జ్యోతినగర్/కూసుమంచి : ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థలో డెవలపింగ్ ఇంజినీర్‌గా ఉన్నతోద్యోగం సాధించిన తోటకూర మేఘన జిల్లా కీర్తిని ఇనుమడింపజేసింది. ప్రపంచస్థాయిలో తెలుగింటి కీర్తి ప్రతిష్టలు చాటింది.
ఎన్టీపీసీ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్- వాణి స్వస్థలం ఖ మ్మం జిల్లా కూసుమం చి మండలం జజుల్‌రావుపేట. ఉద్యోగరీత్యా 25 ఏళ్ల క్రితమే ఈ కుటుంబం స్వస్థలాన్ని వదిలింది. వీరికి ఇద్దరు కూతుళ్లు మేఘన, అన న్య. పెద్దకుమార్తె మేఘ న విద్యాభ్యాసం రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని సెయింట్ క్లేర్ పాఠశాలలోనే సాగింది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇక్కడే చదువుకుంది. 9, 10 తరగతులు విజయవాడ కేకేఆర్ గౌతమ్ స్కూల్‌లో చదివి పదో తరగతిలో 97 శాతం మార్కులు సాధించింది. చైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీలో 98 శాతం మార్కులతో ఐఐటీలో 52వ ర్యాంకు పొంది ముంబయిలో సీఎస్‌ఈ చివరి సంవత్సరం చదువుతోంది. గూగుల్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ప్రపంచస్థాయిలో 87వ ర్యాంకు , జాతీయ స్థాయిలో 27 ర్యాంకు సొంతం చేసుకున్న మేఘన లక్షా 15 వేల డాలర్ల వార్షిక వేతనం(రూ.75 లక్షలు)తో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉద్యోగం సాధించి యువతకు ఆదర్శంగా నిలిచింది.
మేఘన తండ్రి శ్రీనివాస్ ముంబైకి బదిలీ కాగా, తల్లి వాణి కమాన్‌పూర్ మండలం చందనాపూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. ప్రతీఒక్కరిలో అంతర్గత సామర్థ్యం ఉంటుందని, దాన్ని సరైన విధానంలో వినియోగించుకోవాలని మేఘన సూచిస్తోంది. తాము ఇద్దరం అమ్మాయిలమైనా తల్లిదండ్రులు అన్ని విధాలా తోడ్పాటునందించి ఉన్నత స్థానంలో నిలబెట్టారని పేర్కొంది.
మేఘనం
Published Wed, Dec 3 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement