'24 గంటల్లోనే ఆ కేసును ఛేదించాం'
సుల్తాన్ బజార్: నగరంలోని సుల్తాన్ బజార్ లో జరిగిన దారి దోపీడీ కేసు ను ఈస్ట్‌జోన్ పోలీసులు ఛేదించారు. దోపిడీ జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నట్టు ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ వెల్లడించారు. ఈ కేసులో నిందితులను ఆదివారం డీసీపీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. దోపీడీకి పాల్పడ్డ ఏడుగురిలో ఐదుగురిని పట్టుకున్నామని చెప్పారు. అయితే నిందితుల నుంచి రూ. 10 లక్షల 70వేలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పట్టుబడ్డ ఐదుగురిలో ఓ బాలుడు కూడా ఉన్నట్టు ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ పేర్కొన్నారు.
కాగా, హైదరాబాద్ నగరంలో గతరాత్రి సుల్తాన్ బజార్‌లో ఘారానా దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. దుకాణం మూసివేసి బైక్‌పై ఇంటికి వెళుతున్న వ్యాపారిని ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి.. రూ. 12 లక్షలు దోచుకున్నారు. అంతేకాకుండా వ్యాపారి బైక్ ను సైతం తీసుకొని పరారయ్యారు.