ఆ కాలేజీలు జైళ్ల కంటే దారుణం
నారాయణ, చైతన్య కాలేజీలపై రవీందర్, పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: నారాయణ, చైతన్య కార్పొరేట్ కాలేజీలు జైళ్ల కంటే హీనంగా ఉన్నాయని, ఆ కాలేజీల ఒత్తిడిని భరించలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుం టున్నారని ఎమ్మెల్సీలు పూల రవీందర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి శాసన మండలి దృష్టికి తీసుకువచ్చారు. గురువారం మండలి ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లా డుతూ.. ఇష్టం వచ్చినట్లు ఫీజుల భారాన్ని విద్యార్థులపై మోపుతున్నారని, రైతు ఆత్మహత్యలకు కార్పొరేట్ కాలేజీల ఫీజులు కూడా ఓ కారణమని పూల రవీందర్ పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలను పట్టణాలకే పరిమితం చేయాలని, గ్రామాల్లో అనుమతించవద్దని ఆయన కోరారు. మంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ.. కార్పొరేట్ కాలేజీల నియంత్రణకు ప్రత్యేక చట్టం చేయడానికి కసరత్తు చేస్తున్నామని చెప్పారు