రాజ్యాంగ ధర్మాసనానికి వాట్సాప్ కేసు
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్య మం వాట్సాప్ గోప్యత విధానంపై విచారణను సుప్రీం కోర్టు బుధవారం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. ఏప్రిల్ 18న ఈ కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచా రించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్ర చూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును బుధ వారం విచారిస్తూ.. ఇది దేశ ప్రజల గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛలకు సంబంధించినది కాబట్టి రాజ్యాంగ అంశం అవుతుందనీ, అందువల్ల ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తు న్నామని పేర్కొంది. అంతకుముందు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదన వినిపిస్తూ.. ఇది పూర్తిగా ఒప్పంద సంబంధిత విషయమైనందున రాజ్యాంగ ధర్మాసనానికి పంపాల్సిన అవసరం లేదన్నారు.
గతంలో వాట్సాప్ గోప్యత విధానం కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పునిస్తూ, 2016 సెప్టెంబరు 25 వరకు ఉన్న వినియోగదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్, దాని అనుబంధ సంస్థలకు వాట్సాప్ ఇవ్వకూడదని ఆదేశించింది. సెప్టెంబరు 25 తర్వాత వినియోగ దారుల సమాచారాన్ని వాట్సాప్ ఫేస్‌బుక్‌తో పంచుకోవడం ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 , ఆర్టికల్ 21 లను ఉల్లంఘించిందని ఇద్దరు వ్యక్తులు వాట్సాప్‌పై కేసు వేశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పును కూడా వారు తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ కేసునే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.