Asma
-
స్త్రీల ఇమేజ్ పెంచేలా...
రాంకి (వీర్నాల రామకృష్ణ) హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘టెంప్ట్ రాజా’. దివ్యా రావు (డిగ్రీ కాలేజ్ ఫేమ్), ఆస్మ హీరోయిన్లుగా నటించారు. ఏఆర్కే ఆర్ట్స్ సమర్పణలో సే క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాంకి (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ– ‘‘ఫీమేల్ ఓరియంటెడ్‌గా రూపొందిన చిత్రమిది. మహిళల ఇమేజ్‌ని పెంచే ఓ మంచి సందేశాత్మక చిత్రం. రొమాన్స్ విషయంలో మహిళల ఫీలింగ్స్ ఏంటనేది చాలా సున్నితంగా చూపించాం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అవుతారు. గతంలో మేం విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన రాగా, తాజాగా టీజర్‌కి కూడా ఇంకా మంచి స్పందన వస్తోంది. దివ్యా రావు, ఆస్మ చాలా బాగా నటించారు. ముఖ్యంగా పోసాని కృష్ణమురళిగారు ఎంతో బిజీగా ఉన్నా కూడా మా సినిమాలో నటించి, నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆయన చేసిన కామెడీ సినిమాలో హైలైట్’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి. గురువరవ్, కెమెరా: రాజు, సంగీతం: హరి గౌర. -
యూత్ రాజా
రాంకి (వీర్నాల రామకృష్ణ) హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘టెంప్ట్ రాజ’. ఏఆర్కే ఆర్ట్స్ సమర్పణలో రాంకి (రామకృష్ణ) తెరకెక్కించారు. దివ్యా రావు, ఆస్మ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. వీర్నాల రామకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఫీమేల్ ఓరియంటెడ్‌గా తెరకెక్కిన చిత్రమిది. యువతను అలరించే అంశాలు ఉన్నాయి. పోసాని కృష్ణమురళీగారి పాత్ర కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.గురువరవ్, సంగీతం: హరి గౌర. -
శ్రీనగర్ చదువులమ్మ
చదవాలంటే ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రతకు ప్రశాంతత కావాలి. జమ్ము– కశ్మీర్లో ప్రశాంతత తుపాకీ మొన అంత కర్కశమైనది. బూట్ల చప్పుడంత కఠినమైనది. అయినప్పటికీ అస్మా షకీల్ చదవగలిగింది. ఇంటర్ సి.బి.ఎస్.సి ఫలితాలలో టాపర్‌గా నిలువగలిగింది. అంతేనా? అమెరికా యూనివర్సిటీ నుంచి రెండు కోట్ల రూపాయల స్కాలర్షిప్ను కూడా గెలుచుకుంది. శ్రీనగర్ నుంచి రోజువారీ వినిపించే వార్తల్లాంటివి కాకుండా ఈ వార్త చాలామందికి సంతోషం కలిగింది. శ్రీనగర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన అస్మా షకీల్ సోమవారం వెలువడ్డ సి.బి.ఎస్.ఇ ఇంటర్ ఫలితాలలో 98.2 శాతం మార్కులతో జమ్ము–కశ్మీర్ లోయలో టాపర్‌గా నిలిచింది. 500 మార్కులకు ఆమె 492 మార్కులు సాధించింది. శ్రీనగర్‌లోని బార్జుల్లా ప్రాంతంలో నివాసం ఉండే అస్మా తల్లి గృహిణి. తండ్రి వ్యాపార వేత్త. ఆమెకు అన్నయ్య ఉన్నాడు. ఇస్మా షకీల్ అనే కవల సోదరి ఉంది. ఇస్మాకు ఇవే పరీక్షలలో 95 శాతం మార్కులు వచ్చాయి. ‘చెల్లెలిని మోసం చేసి అక్క ముందుకు వెళ్లిపోయింది’ అని అస్మా గురించి స్నేహితులు సరదాగా జోక్ చేస్తున్నారిప్పుడు. రెండు కోట్ల స్కాలర్షిప్ సి.బి.ఎస్.ఇ ఇంటర్ ఫలితాలలో టాపర్‌గా నిలిచిన అస్మా ఈ పరీక్షలు రాయడానికి ముందే తాను పై చదువులు విదేశాలలో చదవాలని నిశ్చయించుకుంది. ఇంట్లో కూడా ఇందుకు అనుమతి లభించింది. అయితే 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జమ్ము–కశ్మీర్లకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఫలితంగా అక్కడ లాక్డౌన్ వచ్చింది. స్కూళ్లు మూతపడ్డాయి. ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది. ఒకవైపు చదువు టెన్షన్.. మరో వైపు విదేశాలలో వివిధ యూనివర్సిటీలకు అప్లై చేయాలంటే ఇంటర్నెట్ కావాలి. ‘నేను ఒక నిమిషం డీలా పడిపోయాను. కాని మా స్కూల్ కరెస్పాండెంట్ అయిన విజయ్ ధర్ సార్ నన్ను పిలిచి– నువ్వు ఆగొద్దు. రెక్కలు సాచి ఎగిరిపో అని చెప్పిన మాటలు మర్చిపోలేదు.’ అంది అస్మా. ఆమె కేవలం విదేశాలలో ఉన్న యూనివర్సిటీలకు అప్లై చేసేందుకుకు ఇంటర్నెట్ కోసం డిసెంబర్లో ఢిల్లీకి వెళ్లి జనవరి వరకు అక్కడే ఉండిపోయింది. ఫిబ్రవరి మొదటి వారంలో శ్రీనగర్ తిరిగి వచ్చి ఫిబ్రవరి ఆఖరువారంలో జరిగిన పరీక్షలు రాసింది. ‘కేవలం 20 రోజులు మాత్రమే చదివాను’ అని అస్మా అంది. కాని దేవుడు ఆమెయందు ఉన్నాడు. అస్మా టాపర్‌గా వచ్చింది. అంతే కాదు అమెరికాకు చెందిన జార్జ్‌టౌన్ యూనివర్సిటీ తన కతార్ శాఖలో అస్మా పై చదువులు చదవడానికి పూర్తిస్థాయి స్కాలర్షిప్ మంజూరు చేసింది. దీని విలువ అక్షరాలా 2 కోట్లు. ఇది చాలదన్నట్టు అస్మా నాటింగ్‌హామ్ యూనివర్సిటీ (ఇంగ్లాండ్) ‘ఆసియా ఎక్స్‌లెన్స్ అవార్డు’ గెలుచుకుంది. దీని విలువ ఐదు లక్షల రూపాయలు. ఈ మొత్తం వార్తలు ఒకేసారి రావడంతో అస్మా తల్లిదండ్రులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అస్మా తల్లి ఆనందబాష్పాలు రాల్చగా తండ్రి ‘నేను ఎప్పుడూ నీ గురించే ప్రార్థించాను తల్లీ’ అని దగ్గరకు తీసుకున్నాడు. మానవహక్కుల కార్యకర్త అవుతా గొప్ప మార్కులు సాధించుకున్నవారు గొప్ప సంపద తెచ్చే కెరీర్లను ఎంచుకుంటారు. కాని అస్మా మాత్రం నేను మానవహక్కుల కార్యకర్త అవుతా అని చెబుతోంది. ‘నాకు అంతర్జాతీయ రాజకీయాల పట్ల, అంతర్జాతీయ న్యాయవిధానాల పట్ల ఆసక్తి ఉంది. నా పై చదువులన్నీ అవే. వాటిని చదివి మానవ హక్కుల కోసం ఏం చేయగలనో అది చేస్తా’ అని చెప్పిందామె. ‘నీకు ఏ కష్టం వచ్చినా దేవునితో సంభాషించు. నీకేం కావాలో అడుగు అని దేవుడు కాచుకుని ఉంటాడు. అడగకపోవడం మన తప్పు’ అంటుంది అస్మా. అస్మా ఆగస్టులో తన పై చదువుల కోసం కతార్‌కు వెళ్లనుంది. భవిష్యత్తులో మనం ఈ అమ్మాయి గురించి తప్పక వార్తలు వింటూ ఉంటామని ఆమె సంకల్పాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. – సాక్షి ఫ్యామిలీ -
ఆస్మాబేగం బుల్లెట్ : ఏ తుపాకీ నుంచి వెలువడింది?
సాక్షి, హైదరాబాద్: ప్రాపర్టీ అఫెన్సులుగా పిలిచే చోరీలు, దోపిడీల కంటే బాడీలీ అఫెన్సులుగా పరిగణించే దాడులు, హత్య, హత్యాయత్నాల దర్యాప్తునకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తారు. అందునా..తుపాకీ వాడిన కేసులను ఆఘమేఘాల మీద కొలిక్కి చేరుస్తూ ఉంటారు. నిమ్స్ ఆస్పత్రి కేంద్రంగా రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఆస్మా బేగం కేసులో మాత్రం పోలీసులు ఆ స్థాయి ఆసక్తి చూపట్లేదు. ఆమె శరీరం నుంచి బయటకు తీసిన బుల్లెట్ ఏ తుపాకీ నుంచి వెలువడింది? ఆ గన్ను కాల్చింది ఎవరు? తదితర అంశాలను వెలికితీయడానికి అవసరమైన స్థాయి ప్రాధాన్యం ఇవ్వట్లేదు. మొదట వారం రోజుల పాటు హడావుడి చేసిన అధికారులు ఆపై మిన్నకుండిపోయారు. ఫలితంగా కేసు కొలిక్కి రాకపోవడం మాట అటుంచితే..ఓ దశలో ఆ యువతి కుటుంబీకులుపోలీసులపైనే నెపం నెట్టే ప్రయత్నాలు చేశారని సమాచారం. ఇలా బయటపడిన బుల్లెట్... పాతబస్తీలోని జహనుమ ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖాదర్ కుమార్తె ఆస్మాబేగం కొన్నాళ్లు నడుమునొప్పితో బాధపడింది. వైద్యం కోసం తల్లిదండ్రులతో కలిసి నిమ్స్ ఆస్పత్రికి వచ్చింది. తొలుత సాధారణ పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు కొన్ని మందులు ఇచ్చి పంపారు. దాదాపు నెల రోజుల పాటు వీటిని వాడినా ఫలితం లేకపోవడంతో ఆమెను కుటుంబీకులు గత ఏడాది డిసెంబర్ 21న మరోసారి నిమ్స్‌కు తీసుకువచ్చారు. ఆ రోజు ఎక్స్‌రే తీసిన నిమ్స్ వైద్యులు ఆమె వెన్నెముకలోని ఎల్–1, ఎల్–2 సమీపంలో ఏదో అనుమానిత వస్తువు ఉన్నట్లు తేల్చారు. దీంతో ఆ మరుసటి రోజు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఆమె శరీరం నుంచి ఓ తూటాను బయటకు తీశారు. ఆందోళనకు గురైన వైద్యులు ఈ విషయంపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేను దర్యాప్తు చేయడానికి అటు శాంతిభద్రతల విభాగం అ«ధికారులు, ఇటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఆస్మా బేగంతో పాటు ఆమె తల్లిదండ్రులు సైతం తమకు ఏమీ తెలియదని చెప్పడంతో మిస్టరీని ఛేదించడానికి వారం రోజుల పాటు హడావుడి చేశారు. ఆస్మా బేగం శరీరంపై ఉన్న గాయాన్ని బట్టి ఆ తూటా సుదీర్ఘకాలం ఆస్మా బేగం శరీరంలో ఉండిపోయిందని వైద్యులు తేల్చారు. ఆ బుల్లెట్‌ను పరిశీలించిన నిపుణులు .32 క్యాలిబర్‌కు చెందినదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మైలార్‌దేవ్‌పల్లి కేసుతో పోల్చినా... కేసు దర్యాప్తు అంటూ తొలినాళ్లల్లో హడావుడి చేసిన పోలీసులు ఆస్మా కుటుంబీకులతో పాటు వారి ఇంటి చుట్టుపక్కల వారినీ ప్రశ్నించారు. కొన్నాళ్ల క్రితం సైబరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో చోటు చేసుకున్న హతాయత్నం కేసుతో ఈ ఉదంతాన్ని ఉన్న లింకులను పోలీసులు అధ్యయనం చేశారు. ఆస్మాబేగం తండ్రి దాదాపు 20 ఏగా పాతబస్తీకి చెందిన ఓ బడాబాబు వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అప్పట్లో ఆయన కుమారుడిపై ఓ కాల్పుల కేసులో ఆరోపణలు వచ్చాయి. పాతబస్తీకి చెందిన ఈ బడాబాబు కుమారుడు, మరో వ్యక్తి కలిసి నగర శివార్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. కింగ్స్ కాలనీలో ఉన్న బడాబాబు కుమారుడి కార్యాలయంలో 2017 నవంబర్‌లో ఓ విందు జరిగింది. ఆ సందర్భంలో అక్కడ కాల్పులు చోటు చేసుకుని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సదరు బడాబాబు కుమారుడితో పాటు అతడి తుపాకీ కోసమూ కొన్ని రోజులు ముమ్మరంగా గాలించారు. అప్పట్లో అతగాడు తన తుపాకీని తన తండ్రి వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్న ఆస్మాబేగం తండ్రి ఇంట్లో దాచి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సందర్భంలో జరిగిన మిస్‌ఫైర్‌తోనే తూటా ఆస్మా బేగం శరీరంలోకి దూసుకుపోయి ఉంటుందని అంచనా వేశారు. అర్థాంతరంగా ఆగిపోయిన దర్యాప్తు... కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోయినట్లు..కొత్త కేసుల రొదలో ఈ కాల్పుల కేసుకు చెద పట్టింది. కొన్ని రోజులు దర్యాప్తు పేరుతో హడావుడి చేసిన పోలీసులు ఆపై మిన్నకుండిపోయారు. మైలార్‌దేవ్‌పల్లిలో కేసు ఉన్న సందర్భలో ఈ మిస్‌ఫైర్ విషయం బయటకు వస్తే మరింత ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో దుండగులు రహస్యంగా ఉంచి, స్థానికంగా వైద్యం చేయించి ఉండవచ్చని అనుమానించిన అధికారులు ఆ కోణంలో ఒక్క ఆధారాన్నీ సేకరించలేకపోయారు. ఓ దశలో ఆస్మా కుటుంబీకులు పోలీసుల పైనే ఎదరుదాడికి దిగారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. నిమ్స్‌లో శస్త్రచికిత్స చేసినప్పుడు ఆస్మా శరీరం నుంచి బుల్లెట్‌ను బయటకు తీయలేదని, పోలీసులు ఎక్కడి నుంచో తీసుకువచ్చి పెట్టారని, శరీరం నుంచి తీసినట్లు కట్టుకథ అల్లారని ఆరోపించినట్లు ఆయన వివరించారు. దీంతో పాటు కొన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు ఆస్మాబేగం కేసును అటకెక్కించారని తెలుస్తోంది. -
బుల్లెట్ మ్యాన్స్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రజా గాయకుడు గద్దర్... కానిస్టేబుల్ దాసరి రాజేంద్ర ప్రసాద్... ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ..కాంగ్రెస్ నేత విక్రమ్ గౌడ్... జహనుమ ప్రాంతానికి చెందిన ఆస్మా బేగం... ఈ ఐదుగురిలో ఉన్న సారూప్యత శరీరంలో బుల్లెట్స్ ఉండడం. ఆస్మా బేగం సుదీర్ఘ కాలం తన శరీరంలో బుల్లెట్‌తోనే బతికినా... వెన్నుపూస ఉదరకోశ భాగం మధ్యలో ఉన్న దాన్ని నిమ్స్ వైద్యులు ఆదివారం శస్త్ర చికిత్స చేసి తీసేశారు. మిగిలిన నలుగురూ మాత్రం ఇప్పటికీ ‘బుల్లెట్ మ్యాన్స్’గానే కొనసాగుతున్నారు. సాధారణంగా ప్రాణహాని కలిగించే తూటాను వీరంతా తమ శరీరంలో భాగంగా ఉంచుకోవాల్సి వచ్చింది. ప్రజాగాయకుడు గుమ్మడి విఠల్‌రావ్ అలియాస్ గద్దర్‌పై 1997లో కాల్పులు జరిగాయి. ఆల్వాల్ వెంకటాపురంలోని ఆయన ఇంటి వద్దే జరిగిన ఈ ఉదంతంలో ఆయన శరీరంలోకి ఐదు తూటాలు దూసుకుపోయాయి. నాలుగింటిని ఆపరేషన్ ద్వారా తొలగించిన వైద్యులు ఆయన వెన్నెముక సమీపంలో ‘స్థిరపడిపోయిన’ ఐదో దాన్ని మాత్రం తీస్తే ప్రమాదమని వదిలేశారు. నగర పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న దాసరి రాజేంద్రప్రసాద్‌పై 2009లో కాల్పులు జరిగాయి. మక్కా మసీదు వద్ద జరిగిన పోలీసు కాల్పులకు ప్రతీకారంగా అంటూ తెహరీక్ గుల్బా ఏ ఇస్లాం (టీజీఐ) పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి ఉగ్రవాదబాట పట్టిన వికారుద్దీన్ అహ్మద్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పాతబస్తీలోని ఫలక్‌నుమ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న నాలుల్చింత వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులపై వికార్ కాల్పులు జరిపాడు. హోంగార్డు బాలస్వామి అక్కడిక్కడే చనిపోగా... పక్కనే ఉన్న కానిస్టేబుల్ రాజేంద్ర తలలోకి తూటా దూసుకుపోయింది. మెదడుకు సమీపంలో ఉన్న దీన్ని తొలగించే ప్రయత్నం చేసినా, తొలగించినా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని చెప్పిన వైద్యులు అలానే ఉంచేశారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా ఉన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై 2011లో హత్యాయత్నం జరిగింది. పాతబస్తీలోని బార్కస్ ప్రాంతంలో పహిల్వాన్ అండ్ గ్యాంగ్ ఆయనపై విరుచుకుపడింది. కత్తులు, తుపాకులతో దాడికి తెగపడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సుదీర్ఘకాలం ఆస్పత్రిలో ఉన్న ఆయనకు పలు శస్త్రచికిత్సలు జరిగాయి. శరీరంలో ఉన్న ఇతర బుల్లెట్స్ తొలగించినా మూత్రపిండం, వెన్నెముక సమీపంలో ఉన్న తూటా జోలికి మాత్రం వైద్యులు పోలేదు. దీన్ని తీసే ప్రయత్నం చేస్తే అక్బర్ కాళ్ళు చచ్చుబడిపోయే ప్రమాదం ఉందని అలానే ఉంచేశారు. ఈ ముగ్గురి పైనా గుర్తుతెలియని వ్యక్తులు, ఉగ్రవాదులు, ప్రత్యర్థులు విరుచుకు పడటంతో వారు ‘బుల్లెట్ మ్యాన్స్’గా మారారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ కథ వేరు. తనపై దాడికి తానే వేసుకున్న సెల్ఫ్ స్కెచ్‌లో బుల్లెట్ మ్యాన్‌గా మారాడు. 2017లో బంజారాహిల్స్‌లోని ఇతడి ఇంట్లో హైడ్రామా చోటు చేసుకుంది. తాను ఏర్పాటు చేసుకున్న మనుషులతో తనపైనే కాల్పులు చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ తూటా ఆయన వెన్నుముక సమీపంలోకి వెళ్లి ఆగింది. దీన్ని కదిలించినా ప్రమాదమే కావడంతో వైద్యులు అలానే ఉంచేశారు. తుపాకులు నాటువైతే ఎగ్జిట్ కావు: నిపుణులు ఓ వ్యక్తిపై జరిగిన కాల్పుల ఉదంతంలో రెండు రకాలైన గాయాలు ఉంటాయి. తూటా లోపలకు దూసుకుపోయిన దాన్ని ఎంట్రీ ఊండ్ అని... శరీరం ద్వారా బయటకు దూసుకువచ్చిన దాన్ని ఎగ్జిట్ ఊండ్ అని అంటారు. నాటు తుపాకుల నుంచి వెలువడిన తూటాలు శరీరంలోకి దూసుకుపోతాయి తప్ప రెండో వైపు నుంచి బయటకు దూసుకురావు. గద్దర్, రాజేంద్ర ప్రసాద్, అక్బరుద్దీన్, విక్రమ్గౌడ్లపై కాల్పులకు వాడింది నాటు తుపాకులు కావడంతో తూటాలు ఎగ్జిట్ కాలేదు. దీనికి తోడు ఇవన్నీ పాయింట్–32 క్యాలిబర్ బుల్లెట్స్ కావడమూ ఓ కారణమే. కంపెనీ మేడ్‌గా ఉండే లైసెన్డ్స్ ఆయుధాలు లేదా పోలీసులు వినియోగించే సర్వీస్ రివాల్వర్స్లో కాల్పులు జరిపితే తూటా శరీరంలోకి వెళ్ళడంతో పాటు రెండో వైపు నుంచి దూసుకుని బయటకు వచ్చేస్తుంది. ఇవి అత్యంత ప్రమాదకర ఆయుధాలు. బుల్లెట్స్ అన్నిలెడ్తోనే తయారీ తుపాకుల్లో వాడే తూటాలను లెడ్తో తయారు చేస్తారు. కొన్ని పూర్తిగా లెడ్తోనే ఉండగా... మరికొన్న రకాలైన బుల్లెట్స్‌కు పైన కాపర్ లేదా బ్రాస్‌తో చేసిన జాకెట్ ఉంటుంది. శరీరంలోని దిగిన బుల్లెట్స్లో కొన్నింటిని వైద్యులు అలానే ఉంచేస్తారు. వీటివల్ల తొలినాళ్ళల్లో ఇబ్బంది ఉన్నా... ఆపై టిష్యూ సర్దుకుపోయి తూటాను తనలో ఇముడ్చుకుంటుంది. ఎముకలు విరిగినప్పుడు ఐరన్ ప్లేట్స్ వేస్తుంటారు. వీటినీ టిష్యూ తనలో ఇముడ్చుకున్న మాదిరిగానే తూటాలకూ ఎడ్జెస్ట్ అవుతుంది. శరీరంలోని కొన్ని సున్నిత ప్రాంతాల్లో తూటాలు ఉండిపోతే మాత్రం జీవితకాలం వైద్యుల సలహాసూచనల మేరకు ఔషధాలు వాడాల్సి ఉంటుంది. – డాక్టర్ వెంకన్న, హైదరాబాద్ క్లూస్ ఇన్చార్జ్ -
భోజ్యేషు ఇండస్ట్రీ
మహిళ ‘భోజ్యేషు మాత’ అయితే కావచ్చు. అయితే భోజనాన్ని వండి వడ్డించే పరిశ్రమలో ఆమె రాణించగలదా అనే సంశయం అనేకమందిలో ఇప్పటికీ ఉంది. ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ ‘రాణించగలం’ అని.. గత దశాబ్దకాలంగా లండన్‌లో తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఓ ఐదుగురు భారతీయ మహిళలు. దీప్నా ఆనంద్ లండన్‌లోని భారతీయ భోజన పరిశ్రమ రంగంలో దాదాపుగా మొదటి స్థానంలో ఉన్నారు దీప్నా ఆనంద్. ఈమె తాతగారు కెన్యాలో 1950లో ఒక రెస్టారెంట్ ప్రారంభించి దానికొక బ్రాండ్ ఇమేజిని సృష్టించుకున్నారు. అయితే పదిహేనేళ్ల తర్వాత దాని ప్రాభవం తగ్గిపోయింది. దాంతో ఆమె తండ్రి రంగంలోకి దిగి ‘డిప్ ఇన్ బ్రిలియంట్’ పేరుతో లండన్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సంప్రదాయ పంజాబీ తాలీని, తన కుటుంబంలో అంతా ఇష్టపడే రుచులను రెస్టారెంట్లో ప్రవేశపెట్టారు. దీంతో ఆ కెన్యా ఘుమఘుమలు లండన్‌కు వ్యాపించాయి. తర్వాత తండ్రి నుంచి తను స్వీకరించారు దీప్నా. ఇప్పుడు ‘ఇన్ కిచెన్ ఆన్ బి 4 యు’ అనే టీవీ షోతో లండన్‌లో చాలా పాపులర్ అయ్యారు. రవీందర్ భోగల్ రవీందర్ భోగల్ అనే ఈ ఫ్యాషన్ జర్నలిస్ట్ కూడా రెస్టారెంట్ వైపు తన దృష్టిని మరల్చారు. చెఫ్, కుకరీ రైటర్‌గా లండన్‌లో పేరొందారు. ‘జెంటిల్మెన్స్ క్లబ్ డెకార్’ పేరుతో రెస్టారెంట్స్‌ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. కెన్యా, నార్త్ ఇండియన్ వంటకాలను ఈమె తన రెస్టారెంట్ ద్వారా అందిస్తున్నారు. ఆస్మాఖాన్ ఇరవై నాలుగు గంటలూ ఈమె రెస్టారెంట్లో ఛాయ్ కోసం ఆర్డర్ ఇవ్వచ్చు. కోల్‌కతా వాసి అయిన ఆస్మా ఖాన్ తన ఇండియన్ రెస్టారెంట్ ద్వారా రాయల్ మొఘల్ ఘుమఘుమలను అందిస్తున్నారు. కొన్నేళ్లక్రితం కుటుంబంతో లండన్ చేరిన ఆస్మా లాయర్గానూ రాణించారు. హైదరాబాద్ రాయల్ డిషెస్, కోల్‌కతా స్ట్రీట్ ఫుడ్, బెంగాల్ క్లాసికల్ రిఫ్లెక్ట్స్.. ఆస్మా అందించే రుచులలో జిహ్వను మైమరపిస్తాయి. చెఫ్ శిల్పా దండేకర్ పూర్తిగా ఇండియన్ వంటకాలను మూడేళ్లుగా అందిస్తున్నారు. శిల్ప ఇండియన్ తాజ్ హోటల్ గ్రూప్‌లో శిక్షణ తీసుకున్నారు. యు.కె. వెళ్లిన తర్వాత అక్కడి పబ్బులలో రుచికరమైన వంటలను అందించారు. ఆ తర్వాత తనే సొంతంగా రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కాలానుగుణంగా లభించే పదార్థాలతో వంటలను రుచికరంగా అందించడం శిల్ప ప్రత్యేకత. ఏంజెలా మాలిక్ ఈమెది పంజాబీ నేపథ్యం. చెఫ్‌గా రాణించడమే కాకుండా సొంతంగా కుకరీ స్కూల్‌ను నడుపుతున్నారు. టీవీల్లోనూ, రేడియోలోనూ తన క్లాసుల ద్వారా నగరవాసులకు చేరువయ్యారు. ఏంజెలా మాలిక్ అనే మరో చెఫ్ ‘లండన్ ఫుడ్ బోర్డ్’ సభ్యురాలిగా భారతీయ రుచులపై స్థానికులకు ఆసక్తి కలిగించడంతో పాటు, భారతీయ భోజన పరిశ్రమకు విస్తృతినీ కల్పిస్తున్నారు. ‘ప్రతిభ ఉన్న ఏ రంగంలో అయినా అవకాశాల కోసం ఎదురుచూడటం కాదు, ఆ అవకాశాలను మనమే కల్పించుకోవాలి’ అనేది ఈ ఆధునిక మహిళలు వంట ద్వారా నిరూపిస్తూ చెబుతున్నారు. ఫైవ్ ఉమెన్ వీళ్ల కన్నా ముందులండన్‌లో మొదటిసారి‘చట్నీ మేరీ’ అనే పేరుతో మోడ్రన్ ఇండియన్ రెస్టారెంట్‌ని నమిత, కామెలియా అనే ఇద్దరు అక్కచెల్లెళ్లు 1990లలో ప్రారంభించారు. పంజాబీయులు అయిన ఈ అక్కచెల్లెళ్లు తమ కుటుంబ సంప్రదాయ రుచులను వండి వడ్డించారు. వంటల పుస్తకాలు, టీవీ షోల ద్వారా భోజనప్రియుల మనసులను కొల్లగొట్టారు. కొన్నాళ్లలోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు. -
ఆకాంక్షల జెండా అస్మా
అస్మా పాకిస్తాన్‌లోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఎన్నో నివేదికలను రూపొందించారు. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధిగా ఆమె ఇరాన్, భారతదేశం లాంటి చోట్ల జరుగుతున్న మత అసహనాన్ని నిగ్గదీశారు. ‘‘అనుభవాల నుంచి మనమెప్పుడూ సరైన పాఠాలు నేర్చుకోం. సమస్యల మూలాలను తెలుసుకోం. మనం మతాలని రాజకీయం చేయాలని చూస్తే, అది సృష్టించే మంటల్లో పడి మాడి మసైపోతాం!’’ మహా మేధావి, పాకిస్తాన్ మానవ హక్కుల నాయకురాలు అస్మా జహంగీర్ ప్రపంచానికి చేసిన హెచ్చరిక ఇది. అస్మా జహంగీర్ పాకిస్తాన్లో పుట్టి పెరిగారు. ప్రపంచంలో మృగ్యమవుతున్న మానవహక్కుల కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి, జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప యోధురాలు. మానవహక్కులే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా బతి కిన అస్మా ఇటీవల లాహోర్‌లో గుండెపోటుతో మరణించారు. అస్మా జహంగీర్ పేరు వినగానే హక్కుల పతాక రెపరెపలు స్ఫురణలోకి వస్తాయి. అస్మా చేసిన కృషిని గుర్తించి ఎన్నో అవార్డులు ఆమె తలుపు తట్టాయి. రామన్ మెగసెసె అవార్డు, నోబెల్ బహుమతికి ప్రత్యామ్నాయమైన ‘లైవ్లీ హుడ్ అవారు’్డ కూడా దక్కాయి. అవార్డుల కన్నా మిన్నగా అస్మా దృఢ దీక్ష కారణంగా పాక్ ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షల జెండా గగనతలంపై రెపరెపలాడడమే కాదు, ప్రపంచ హక్కుల కరదీపికైంది. అస్మా జహంగీర్ పూర్తిపేరు అస్మా జిలానీ జహంగీర్. 1952, జనవరి 27న లాహోర్‌లో జన్మించారు. తండ్రి మాలిక్ గులాం జిలానీ ప్రభుత్వోద్యోగిగా పనిచేసి, పదవీ విరమణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. పార్లమెంటు సభ్యునిగా కొనసాగిన జిలానీ 1972లో జుల్ఫీకర్ విధించిన మిలిటరీ పాలనను వ్యతిరేకించారు. అందుకు గులాం జిలానీని నాటి ప్రభుత్వం నిర్బంధించి కారాగారానికి పంపించింది. మానవహక్కుల పట్ల అస్మాలో కనిపించే అలాంటి దృఢ సంకల్పానికి తండ్రి జిలానీ చూపిన మార్గమే స్ఫూర్తిగా నిలిచింది. ఆమె మొదటి పోరాటం తండ్రి నిర్బంధాన్ని సవాల్ చేయడంతోనే ఆరంభమైంది. అస్మా లాహోర్‌లోని కిన్నెర్డ్ కళాశాల నుంచి డిగ్రీనీ, పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి 1978లో ఎల్ఎల్బి పట్టానూ పొందారు. న్యాయవాద వృత్తిని ప్రారంభించిన ఒక సంవత్సరానికే 1983లో ప్రజాస్వామ్య ఉద్యమంలో క్రియాశీలకమైన కార్యకర్తగా అవతరించి, కీలక పాత్రను నిర్వహించారు. అప్పటి జియా ఉల్ హక్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి, కారాగారానికి పంపిం చింది. తరువాత అస్మా 1986లో జెనీవాలోని అంతర్జాతీయ బాలల రక్షణ విభాగానికి వైస్ చైర్‌పర్సన్‌గా నియమితుల య్యారు. 1988లో మళ్లీ స్వదేశానికి తిరిగి వచ్చారు. జెనీవాలో ఉన్న సమయంలోనే 1987లో పాకిస్తాన్ ప్రభుత్వం మానవహక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి అస్మా తన హక్కుల పోరాటానికి విరామం ఇవ్వలేదు. ఆమె పోరాటం అనేక అంశాలపై కొనసాగింది. ముఖ్యంగా ముస్లిం మహిళల సమస్యలు, రాజకీయ హక్కులు, మైనారిటీ మతాలపై వివక్ష, వేధింపులు, హత్యాకాండలపై నిరంతరం జహంగీర్ గళం విప్పారు. 2007 నవంబర్‌లో ఎమర్జెన్సీ విధిం చిన వెంటనే అస్మా జహంగీర్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. 2012 సంవత్సరంలో ఆమెను హత్య చేయడానికి పాకిస్తాన్ ఇంటె లిజెన్స్ వర్గాలు చేస్తున్న కుట్రలు బయటకు పొక్కడంతో ప్రపంచమంతా అస్మాకు అండగా నిలిచింది. అయినా ఆమె ఎప్పుడూ చావుకు భయపడలేదు. అక్కడే కాదు ఎక్కడైనా హక్కులను గురించి మాట్లాడ్డమంటే ప్రాణాలకు తెగించడమనే అర్థం. పాకిస్తాన్లో దైవదూషణ తీవ్రమైన నేరం. దానికి శిక్ష మరణ దండన. ఇటువంటి కేసుల్లో న్యాయవాదులెవ్వరూ నిందితులకు మద్దతుగా నిలబడరు. కానీ అస్మా మాత్రం అటువంటి కేసులలో పోరాడి విజయం సాధించడం ప్రపంచాన్ని అబ్బురపరిచింది. 1993లో ఒక మసీదు గోడలపై దైవాన్ని దూషిస్తూ రాసారనే నేరారోపణతో సలామత్ మసయ, అతని తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేశారు. క్రింది కోర్టు వారికి మరణశిక్ష విధించింది. ఆ కేసులో అస్మా జహంగీర్ లాహోర్ హైకోర్టులో వారి తరఫున వాదించి 1993 ఫిబ్రవరి, 23వ తేదీన శిక్షను రద్దు చేయించడం ఆమె సాహసానికి మచ్చుతునక. ఒక దేశద్రోహం కేసు విషయంలో కూడా ఆమె చూపిన చొరవ విశేషమైనది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎం.క్యూ.ఎం పార్టీ నాయకులు అల్తాఫ్ హుస్సేన్ మీద దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాతో సహా అన్ని పత్రికలు, చానళ్లు అల్తాఫ్‌ను బహిష్కరించాయి. న్యాయవాదులెవ్వరూ కూడా ఆ కేసులో వాదించడానికి ముందుకు రాలేదు. కానీ అస్మా ఒక్కరే, ఒక్కరంటే ఒక్కరే నిలబడి భావప్రకటనా స్వేచ్ఛాపతాకాన్ని ఎగురవేసారు. అందుకుగాను ఆమె ఇంటిని సైతం పూర్తిగా ధ్వంసం చేశారు. ఆమెపై భౌతిక దాడికి ఒడిగట్టారు. కానీ ఆమె హక్కుల పోరాటాన్ని కొనసాగించారే తప్ప వెనకడుగువేయ లేదు. పాకిస్తాన్లో 1978లో జియా ఉల్ హక్ మిలిటరీ పాలనలో అనేక కొత్త చట్టాలు వచ్చాయి. హుదూద్ పేరుతో ఉన్న ఈ చట్టంలో ఖురాన్ నుంచి తీసుకున్న అనేక అంశాలపై ఆధారపడి శిక్షలు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇందులో ముస్లిం మహిళల విషయంలో అనుసరించిన వైఖరిని అస్మా జహంగీర్ సహించలేకపోయారు. ఒక అమ్మాయి వివాహం చేసుకోవడానికి తండ్రితో సహా ఎవరైనా పురుష సంరక్షకుల అనుమతి కావాలి. ఒకవేళ యువతులెవరైనా దీనిని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారమే కాదు, కుటుంబ సభ్యులే ఆ యువతులను చంపేసే సంప్రదాయం ఉన్నది. వీటిని భారతదేశంలో జరుగుతోన్న పరువు హత్యలతో పోల్చవచ్చు. దీని మీద అస్మా జరిపిన పోరాటం గొప్ప ఫలితాలను సా«ధించింది. ఉన్నత న్యాయస్థానం నుంచి న్యాయమైన తీర్పును పొందింది. అంతేకాకుండా పరువు పేరుతో యువతులను హతమార్చిన వాళ్లు ఇస్లామిక్ సంప్రదాయం పేరుతో శిక్షల నుంచి తప్పించుకునేవారు. కానీ అస్మా జహంగీర్ న్యాయస్థానాల్లో జరిపిన పోరాటం అనేక మంది నేరస్తులకు శిక్షలు విధించేటట్టు చేసింది. ఇందుకుగాను ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొం దించవలసిన అవసరం కూడా ఏర్పడింది. అస్మా జహంగీర్ పాకిస్తాన్‌లోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఎన్నో నివేదికలను రూపొందించారు. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధిగా ఆమె ఇరాన్, భారతదేశం లాంటి చోట్ల జరుగుతున్న మత అసహనాన్ని నిగ్గదీశారు. మెజారిటీ మతాలు మైనారిటీలపై జరుపుతున్న వివక్ష, అణచివేత, హింసలను ఆమె ఎలుగెత్తి చాటారు. ఐక్యరాజ్యసమితికి చెందిన మానవహక్కుల విభాగం తరపున భారతదేశంలో మానవ హక్కుల నిర్లక్ష్యంపై కూడా అస్మా జహంగీర్ ఒక నివేదికను విడుదల చేశారు. 2009 జనవరి, 26న అది విడుదలయింది. భారతదేశంలో మానవ హక్కులు, పౌరహక్కులు, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక హక్కులతో పాటు, డెవలప్మెంట్ రైట్స్ పైన కూడా 2008వ సంవత్సరం మార్చి 3 నుంచి 20 వరకు పర్యటించి ఎన్నో అంశాలను సేకరించారు. భారతదేశంలో మైనారిటీల హక్కులకు భంగం కలిగిస్తున్న అనేకానేక అంశాల పట్ల అస్మా జహంగీర్ ఆందోళన వెలిబుచ్చారు. 2006లో రూపొందించిన నూతన చట్టం ఇంకా ఆమోదం పొందక పోవడం పట్ల ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె జీవితమంతా హక్కుల సాధన కోసమే వెచ్చించారు. నిజానికి అస్మా జీవితం, పోరాటం వేర్వేరు కావు. ఆమె జీవితమే పోరాటంగా బతికారు. భవిష్యత్ హక్కుల ఉద్యమాలకు వేగుచుక్కగా నిలిచారు. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 -
హక్కుల ఉద్యమ స్ఫూర్తి అస్మా
నియంతలు దేశాన్ని ఉక్కు పిడికిట్లో బంధించినప్పుడూ... గాలి సైతం భయాన్నే వీస్తున్నప్పుడూ... ఎవరూ నోరెత్తే సాహసం చేయనప్పుడూ ఒక ధిక్కార స్వరం విని పించడానికి కేవలం గుండె ధైర్యం మాత్రమే సరిపోదు. ఆ గుండె నిండా అస హాయులపై అపారమైన ప్రేమాభిమానాలుండాలి. వారికోసం ప్రాణాలొడ్డేంత తెగింపు ఉండాలి. ఆ మాదిరి ధైర్యాన్ని, తెగువనూ కేవలం పద్దెనిమిదేళ్ల వయసు లోనే సొంతం చేసుకుని, రాజీలేని పోరాటాలకు నిలువెత్తు సంతకంలా ఖ్యాతి గడిం చిన పాకిస్తాన్ మానవ హక్కుల నాయకురాలు అస్మా జహంగీర్ శనివారం కన్ను మూశారు. అస్మా అంటే ఉర్దూలో మహోన్నతమని అర్ధం. న్యాయవాదిగా, క్రియా శీల కార్యకర్తగా, ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా, మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కుల కోసం అలుపెరగని పోరు చేసిన యోధురాలిగా అస్మా సార్ధక నామధేయు రాలయ్యారు. దేన్నయినా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం, పోరాడటానికి సిద్ధపడటం మొదటినుంచీ ఆమె నైజం. ఈ క్రమంలో పర్యవసానాల గురించి ఒక్క క్షణం కూడా ఆమె ఆలోచించలేదు. అది బలూచిస్తాన్ కావొచ్చు, ఆక్రమిత కశ్మీర్ కావొచ్చు. న్యాయబద్ధమైన ఉద్యమాలైనప్పుడు వాటికి అండగా నిలబడటానికి ఆమె వెనకాడలేదు. ఆ రెండుచోట్లా వేలమంది యువకుల్ని పాకిస్తాన్ సైన్యం కను సన్నల్లో పనిచేసే గూఢచార సంస్థ ఐఎస్ఐ మాయం చేసినప్పుడు వారి ఆచూకీ తెల పాలంటూ సాగిన ఉద్యమానికి తోడ్పాటునందించడంతోపాటు అక్కడి సుప్రీంకో ర్టులో ఆ యువకుల కుటుంబాల తరఫున పోరాడారు. ఉదారవాదులకు చాన్నాళ్లక్రితమే దక్షిణాసియా దేశాల్లో సంకట స్థితి ఏర్ప డింది. ఉద్యమిస్తున్నవారి తరఫున పోరాడేవారికి ముద్రలేయడం అన్ని దేశాల్లోనూ రివాజుగా మారింది. శ్రీలంకలో తమిళ టైగర్ల అణచివేతను ప్రశ్నించినవారిని అప్పటి రాజపక్సే ప్రభుత్వం ఉగ్రవాదులుగా ముద్రేసింది. ఇప్పుడు మయన్మార్‌లో రోహింగ్యాల ఊచకోతను నిలదీస్తున్నవారిపైనా అక్కడి ప్రభుత్వం అనేక కేసులు బనాయించి హింసిస్తోంది. మన దేశంలో కశ్మీర్లో హక్కుల ఉల్లంఘనల్ని ప్రశ్నిస్తే ఉగ్రవాద సమర్ధకులుగా, పాకిస్తాన్ అనుకూలురుగా ఎలా ముద్రేస్తారో... పాకి స్తాన్‌లో అస్మా జహంగీర్‌పై కూడా అక్కడి పాలకులు అటువంటి నిందారోపణలే చేశారు. ఆమెను భారత గూఢచార సంస్థ ‘రా’ ఏజెంటుగా అభివర్ణించి ఇబ్బందులు పెట్టాలని చూశారు. అయినా అస్మా కొంచెం కూడా బెదరలేదు. ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిన ప్రతి సందర్భంలో ఆమె ముందుండి పోరాడారు. మైనారిటీలను వేధించడం కోసం తీసుకొచ్చిన దైవ దూషణ చట్టాన్ని ఖండించడంతో వదిలిపెట్ట లేదు. గరిష్టంగా మరణశిక్ష విధించడానికి ఆస్కారమున్న ఆ చట్టం కింద అరెస్టయిన వందలమంది తరఫున న్యాయస్థానాల్లో వాదించారు. రెండు మూడు కేసుల్లో కింది కోర్టులు విధించిన మరణశిక్షలు సుప్రీంకోర్టు రద్దు చేయడానికి ఆమె వాదనా పటిమే కారణం. ఆ తర్వాత ఆమెకు అనేక బెదిరింపులొచ్చాయి. కొందరు దుండ గులు ఆమెపై హత్యాయత్నం కూడా చేశారు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఎప్పుడూ సురక్షితంగా లేదు. అక్కడ పౌర ప్రభు త్వాల పాలన కంటే సైనిక పాలనే అధికంగా సాగింది. మతాన్ని అడ్డం పెట్టుకుని, మతతత్వాన్ని పెంచి పోషించి తమ పాలనను సుస్థిరం చేసుకోవడానికి సైనిక నియంతలు ప్రయత్నించారు. ఆ క్రమంలో సమాజంలో ఛాందసవాదాన్ని పెంచి పోషించారు. జనరల్ అయూబ్‌ఖాన్ మొదలుకొని జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ వరకూ ఇవే పోకడలు. అలాంటి నియంతలను ఎదుర్కొనడం సామాన్యం కాదు. నియంతల్ని ప్రశ్నిస్తే మతాన్ని ప్రశ్నించినట్టు... వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే మత ద్రోహానికి పాల్పడినట్టూ చిత్రించే చోట న్యాయం కోసం నిలబడటం ఎంత ప్రాణాంతకమో అస్మా జీవితం చెబుతుంది. ప్రభుత్వాలు ఆమెపై దొంగ కేసులు బనాయిస్తే, ముల్లాలు ఆమెపై ఫత్వాలు జారీచేశారు. అన్నిటినీ ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. జనరల్ యాహ్యాఖాన్ పాలనలో తన తండ్రిని అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాల్లో పోరాడిన అస్మా జనరల్ జియా ఉల్ హక్ పాలనను ఖండిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వీధుల్లో పోరాడారు. జైలుకెళ్లారు. జనరల్ ముషార్రఫ్ పాలనలో ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. సల్మా మర్యాదస్తురాలిగా మిగిలిపోవాలనుకోలేదు. మీడియా తనను ఆకాశాని కెత్తేసినంత మాత్రాన పొంగిపోలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తెకర్ చౌధరిని ముషార్రఫ్ ప్రభుత్వం తొలగించినప్పుడు జరిగిన న్యాయవాదుల ఉద్య మంలో ఆమెదే ప్రధాన పాత్ర. ఆయనకు తిరిగి ఆ పదవి దక్కాక వెలువరించిన తీర్పులు ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించినప్పుడు వాటిని ప్రశ్నించడా నికి వెనకాడలేదు. తనను పాలకపక్షాల ఏజెంటుగా పలు సందర్భాల్లో నిందారోప ణలు చేసిన ఎంక్యూఎం అధినేత అల్తాఫ్ హుస్సేన్‌పై లాహోర్ హైకోర్టు ఆంక్షలు విధించినప్పుడు ఆయన తరఫున సుప్రీంకోర్టులో పోరాడి ఆ ఆంక్షలు రద్దయ్యేం దుకు కృషి చేశారు. అల్తాఫ్ కేసును ఎవరూ తీసుకోరాదన్న న్యాయవాదుల తీర్మా నాన్ని ఆమె బేఖాతరు చేశారు. అస్మా కార్యక్షేత్రం పాకిస్తాన్ గడ్డకు మాత్రమే పరిమితమై లేదు. భారత్, పాకిస్తాన్‌లు రెండూ మిత్ర దేశాలుగా మెలగాలని, ఉపఖండంలో శాంతియుత పరిస్థితులు ఏర్పడాలని ఆమె ఆశించారు. అందుకోసం ప్రజాభిప్రాయాన్ని కూడ గట్టడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. పలుమార్లు మన దేశం సందర్శించి ఇక్కడి సభల్లో మాట్లాడారు. తనను భారత్ ఏజెంట్‌గా అభివర్ణిస్తున్నా ఈ కృషిలో ఆమె వెనక్కి తగ్గలేదు. పెషావర్ పాఠశాలపై ఉగ్రవాదులు దాడిచేసి 148 మందిని పొట్టనబెట్టుకున్నప్పుడు ఈ దురంతంలో అసలు దోషులు ఉగ్రవాదులకు అండ దండలిచ్చిన ప్రభుత్వాలేనని ఆమె నిర్మొహమాటంగా చెప్పారు. తన కోసం, తన కుటుంబం కోసం కాక చివరి వరకూ బలహీనుల పక్షాన పోరాడిన సల్మా జహం గీర్ పాక్‌లో మాత్రమే కాదు... వర్ధమాన దేశాల్లోని వారందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారు. -
అస్మా మృతదేహం వెలికితీత - పోస్టుమార్టం
వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంకొప్పర్తికి చెందిన అస్మా(6) అనే చిన్నారి హత్యకు గురైన విషయం తెలిసిందే. అస్మా మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం తహశీల్దార్, రూరల్ సీఐ ఆధ్యర్యంలో వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి గ్రామానికి చెందిన నాయబ్ రసూల్, మస్తానీ దంపతుల కుమార్తె అస్మా(6) ఈనెల 6వ తేదీ అదృశ్యమైంది. ఎక్కడ వెదికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చిన్నారిని తన భర్తే హత్యచేసి పూడ్చిపెట్టాడని అదే గ్రామానికి చెందిన ఓబులేశు బార్య పోలీసులకు చెప్పడంతో కేసు మలుపు తిరిగింది. ఓబులేసును అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం మధ్యాహ్నం తను పూడ్చిపెట్టిన చోట తవ్వి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
మీర్ పేటలో బాలిక అదృశ్యం
ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ బాలిక కనిపించకుండా పోయిన సంఘటన మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇషఫ్రిల్ కుటుంబం గత కొన్ని రోజులుగా మీర్‌చౌక్ మోడ్రన్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటోంది. కాగా, ఇషఫ్రిల్ కూతురు అస్మా (14) ఈ నెల 5వ తేదీన ఉదయం 7 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లింది. అనంతరం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేశారు. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోవటంతో మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పుడు అస్మా పంజాబీ డ్రెస్సు ధరించి ఉందని.. ఆచూకీ తెలిసిన వారు 040-27854797, 9490616749 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
నరకం నుంచి నయా జీవితంలోకి..
-
నరకం నుంచి నయా జీవితంలోకి..
వేడుకగా ఆస్మా నిఖా రాజేంద్రనగర్ / లంగర్‌హౌస్ : కన్న తండ్రే కాలయముడై పెట్టిన నరకం నుంచి బయటపడిన ఆస్మా కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. ఆదివారం హైదర్షాకోట్లోని కస్తూర్బా ట్రస్ట్ ఆవరణ లో ఆస్మా, మహ్మద్ మాజిద్‌కు అధికారులే పెద్దలుగా, గ్రామంలోని ప్రజలే బంధువులుగా హాజరై నిఖా జరిపించారు. పోలీసులు, ట్రస్ట్ నిర్వాహకులు, బస్తీ పెద్దలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వేడుకకు హాజరయ్యారు. వధువు ను అత్తారింటికి పంపించే సమయంలో ట్రస్ట్‌లో ఆశ్రయం పొందుతున్న వారు కన్నీరు పెట్టారు. ఇదీ ఆస్మా కథ.. సరూర్‌నగర్ మండలం భగత్‌సింగ్ నగర్‌కు చెందిన మహ్మద్ అన్వర్ మియా, దౌలత్‌బీ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వీరిలో ఆస్మా ఒకరు. 2007లో దౌలత్‌బీ చనిపోయింది. అప్పటి నుంచి తనకు అడ్డుగా ఉన్నారని ఆస్మాతో పాటు చెల్లెలు నజ్మాను తండ్రి అన్వర్ ఇంట్లో నిర్భంధించి తిండి పెట్టకుండా చిత్ర హింసలు పెట్టాడు. మానసికంగా, శారీరకంగా కుంగిపోయి మృత్యువుకు చేరువైన వీరిని పోలీసుల సాయంతో స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం హైదర్షాకోట్లోని కస్తూర్బా ట్రస్ట్‌లో ఆశ్రయం ఇచ్చారు. గత ఎనిమిదేళ్లుగా ఆస్మా, నజ్మాలు ఇక్కడే ఉంటున్నారు. ఆస్మా కిచెన్ నిర్వహణ చూసుకునేది. ఇదిలా ఉండగా, భగత్‌సింగ్ నగర్‌లోని ఫారుఖ్ మహ్మద్, మసీద్ నిర్వహకులు వీరి గురించి తెలుసుకుని సాయం అందించారు. కొత్త ఇంటిని నిర్మించారు. అదే బస్తీకి చెందిన అబ్దుల్ రహమాన్ కుమారుడు మహ్మద్ అబ్దుల్ మాజిద్‌కు ఆస్మాను ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. విషయాన్ని ట్రస్ట్ ఇన్చార్జి పద్మావతికి చెప్పగా, ఆమె స్వచ్ఛంద సంస్థలు, నార్సింగి పోలీసులు, రాజేంద్రనగర్ ఏసీపీ, గ్రామ సర్పంచ్ సాయం కోరారు. అందరూ ముందుకు రావడంతో ఆదివారం వీరి వివాహాన్ని వేడుకగా జరిపించారు. అత్తాపూర్ అగర్వాల్ సమాజ్ నిర్వహకులు భోజనాలు ఏర్పాటు చేశారు. యాంకర్ ఉదయభాను, సర్పంచ్ కృష్ణారెడ్డి, ఏసీపీ గంగారెడ్డి, ఇన్స్పెక్టర్ రాంచంద్రరావు, ఎస్సై సుధీర్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సాయం అందించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు ఆజీజ్ పాషా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.