marchant
-
ఎల్ఐసీకి మర్చంట్ బ్యాంకర్లు రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలు ఊపందుకున్నాయి. ఇష్యూ నిర్వహణకు ప్రభుత్వం తాజాగా 10 మర్చంట్ బ్యాంకర్ సంస్థలను ఎంపిక చేసింది. గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, సిటీగ్రూప్, నోమురా హోల్డింగ్స్ తదితరాలను షార్ట్‌లిస్ట్ చేసింది. ఎల్ఐసీ ఐపీవో నిర్వహణకు 16 సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వాహక సంస్థ(దీపమ్)కు దరఖాస్తు చేశాయి. చదవండి : Aadhar Link: టెక్నికల్ ఇష్యూస్‌పై యూఐడీఏఐ క్లారిటీ.. తుది తేదీలు ఇవే! -
ఆగిన ‘గుండె’లు
తాండూర్(బెల్లంపల్లి) : ఒకే కుటుంబంలోని ఇద్దరు హఠాన్మరణం చెందడం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గంటల వ్యవధిలోనే ఆ ఇద్దరిని మృత్యువు గుండెపోటుతో కబలించడం తీరని శోకాన్ని మిగిల్చింది. తాండూర్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారి బోనగిరి సురేశ్ (63) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబీకులు సురేశ్‌కు స్థానికంగా ప్రథమ చికిత్స నిర్వహించి మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోపు సురేశ్ మృతి చెందాడు. ఈ మరణ వార్త తెలుసుకున్న అతని అన్న కమలాకర్ భార్య బోనగిరి పోచక్క (68), ఆమె కుమారుడు మురళితో కలిసి ఆసిఫాబాద్ నుంచి తాండూర్‌కు వచ్చారు. సురేశ్ భౌతికకాయాన్ని చూసేందుకు పోచక్క ఇంట్లోకి వెళ్తున్న క్రమంలోనే గుమ్మం వద్దే గుండెపోటుతో కుప్పకూలింది. ఇది గమనించిన కుటుంబీకులు వెంటనే ఆమెను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే పోచక్క తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందింది. మరిది మరణాన్ని విని ఆఖరి చూపు చూసేందుకు వచ్చిన ఆమె అనంతలోకాలకు వెళ్లిపోవడంతో వారి బంధువర్గం శోకసంద్రంలో మునిగిపోయారు. పోచక్క భర్త కమలాకర్ రిటైర్డ్ ఎంఈవోగా విధులు నిర్వహించి గతంలోనే మృతి చెందాడు. పలువురి పరామర్శ తాండూర్ మండల కేంద్రానికి చెందిన సురేశ్ ప్రముఖ వ్యాపారిగానే కాక లయన్స్ క్లబ్ సభ్యుడిగా ఎన్నో సేవలు అందించాడు. లయన్స్ క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా, కోశాధికారిగా పలు పదవులు చేపట్టిన ఆయన స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోనేవాడు. ఆయన మరణవార్త విని స్థానికులు పెద్ద ఎత్తున సురేశ్ ఇంటికి తరలివచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. జెడ్పీటీసీ మంగపతి సురేశ్‌బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి మహేందర్‌రావు, సర్పంచులు కాపర్తి సుభాష్, గడ్డం మణికుమార్, ఎంపీటీసీ సిరంగి శంకర్, మాజీ సర్పంచ్ సాలిగామ భానయ్య, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సత్యనారాయణ, సంగీతరావు, సంతోష్లతోపాటు పలువురు సురేశ్ మృతి పట్ల ఆయనకుటుంబీలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. -
మాంసం విక్రయిస్తున్న వారిపై కేసు నమోదు
నేరేడుచర్ల : నేరేడుచర్లలోని మిర్యాలగూడ రోడ్లో గాంధీ జయంతి రోజైన ఆదివారం గోవధ చేసి మాంసాన్ని విక్రయిస్తున్న సంఘటన చోటు చేసుకుంది. గాంధీ జయంతి రోజు మధ్యం, మాంసం విక్రయాలు చేపట్టరాదని గ్రామపంచాయతీ వారు ఒక రోజు ముందుగానే వ్యాపారస్తులకు సూచించారు. మిర్యాలగూడ రోడ్లో షేక్ గౌస్ గోమాంస విక్రయ కేంద్రంలో ఆవును వధించి మాంసం విక్రయిస్తుండగా స్థానికులు గ్రామపంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిబ్బంది హుటహుటిన అక్కడకు చేరుకుని మాంసం విక్రయాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాంసం విక్రయదారులు, గ్రామ పంచాయతీ సిబ్బందికి వాగ్వాదాం జరిగింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మాంసం విక్రయిస్తున్న షేక్ గౌస్, విద్యానగర్‌లో మాంసం విక్రయం చేస్తున్న నర్సింహను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపి తెలిపారు. -
'24 గంటల్లోనే ఆ కేసును ఛేదించాం'
సుల్తాన్ బజార్: నగరంలోని సుల్తాన్ బజార్ లో జరిగిన దారి దోపీడీ కేసు ను ఈస్ట్‌జోన్ పోలీసులు ఛేదించారు. దోపిడీ జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నట్టు ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ వెల్లడించారు. ఈ కేసులో నిందితులను ఆదివారం డీసీపీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. దోపీడీకి పాల్పడ్డ ఏడుగురిలో ఐదుగురిని పట్టుకున్నామని చెప్పారు. అయితే నిందితుల నుంచి రూ. 10 లక్షల 70వేలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పట్టుబడ్డ ఐదుగురిలో ఓ బాలుడు కూడా ఉన్నట్టు ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ నగరంలో గతరాత్రి సుల్తాన్ బజార్లో ఘారానా దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. దుకాణం మూసివేసి బైక్‌పై ఇంటికి వెళుతున్న వ్యాపారిని ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి.. రూ. 12 లక్షలు దోచుకున్నారు. అంతేకాకుండా వ్యాపారి బైక్ ను సైతం తీసుకొని పరారయ్యారు. -
వ్యాపారిని బైక్‌తో ఢీకొట్టి.. ఘరానా మోసం!
హైదరాబాద్: నగరంలో శనివారం రాత్రి ఘారానా చోరీ జరిగింది. దుకాణం మూసివేసి బైక్‌పై ఇంటికి వెళుతున్న వ్యాపారిని ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి.. రూ. 12 లక్షలు దోచుకున్నారు. అంతేకాకుండా వ్యాపారి బైక్ ను సైతం తీసుకొని పరారయ్యారు. ఈ ఘటన సుల్తాన్ బజార్లో జరిగింది. సిద్ధి అంబర్ బజార్లో రాజధాని టైర్ల దుకాణం యాజమాని దివేష్ ఆదియా శనివారం రాత్రి ఇంటికి వెళుతుండగా ఈ దారుణం జరిగింది. బైక్ మీద వచ్చిన ఇద్దరు యువకులు ఆయన బైక్‌ను ఢీకొట్టి.. దృష్టి మరల్చారు. ఈ ప్రమాదం హడావిడిలో ఉండగానే దివేష్ బైక్‌తోపాటు ఆయన వద్ద ఉన్న రూ. 12 లక్షలను దోచుకున్నారు. దీనిపై బాధితుడు సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.