విశాఖపట్నం: జిల్లాలోని ఎన్ఎడి జంక్షన్‌లోని చైతన్య కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్ధినులు అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కాలేజీకి వెళ్లిన వారిద్దరూ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్ధినుల ఆచూకి కోసం బంధువులను, స్నేహితులను ఆ విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆరా తీశారు.
అయినా వారి ఆచూకి లభించకపోవడంతో చివరికి వారు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్ధినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.