స్త్రీల ఇమేజ్‌ పెంచేలా... | Tempt Raja Teaser Release | Sakshi
Sakshi News home page

స్త్రీల ఇమేజ్‌ పెంచేలా...

Nov 29 2020 12:38 AM | Updated on Nov 29 2020 12:38 AM

Tempt Raja Teaser Release - Sakshi

రాంకి (వీర్నాల రామకృష్ణ) హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘టెంప్ట్‌ రాజా’.  దివ్యా రావు (డిగ్రీ కాలేజ్‌ ఫేమ్‌), ఆస్మ హీరోయిన్లుగా నటించారు. ఏఆర్కే ఆర్ట్స్‌ సమర్పణలో సే క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా టీజర్‌ను  విడుదల చేశారు. ఈ సందర్భంగా రాంకి (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ– ‘‘ఫీమేల్‌ ఓరియంటెడ్‌గా రూపొందిన చిత్రమిది. మహిళల ఇమేజ్‌ని పెంచే ఓ మంచి సందేశాత్మక చిత్రం. రొమాన్స్‌ విషయంలో మహిళల ఫీలింగ్స్‌ ఏంటనేది చాలా సున్నితంగా చూపించాం.

ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. గతంలో మేం విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్,  మోషన్‌ పోస్టర్‌కి మంచి స్పందన రాగా, తాజాగా టీజర్‌కి కూడా ఇంకా మంచి స్పందన వస్తోంది. దివ్యా రావు, ఆస్మ చాలా బాగా నటించారు. ముఖ్యంగా పోసాని కృష్ణమురళిగారు ఎంతో బిజీగా ఉన్నా కూడా మా సినిమాలో నటించి, నన్ను ఎంతో ఎంకరేజ్‌ చేశారు. ఆయన చేసిన కామెడీ సినిమాలో హైలైట్‌’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: డి. గురువరవ్, కెమెరా: రాజు, సంగీతం: హరి గౌర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement