Chaitanya College
-
ప్రయివేట్ ఫొటోలతో బ్లాక్ మెయిల్..
-
విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన
-
నాన్న ఉత్తరం చూశాక కన్నీళ్లు ఆగలేదు..
సాక్షి, అమరావతి బ్యూరో: కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల కోసం ఒత్తిడిని భరించలేక పారిపోయి హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో తలదాచుకున్న ప్రతిభావంతుడైన విద్యార్థిని విజయవాడ పోలీసులు కాపాడి సోమవారం తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. గత ఏడాది నవంబరు 27వ తేదీన కళాశాల నుంచి అదృశ్యమైన విద్యార్థి తన ఆవేదనను ‘సాక్షి’కి వివరించాడు. ‘నాపేరు మాతూరి జగదీష్ సాయి. మాది ప్రకాశం జిల్లా మార్టూరు మండలం. నాన్న నాయీబ్రాహ్మణ వృత్తిలో ఉన్నారు. నాకు పదో తరగతిలో 9.3 గ్రేడ్ వచ్చింది. నన్ను బాగా చదివించాలనే తపనతో విజయవాడ నిడమానూరులోని చైతన్య కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చేర్పించారు. కానీ ఇక్కడి పరిస్థితులు, అధ్యాపకుల తీరు, ఫీజుల కోసం పదేపదే గుర్తు చేసే యాజమాన్యం తీరుతో నవంబర్ 27 తెల్లవారుజామున కళాశాల నుంచి వెళ్లిపోయి హైదరాబాద్ చేరుకుని ఓ రిసార్టులో క్యాటరింగ్ పనిలో చేరా. కొద్ది రోజుల తరువాత తల్లిదండ్రులు గుర్తొచ్చారు. కానీ వారికి ముఖం ఎలా చూపించాలో అర్థం కాలేదు. నాకు బావ వరుస అయ్యే సాయితేజ్‌ని డిసెంబరు 14న నా స్నేహితుడి ఫేస్బుక్ ఖాతా ద్వారా పలకరించా. అందులో మా నాన్న రాసిన ఉత్తరం చూశాక కన్నీళ్లు ఆగలేదు. నేను క్షేమంగానే ఉన్నా, నాకోసం వెతకొద్దని మెసేజ్ పెట్టా. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆదివారం పోలీసులతో కలసి నా వద్దకు వచ్చిన నాన్నను చూడగానే ఏడుపు ఆగలేదు. క్షమించమని కోరా. ఆయన అక్కున చేర్చుకుని ఓదార్చడం చూశాక ఇక ఎప్పుడూ ఇలాంటి పని చేయకూడదని నిర్ణయించుకున్నా’ అని జగదీష్ తెలిపాడు. విద్యార్థి అదృశ్యంపై నవంబరు 28న ఫిర్యాదు అందుకున్న విజయవాడ పటమట పోలీసులు పలు మార్గాలో కేసు దర్యాప్తు జరిపారు. ఫేస్బుక్ ఖాతాను విశ్లేషించి విద్యార్థి జాడను గుర్తించారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు సమక్షంలో విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించారు. బాగా చదువుకోవాలనుకున్నా. కానీ కళాశాల పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఫీజు కట్టాలని పదేపదే ఒత్తిడి చేయడంతో మనస్తాపంతో కాలేజీ నుంచి పారిపోయా – జగదీష్ సాయి -
విజయవాడ శ్రీచైతన్య కాలేజీలో దారుణం
-
ఆ కాలేజీలు జైళ్ల కంటే దారుణం
నారాయణ, చైతన్య కాలేజీలపై రవీందర్, పొంగులేటి సాక్షి, హైదరాబాద్: నారాయణ, చైతన్య కార్పొరేట్ కాలేజీలు జైళ్ల కంటే హీనంగా ఉన్నాయని, ఆ కాలేజీల ఒత్తిడిని భరించలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుం టున్నారని ఎమ్మెల్సీలు పూల రవీందర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి శాసన మండలి దృష్టికి తీసుకువచ్చారు. గురువారం మండలి ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లా డుతూ.. ఇష్టం వచ్చినట్లు ఫీజుల భారాన్ని విద్యార్థులపై మోపుతున్నారని, రైతు ఆత్మహత్యలకు కార్పొరేట్ కాలేజీల ఫీజులు కూడా ఓ కారణమని పూల రవీందర్ పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలను పట్టణాలకే పరిమితం చేయాలని, గ్రామాల్లో అనుమతించవద్దని ఆయన కోరారు. మంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ.. కార్పొరేట్ కాలేజీల నియంత్రణకు ప్రత్యేక చట్టం చేయడానికి కసరత్తు చేస్తున్నామని చెప్పారు -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కలకలం
వరంగల్ అర్బన్: డిగ్రీ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చైతన్య డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థి కృష్ణారెడ్డి వరంగల్ హైవే వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయే ముందు కృష్ణారెడ్డి నాణేలతో 'A' అక్షరాన్ని రాసినట్లు గుర్తించారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇది హత్యా.. లేక ఆత్మహత్యా.. అని అన్నికోణాల్లోనూ విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. -
జూనియర్ పై సీనియర్ విద్యార్థుల దాడి
-
జూనియర్ పై సీనియర్ విద్యార్థుల దాడి
హైదరాబాద్: పాఠశాల విద్యార్థులు తరగతిగదిలోనే గుండాల తరహాలో తోటి విద్యార్థిపై దాడిచేసిన ఘటన జరిగిన మరుసటిరోజే అలాంటి ఉదంతం మరొకటి చోటుచేసుకుంది. చైతన్య కాలేజీ హాస్టల్ లో జూనియర్స్, సీనియర్స్ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటన నగరంలోని అంబర్ పేట డీడీకాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. చైతన్య కాలేజీలో జూనియర్ విద్యార్థి అయిన వర్ధన్ పై సీనియర్ విద్యార్థులు చేయి చేసుకోవడంతో వివాదం మొదలైంది. విషయం తెలుసుకున్న జూనియర్స్ వర్ధన్ కు మద్ధతుగా రావడంతో సీనియర్స్ మరింతగా రెచ్చిపోయారు. సీనియర్ల చేతిలో వర్ధన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడ్డ వర్ధన్ ను తొలుత ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రి నుంచి హిమయత్ నగర్ అపోలోకు వర్ధన్ ను తరలించారు. ముఖ్యంగా ముగ్గురు విద్యార్థులు వర్ధన్ పై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని అతడి బంధువులు చెబుతున్నారు. ఈ ముగ్గురిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గుమాస్తా కుమార్తె టాపర్
ఎంసెట్ మెడికల్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన హేమలత విజయవాడ(గుణదల)/కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రతిభకు ఆర్థిక స్థితిగతులు అడ్డంకి కాదని మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థిని రుజువు చేసింది. బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసే ఓ సాధారణ వ్యక్తి కుమార్తె ఎంసెట్-2016 మెడికల్ విభాగంలో తొలి ర్యాంకు సాధించి స్ఫూర్తిదాయకం గా నిలిచింది. శనివారం విడుదలైన ఎంసెట్ మెడికల్ ఫలితాల్లో కర్నూలు జోహరాపురానికి చెందిన మాచాని హేమలత మొదటి ర్యాంకు సాధించింది. కర్నూలులోని శ్రీనివాస క్లాత్ స్టోర్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న మాచాని వీరన్న, చంద్రకళ దంపతుల రెండో కుమార్తె హేమలత. తన ముగ్గురు బిడ్డ లు చదువులో ఆణిముత్యాలని చెప్పారు. తన సంతానాన్ని ఉన్నత స్థానంలో నిలపడానికి నిరంతరం శ్రమిస్తున్నానని వీరన్న తెలిపారు. నాన్న కల నెరవేర్చిన హేమలత మాచాని వీరన్న, చంద్రకళ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. పెద్ద కుమార్తె సౌజన్య ప్రస్తుతం మహానందిలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతోంది. రెండో కుమార్తె హేమలత ఎంసెట్ మెడిసిన్‌లో స్టేట్ ఫస్టు ర్యాంకు సాధించింది. వీరిద్దరూ కర్నూలులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. ఇక మూడో కుమార్తె విజయశ్రీ ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. తన ముగ్గురు కుమార్తెల్లో ఒక్కరినైనా డాక్టర్‌గా చూడాలనుకున్నారు మాచాని వీరన్న. ఎన్నో వ్యయప్రయాలసకోర్చి పిల్లలను చదివించారు. రెండో తనయ మాచాని హేమలత ఎంసెట్‌లో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించి తండ్రి కలను సాకారం చేసింది. 2015లో 248వ ర్యాంకు 2015 ఎంసెట్ మెడికల్‌లో మాచాని హేమలత మొదటి ప్రయత్నంలోనే 248వ ర్యాంకు సాధించింది. అయితే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. నిర్దేశిత వయసుకు 28 రోజులు తక్కువగా ఉండడంతో ఆమె అప్పట్లో వైద్య విద్యలో ప్రవేశం పొందలేకపోయింది. న్యూరో సర్జన్ అవుతా ‘చాలా ఆనందంగా ఉంది. రోజుకు పన్నెండు గంటలు కష్టపడేదాన్ని. నిరంతరం పుస్తకాలతోనే దోస్తీ చేసేదాన్ని. తల్లిదండ్రుల కల నెరవేర్చడానికి నిరంతరం కష్టడుతూనే ఉంటా. న్యూరోసర్జన్ కావాలన్నది చిరకాల కోరిక. నా విజయం వెనుక మా తల్లిదండ్రులు, అధ్యాపకుల కృషి చాలా ఉంది. ఇంటర్మీడియెట్‌లో 985 మార్కులు వచ్చాయి’ అని హేమలత చెప్పింది. ర్యాంకర్ల మనోగతం న్యూరాలజిస్ట్‌నవుతా... మాది రంగారెడ్డి జిల్లా కొత్తగూడ, నాన్న నరేంద్రరెడ్డి న్యాయవాది. అమ్మ గృహిణి. చిన్నప్పటి నుంచి డాక్టర్‌ను కావాలనే ఆకాంక్షతో ఇంటర్లో బైపీసీలో చేరాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల శిక్షణతో రెండో ర్యాంకు సాధించాను. న్యూరాలజిస్ట్ కావాలనేది నా ఆశయం. - ఎర్ల సాత్విక్‌రెడ్డి, రెండో ర్యాంకర్ తల్లిదండ్రుల ప్రోత్సాహం... సైదాబాద్‌కు చెందిన మా నాన్న సత్యనారాయణరెడ్డి సివిల్ ఇంజనీర్. నా అభీష్టం మేరకు ఇంటర్ బైపీసీలో చేర్పించారు. ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంతటి విజయం సాధించా. న్యూరాలజిస్ట్ లేదా కార్డియాలజిస్ట్‌గా ప్రజలకు సేవ చేయాలనేది నా ఆకాంక్ష. - ఎ.యజ్ఞప్రియ, మూడో ర్యాంకర్ నగర కుర్రాడి సత్తా ఏపీ ఎంసెట్ మెడికల్‌లో నగరానికి చెందిన ఇక్రంఖాన్ సత్తా చాటాడు. 160 మార్కులు152 మార్కులు సాధించి ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. నారాయణగూడ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదివిన ఇక్రం ఎంపీసీలో 987 మార్కులు సాధించాడు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయడమే తన లక్ష్యమని ఇక్రంఖాన్ తెలిపాడు. కార్డియాలజిస్ట్‌నవుతా బోయినపల్లికి చెందిన ఎస్.సాహితి సావిత్రి ఎస్ఆర్నగర్ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివింది. మెడిసిన్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. 160కు 152 మార్కులు తెచ్చుకుంది. ఇంటర్లో 982 మార్కులు సాధించింది. ఆమె తండ్రి రమణ ఐఎస్బీ లో, తల్లి దీప్తి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కార్డియాలజిస్టునయ్యి సేవలందించాల న్నది తన ఆకాంక్షని సాహితి తెలిపింది. -
మేఘనం
జ్యోతినగర్/కూసుమంచి : ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థలో డెవలపింగ్ ఇంజినీర్‌గా ఉన్నతోద్యోగం సాధించిన తోటకూర మేఘన జిల్లా కీర్తిని ఇనుమడింపజేసింది. ప్రపంచస్థాయిలో తెలుగింటి కీర్తి ప్రతిష్టలు చాటింది. ఎన్టీపీసీ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్- వాణి స్వస్థలం ఖ మ్మం జిల్లా కూసుమం చి మండలం జజుల్రావుపేట. ఉద్యోగరీత్యా 25 ఏళ్ల క్రితమే ఈ కుటుంబం స్వస్థలాన్ని వదిలింది. వీరికి ఇద్దరు కూతుళ్లు మేఘన, అన న్య. పెద్దకుమార్తె మేఘ న విద్యాభ్యాసం రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని సెయింట్ క్లేర్ పాఠశాలలోనే సాగింది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇక్కడే చదువుకుంది. 9, 10 తరగతులు విజయవాడ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో చదివి పదో తరగతిలో 97 శాతం మార్కులు సాధించింది. చైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీలో 98 శాతం మార్కులతో ఐఐటీలో 52వ ర్యాంకు పొంది ముంబయిలో సీఎస్ఈ చివరి సంవత్సరం చదువుతోంది. గూగుల్ క్యాంపస్ ప్లేస్మెంట్లో ప్రపంచస్థాయిలో 87వ ర్యాంకు , జాతీయ స్థాయిలో 27 ర్యాంకు సొంతం చేసుకున్న మేఘన లక్షా 15 వేల డాలర్ల వార్షిక వేతనం(రూ.75 లక్షలు)తో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉద్యోగం సాధించి యువతకు ఆదర్శంగా నిలిచింది. మేఘన తండ్రి శ్రీనివాస్ ముంబైకి బదిలీ కాగా, తల్లి వాణి కమాన్‌పూర్ మండలం చందనాపూర్లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. ప్రతీఒక్కరిలో అంతర్గత సామర్థ్యం ఉంటుందని, దాన్ని సరైన విధానంలో వినియోగించుకోవాలని మేఘన సూచిస్తోంది. తాము ఇద్దరం అమ్మాయిలమైనా తల్లిదండ్రులు అన్ని విధాలా తోడ్పాటునందించి ఉన్నత స్థానంలో నిలబెట్టారని పేర్కొంది. -
విశాఖ జిల్లాలో ఇద్దరు విద్యార్ధినుల అదృశ్యం
విశాఖపట్నం: జిల్లాలోని ఎన్ఎడి జంక్షన్‌లోని చైతన్య కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్ధినులు అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కాలేజీకి వెళ్లిన వారిద్దరూ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్ధినుల ఆచూకి కోసం బంధువులను, స్నేహితులను ఆ విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆరా తీశారు. అయినా వారి ఆచూకి లభించకపోవడంతో చివరికి వారు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్ధినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.