిన బుల్లితెర జంట విడిపోయారంటూ రూమర్స్‌.. ఎట్టకేలకు క్లారిటీ!

Published Thu, May 25 2023 2:15 PM | Last Updated on Thu, May 25 2023 4:12 PM

Is Actress Mahalakshmi, Ravindar Chandrasekaran Getting Divorce? Here Is Clarity - Sakshi

జీవితంలో పెళ్లి అనేది అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ పెళ్లిళ్లకు వచ్చేవాళ్లంతా జంట ఈడూజోడూ బాగుందా? అనే చూస్తారు. అమ్మాయి కంటే అబ్బాయి పొట్టిగా ఉన్నా, ఒకరు బక్కచిక్కగా ఉండి మరొకరు లావుగా ఉన్నా, ఒకరిది చిన్న వయసై ఉండి మరొకరిది ముదురు ముఖమైనా బుగ్గలు నొక్కుకుంటారు. జోడీ అస్సలు బాగోలేదని ముఖం మీదే చెప్తారు. తమిళ సెలబ్రిటీ జంట రవీందర్‌ చంద్రశేఖర్‌- మహాలక్ష్మిల విషయంలోనూ ఇదే జరిగింది.

మహాలక్ష్మి యాంకర్‌, బుల్లితెర నటి.. పొట్టిగా, నాజూకుగా ఉంటుంది. రవీందర్‌ చంద్రశేఖరన్‌ తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్‌ అధినేత.. భారీకాయుడు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరికీ ఇది రెండో వివాహమే! పెద్దల అంగీకారంతో వీరు వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. కానీ ఈ జంటపై నెట్టింట తరచూ ట్రోలింగ్‌ జరుగుతూ ఉంటుంది. ఓపక్క భారీకాయంపై రవీందర్‌ను బాడీ షేమింగ్‌, మరో పక్క డబ్బు కోసమే అతడిని పెళ్లి చేసుకున్నావంటూ మహాలక్ష్మిని విమర్శిస్తూ ఉంటారు. ఆ ట్రోలర్స్‌ నూరు మూయిస్తూ భర్తతో కలిసి ఉన్న ఫోటోలు తరచూ షేర్‌ చేస్తూనే ఉంటుంది మహాలక్ష్మి. ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు ఏకంగా వీరు విడిపోయారంటూ ప్రచారం మొదలు పెట్టారు.

ఈ క్రమంలో తాజాగా భర్తతో కలిసి దిగిన ఫోటో షేర్‌ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రొమాంటిక్‌ పోస్ట్‌ పెట్టింది నటి. 'నువ్వు నా భుజంపై చేయి వేసినప్పుడు ఈ ప్రపంచంలో నేను ఏదయినా చేయగలను అన్నంత ధైర్యం వస్తుంది. నా మనసు నిండా నువ్వే అమ్ము, ఐ లవ్యూ' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. దీనికి రవీందర్‌ కూడా లవ్‌ యూ అంటూ రిప్లై ఇచ్చాడు. 'మీరిద్దరూ విడిపోయాన్న వార్త రాగానే భయపడిపోయాను, ఇప్పుడు సంతోషంగా ఉంది..', 'ఈ యూట్యూబ్‌ ఛానల్‌ వాళ్లు విడాకుల దాకా వెళ్లిపోయారు, తీరా ఇక్కడ చూస్తే మీరు కలిసే ఉన్నారు. సంతోషంగా ఉంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: చిన్న వయసులోనే కారు నడిపిన మహేశ్‌.. పోలీసుల ఎంట్రీతో ట్విస్ట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement