వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌పై కేసు | Case against Whatsaap Group Admin | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌పై కేసు

Published Sat, May 20 2017 3:06 AM | Last Updated on Fri, Jul 27 2018 1:16 PM

వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌పై కేసు - Sakshi

వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌పై కేసు

మరో ఇద్దరిపైనా..

ఆదిలాబాద్‌: ఓ వర్గానికి చెందిన దేవుళ్లను కించపరిచే విధంగా వాట్సాప్‌లో ఫొటోలు అప్‌లోడ్‌ చేసిన వ్యక్తిపై ఉట్నూర్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ఎం.శ్రీనివాస్‌ తెలిపారు. ఉట్నూర్‌లోని అభి డిజిటల్‌ ఫొటో స్టూడియో యజమాని రవీందర్‌ వాట్సాప్‌ గ్రూప్‌ తయారు చేసి అందులో దేవుళ్లను కించే పరిచే విధంగా ఫొటోలు పెడుతూ రెచ్చగొడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడిని ఉట్నూర్‌ ఏఎస్సై ముకుంద్‌రావు అరెస్టు చేశారు.

రవీందర్‌ పెట్టిన ఫొటోలకు స్పందించిన నారాయణ, శ్రీనునాయక్, ఉషశ్రీలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో వారిపైనా కేసు నమోదు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలోనే వాట్సాప్‌ గ్రూప్‌ తయారు చేసిన వారిపై కేసు నమోదు చేయడం మొదటిసారి అని పేర్కొన్నారు. ఇలాంటి రెచ్చ గొట్టే పోస్టులు చేసేవారిపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఎస్పీ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement