విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కుంభకోణంపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఈసీ సభ్యులు వసుంధరాదేవి, గంగాధర్‌గౌడ్, ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. తెలుగు విభాగం స్కాలర్ పుప్పాల రవీందర్‌కు ఇచ్చిన పీహెచ్‌డీ అవార్డుపై విచారించేందుకు నిర్ణయించారు. అదేవిధంగా ఆర్ట్స్ విభాగం డీన్ కనకయ్య ఇచ్చిన సూపర్ న్యూమరరీ కోటా పీహెచ్‌డీ అడ్మిషన్లపైనా విచారణకు తీర్మానం చేశారు. పీహెచ్‌డీ స్కాంపై నిజామాబాద్ జిల్లా విద్యార్థి, యువజన, విద్యావంతుల, మేధావుల ఐక్య కార్యాచరణ సమితి పేరిట తాజాగా నవీన్ మిట్టల్‌కు ఇప్పటికే ఫిర్యాదు అందింది.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అక్రమ నియామకా లకు పాల్పడిన వైస్ చాన్స్‌లర్‌కు, నీకు తేడా ఏముంటుందని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ రిజిస్ట్రార్ యాదగిరిని మందలించారు. ఇప్పటికే అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగం కా రణంగా తెలంగాణ వర్సిటీ పరువు పోయిందని, దీంతో ఈసీ చర్యలకు పూనుకుందని.. ఎలాంటి నియామకాలు చేయవద్దని ప్రభుత్వం, ఈసీ చెప్పినప్పటికీ.. అవసరం ఆధారంగా నియామకాలు చే యాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ యాదగిరి అనడంపై పాలకమండలి సభ్యులు అభ్యంతరం చెప్పడంతో పాటు గట్టిగా ప్రశ్నించడంతో నవీన్ మిట్టల్ ఈ వ్యా ఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రూసా భవనంలో టీయూ 58వ పాలకమండలి సమావేశం జరిగింది. వీసీ రవీందర్ గుప్తా హాజరు కాకపోవ డంతో నవీన్ మిట్టల్ సమావేశానికి చైర్మన్‌గా వ్యవహరించారు. రిజిస్ట్రార్ వ్యవస్థను కాపాడాల్సిందేనన్నారు. వీసీ చేసిన విధంగానే నియామకాలు చేస్తానంటే ఎలా అని మిట్టల్ మందలించారు. ఇదిలా ఉండగా అంతర్గత ప్రమోషన్లు పొందిన వారు యా దగిరిని కలిసిన నేపథ్యంలో.. వాళ్లకు తమను కలవాలని ఎలా సలహా ఇస్తారని పాలకమండలి సభ్యు లు నిలదీశారు. ప్రభుత్వం పదోన్నతులు ఇవ్వొద్దని నిర్ణయిస్తే తమను కలవమని ఎలా సూచించార న్నారు. నెపం తమపైకి నెట్టే ప్రయత్నం చేస్తే ఎలా అని ఈసీ సభ్యులు ప్రశ్నించారు. సమావేశంలో పలు తీర్మానాలను చేశారు.
కేసు నమోదుకు..
ఈ నెల 15న విద్యావర్ధిని సస్పెన్షన్‌కు ఆర్డర్ జారీ చేయాలని రిజిస్ట్రార్ యాదగిరిని ఆదేశించారు. అదేవిధంగా అకడమిక్ కన్సల్టెంట్ శ్రీనివాస్‌ను రిమూవ్ చేసే ఆర్డర్ సైతం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కనకయ్య నలుగురు ప్రొఫెసర్ల సర్వీసు పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లి జిరాక్స్ కాపీలను తీసి బయట పంచిపెట్టిన విషయమై సైతం కేసు నమోదుకు నిర్ణయించారు. సమావేశంలో ఈసీ సభ్యులు వసుంధరాదేవి, గంగాధర్‌గౌడ్, మారయ్యగౌడ్, ఎన్‌ఎల్ శాస్త్రి, ప్రవీణ్‌కుమార్, రవీందర్‌రెడ్డి, ఆరతి, నసీమ్, చంద్రకళ పాల్గొన్నారు.
ఈసీకి పంపిన తర్వాతే..
గత నెల 26న, ఈ నెల 5న నిర్వహించిన సమావేశాల్లో చేసిన తీర్మానాలను తక్షణమే అమలు చేయాలని రిజిస్ట్రార్ యాదగిరిని ఈసీ ఆదేశించింది. బడ్జెట్ ఆమోదం కానుందున ప్రస్తుత రిజిస్ట్రార్ జీతాలతో సహా చేసే ప్రతి ఖర్చు వివరాన్ని ప్రతి వారం ఈసీకి పంపి ఆమోదించాకే చేయాలని నిర్ణయించారు. వీసీ చేసిన నియామకాలను రద్దు చేయడంతో పాటు, విద్యావర్ధిని చేసిన జీతాల చెల్లింపునకు సంబంధించి రికవరీ చేయాలని నిర్ణయించారు. లేకపోతే క్రిమినల్ కేసులు పెట్టాలని తీర్మానించారు. విద్యావర్ధిని, శివశంకర్ చేసిన నిధుల దుర్వినియోగం వివరాలను తదుపరి ఈ నెల 25న నిర్వహించే ఈసీ సమావేశంలో అందించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment