అన్నం తిని అనారోగ్యానికి గురైన ఓ ఆవు బుధవారం మృతి చెందింది.
రంగారెడ్డి(శంషాబాద్): అన్నం తిని అనారోగ్యానికి గురైన ఓ ఆవు బుధవారం మృతి చెందింది. వివరాలు..మండలంలోని ఘాంసిమియాగూడకు చెందిన రవీందర్ ఆవును పోషించుకుంటున్నాడు. రెండు రోజుల కిందట గ్రామంలో బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ అమ్మవారికి నైవేధ్యంగా సమర్చించిన అన్నంను సమీపంలో ఓ కుప్పగా పోశారు.
మంగళవారం అటుగా వెళ్లిన ఆవు ఆ అన్నం తినింది. అన్నం తిన్న ఆవు అనారోగ్యానికి గురై బుధవారం మృతి చెందింది. ఆవు మృతితో తనకు ఉపాధి లేకుండా పోయిందని, నష్టపరిహారం ఇప్పించాలని బాధితుడు కోరుతున్నాడు.