30 మందిని చంపింది నేనే... | Delhi serial killer murdered 30 children, sexually abused corpses | Sakshi
Sakshi News home page

30 మందిని చంపింది నేనే...

Published Wed, Jul 22 2015 10:01 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

30 మందిని చంపింది నేనే...

30 మందిని చంపింది నేనే...

న్యూఢిల్లీ : దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో మొత్తం 30మందిని హత్య చేసింది తానేనని సీరియల్ కిల్లర్ రవీందర్ కుమార్ అంగీకరించాడు. ఈ విషయాన్ని డీసీపీ విక్రమ్ సింగ్ వెల్లడించారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పడంతో తాను తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యానన్నారు. 2008 నుంచే హత్యలకు పాల్పడుతున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడని సింగ్ చెప్పారు.

'విచారణ సమయంలో ఈ విషయాన్ని రవీందర్ చెప్పగానే షాక్ అయ్యా. ఆ సమయంలో నా చెవిన పడిన మాటలన్నింటినీ ఇప్పుడు చెప్పలేను. అయితే అతని నేరాంగీకారం వాస్తవాలను నిర్థారించేందుకు దోహదపడింది' అని గద్గద స్వరంతో తెలిపారు. అయితే విచారణలో తమకు ఇచ్చిన సమచారం ప్రకారం హత్యకు గురైన వారి సంఖ్య 40కి చేరే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement