
ఏమని చెప్పను!
కాలేజీ రోజుల్లో రవీందర్ అనే ఫ్రెండ్ ఉండేవాడు. కవిత్వం బాగా రాసేవాడు. అతని కవిత్వాన్ని విని మేమంతా ‘వహ్వా వహ్వా’ అని ఎంజాయ్ చేసేవాళ్లం.
కాలేజీ రోజుల్లో రవీందర్ అనే ఫ్రెండ్ ఉండేవాడు. కవిత్వం బాగా రాసేవాడు. అతని కవిత్వాన్ని విని మేమంతా ‘వహ్వా వహ్వా’ అని ఎంజాయ్ చేసేవాళ్లం. మేము మాత్రమే కాకుండా లెక్చరర్‌లు, కాలేజీ సిబ్బంది కూడా అతని కవిత్వాన్ని ఆస్వాదించేవారు. ఒకరోజు ‘ఆశు కవిత్వం’ పేరుతో ఒక కార్యక్రమం పెట్టాడు. ఎవరు ఏ టాపిక్ చెప్పినా అప్పటికప్పుడు కవిత్వం చెప్పడం మొదలుపెట్టాడు.
ప్రేక్షకుల నుంచి నాగరాజు అనే సీనియర్ లేచి ‘‘ఇలా అప్పటికప్పుడు కవిత్వం చెప్పడం పెద్ద విషయం కాదు.. నేను కూడా చెప్పగలను. కావాలంటే చెక్ చేసుకోండి’’ అని సవాలు విసిరాడు.
‘‘రవి వాన మీద కవిత్వం చెప్పాడు కాబట్టి నువ్వు ఎండ మీద చెప్పు’’ అన్నారు ఎవరో.
‘‘అలాగే’’ అంటూ మొదలు పెట్టాడు నాగరాజు-
‘ఎండ మీద చెప్పమన్నావు...
ఏమని చెప్పను!
ఏమీ చెప్పకపోతే
ఎండలా మండి పడతావు.
అందుకే నిండుగా చెబుతున్నా
ఎండ అంటే చెమటసముద్రం... అందులో మనం ఈదుతూనే ఉంటాం’
రవీందర్ కవిత్వం విని అందరం నవ్వుకున్నాం. అది ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉంటుంది.
-పి. ప్రశాంత్, విజయనగరం