సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ వర్సిటీలో పాలకమండలి సభ్యులు, వైస్ చాన్స్‌లర్ మధ్య న డుస్తున్న పోరు మరో స్థాయికి చేరుకుంది. శుక్రవా రం వీసీ రవీందర్ గుప్తా ఉన్నతవిద్యా శాఖ కమిష నర్ నవీన్ మిట్టల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వర్సిటీ నుంచి ప్రకటన విడుదల చేశారు. మరోవై పు నవీన్ మిట్టల్ చైర్మన్‌గా శుక్రవారం హైదరాబాద్ లోని రూసా భవనంలో తెయూ పాలకమండలి 57వ సమావేశం జరిగింది. వీసీ రవీందర్ గుప్తా న వీన్ మిట్టల్‌పై ఆరోపణల పర్వాన్ని మరింత పెంచ గా, పాలకమండలి సభ్యులు సైతం తమ చర్యలకు మరింత పదును పెడుతున్నారు. ఏకంగా వర్సిటీ వ్యవహారాల విషయమై ఉన్నత స్థాయి దర్యాప్తు చే యించేందుకు, ముగ్గురు రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసు లు పెట్టేందుకు తీర్మానం చేయడం గమనార్హం.
నవీన్ మిట్టల్ చైర్మన్‌గా..
వర్సిటీలో చోటుచేసుకున్న అక్రమాలపై ఉన్నత స్థా యిలో విచారణ చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు పాలకమండలి తీర్మానం చేసింది. తె లంగాణ యూనివర్సిటీల చట్టం 1991 మేరకు సెక్ష న్ 18(1) ప్రకారం 10 మంది సభ్యుల కోరం ఉండడంతో ఈసీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి వీసీ హాజరు కాకపోవడంతో ఉన్నతవిద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ చైర్మన్‌గా వ్యవహరించా రు. 1991 తెలంగాణ యూనివర్సిటీల చట్టంలోని సెక్షన్ 15(1) ప్రకారం రిజిస్ట్రార్‌ను నియమించేందుకు ఉన్న పూర్తి అధికారంతో పాలకమండలి ప్రొఫెసర్ యాదగిరిని పునర్నియామకం చేసింది. 2021 అక్టోబర్ 30న యాదగిరిని రిజిస్ట్రార్‌గా ఈసీ నియమిస్తే, వర్సిటీల చట్టంలోని 50.6(ఏ) నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్లుగా వీసీ నియమించడం చట్టవ్యతిరేకమన్నారు.
ఈసీ నియమించిన రిజిస్ట్రార్ పదవీకాలం పూర్తయితే లేదా ఆ స్థానం ఖాళీ గా ఉంటే మాత్రమే కొత్త రిజిస్ట్రార్‌ను నియమించాల్సి ఉంటుందన్నారు. అయితే ఈసీ ఆమోదం లేకుండా శివశంకర్, విద్యావర్ధిని, నిర్మలాదేవి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించారు. అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగం తదితరాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ, ఏసీబీ డీజీ, నిజామాబాద్ సీపీలతో విచారణ చేయించాల ని తీర్మానించారు. 2022–23, 2023– 24 బడ్జెట్‌కు సంబంధించి సైతం విచారణ చేపట్టాలని, ఈ నెల 12న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించా రు. తెయూలో అక్రమాలపై వరుస కథనాలను ప్రచురించిన ‘సాక్షి’కి ధన్యవాదాలు తెలిపారు. స మావేశంలో ఈసీ సభ్యు లు గంగాధర్ గౌడ్, వసుంధరా దేవి, మారయ్య గౌడ్, ఎన్‌ఎల్ శాస్త్రి, రవీందర్‌రెడ్డి, ఆరతి, నసీమ్, ప్రవీణ్‌కుమార్, చంద్రకళ పాల్గొన్నారు.
వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు..
తెయూ (డిచ్‌పల్లి) : నాపై తప్పుడు, లేనిపోని అవినీతి ఆరోపణలతో తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టను నాశనం చేస్తూ.. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ నవీన్‌మిట్టల్ లక్ష్యమని తెయూ వీసీ ప్రొఫెసర్ డి రవీందర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని వారాలుగా తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని పరిణామాలపై తీవ్ర వేదనతో, బాధతో మీడియా ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను తెయూ వీసీగా నియమించారని, అయితే నవీన్ మిట్టల్ ఇప్పుడు బ్యాక్‌డోర్ పద్ధతుల ద్వారా తన పరువు తీయాలని చూస్తున్నారని అన్నారు. యూనివర్సిటీ కొన్ని నిరాధారమైన ఆరోపణలకు వివాదాలకు కేంద్రంగా మారిందన్నారు.
వీటన్నింటికీ నవీన్ మిట్టల్ కారణమని చెప్పడానికి తనకు బాధగా ఉందన్నారు. మిట్టల్ తన నామినీ అయిన ప్రొఫెసర్ యాదగిరిని రిజిస్ట్రార్‌గా ఎలాగైనా నియమించాలనే తపనతో ఇదంతా చేస్తున్నారన్నారు. ప్రొఫెసర్ యాదగిరిని తాను వ్యతిరేకిస్తున్నానని, వర్సిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో సహకరించలేడని పేర్కొన్నారు. ఏప్రిల్ 19, 2023 న హైదరాబాద్ రూసా కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశాన్ని తాను వ్యతిరేకించినప్పటికీ, రిజిస్ట్రార్‌గా యాదగిరిని నియమించాలని తీర్మానాన్ని ఆమోదించారని తెలిపారు.
దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించి ఈసీ నిర్ణయాలపై స్టే తెచ్చినట్లు తెలిపారు. ఒకే ఒక్క ఐఏఎస్ అధికారి తన ఉద్దేశాలు, చట్టవిరుద్ధమైన నిర్ణయాలతో విద్యాశాఖలోని మొత్తం వ్యవస్థలను తారుమారు చేయడం దురదృష్టకరమని వీసీ పేర్కొన్నారు. తెలంగాణ గ్రామీణ విద్యార్థులకు సేవలందిస్తున్న గొప్ప యూనివర్సిటీ ఖ్యాతిని పణంగా పెట్టి ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ యూనివర్సిటీకి విడుదల చేయాల్సిన రూసా (రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్షా అభియాన్) మంజూరు నిధులను రూ.20 కోట్లను మిట్టల్ నిలిపివేస్తున్నారని ఆరోపించారు.
రూసా డైరక్టర్‌గా ఉన్న మిట్టల్ తనకు నచ్చిన వ్యక్తిని ఇక్కడ రిజిస్ట్రార్‌గా నియమించినప్పుడే వర్సిటీకి ఈ మొత్తాన్ని విడుదల చేసేందుకు సుముఖంగా ఉండటం శోచనీయమన్నారు. మిట్టల్ అనవసర జోక్యాన్ని అడ్డుకుని యూనివర్సిటీని యథావిధిగా నిర్వహించేలా చూడాలని సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఇతర ఉన్నతాధికారులకు వీసీ విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఏ ఏజెన్సీ ద్వారానైనా న్యాయవిచారణకు తాను సిద్ధంగా ఉన్నట్లు వీసీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment