ramki
-
జాలరి కానుక..
బుర్హాన్‌పురం జమీందారు భువనచంద్ర. అతని పుట్టినరోజు విందుకు ప్రజలందరినీ పిలిచేవాడు. కొందరు పెంచుకునే కోడినో, బాతునో జమీందారుకు కానుకగా ఇచ్చేవారు. బుర్హాన్‌పురంలోనే సైదులు అనే పేద జాలరి ఉండేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే వల తీసుకుని చెరువుకు పోయి చేపలు పట్టేవాడు. తాటాకు బుట్ట నిండాక వాటిని సంతలో అమ్మి జీవించేవాడు. ప్రతిఏడు జమీందారు పుట్టిన రోజుకు పెద్ద చేపను కానుకగా ఇచ్చేవాడు. ఎప్పటిలా ఆ సంవత్సరమూ భువనచంద్ర పుట్టినరోజు వచ్చింది. ఈసారి మరింత పెద్ద చేపను పట్టి జమీందారుకు కానుకగా ఇవ్వాలనుకున్నాడు సైదులు. తాటాకు బుట్ట, వల తీసుకుని చెరువుకు పోయాడు. చెరువులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి.ఆ ఏడు వానలు సరిగా పడలేదు. వరుణుడు కరుణిస్తేనే జాలరి నోట్లోకి బువ్వ పోయేది. చెరువులో వల విసిరాడు. కొద్దిసేపటికి వల బరువెక్కింది. వలలో పెద్ద చేపే చిక్కిందని ఆశతో వలను లాగి ఒడ్డుకు తెచ్చి దులిపాడు. చేప చిక్కలేదు కానీ.. తాబేలు వలలో చిక్కింది. తాబేలు తన డిప్పలోంచి తల బయటకి పెట్టి చూసి, చెరువు వైపు అడుగులు వేసింది. చేప చిక్కనందుకు నిరాశ చెందాడు సైదులు. ఒక్క నిమిషం ఆలోచించి, తాబేలును పట్టుకుని తాటాకు బుట్టలో వేసుకున్నాడు. పేదవాడైన సైదులు వద్ద జమీందారుకు కానుకగా ఇవ్వటానికి ఏమీలేదు. చేసేది లేక తాబేలునే కొత్త బుట్టలో వెంట తీసుకెళ్లాడు. జమీందారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, పాదాలకు దండం పెట్టి బుట్టను కానుకగా ఇచ్చాడు. ఎప్పటిలా పెద్ద చేపనే తెచ్చాడనుకుని తెరచి చూశాడు భువనచంద్ర. కానీ బుట్టలో తాబేలును చూసి ఆశ్చర్యపోయాడు.‘అయ్యా! క్షమించండి. ఎప్పటిలా పెద్ద చేపనే పట్టి తెద్దామనుకున్నాను. కానీ వర్షాలు లేక చెరువు ఎండిపోయింది. చేపలు లేవు’ అని చెప్పాడు సైదులు దిగులుగా.‘అలాగా! మరి నీకు ఎలా గడుస్తోంది సైదులు?’ అడిగాడు జమీందారు.‘చేపలు దొరికిన నాడు నోట్లోకి బువ్వ! దొరకని నాడు పస్తులే! అలవాటైపోయిందయ్యా’ అన్నాడు సైదులు. భువనచంద్ర ఒక్క క్షణం ఆచించించి ‘ఇంట్లో పెంచుకోటానికి, పూజించటానికి తాబేలును పట్టి తెమ్మని నేనే కబురు పెడదామనుకున్నాను. ఇంతలో నువ్వే కానుకగా ఇచ్చావు. చాలా సంతోషం!’ అన్నాడు. విందు చేసి ఇంటికి పోతున్న సైదులుకు చిన్న సంచి నిండా ధనసాయం చేశాడు.నాటి నుంచి తాబేలును పెంచుకోసాగాడు జమీందారు. అంతేకాదు బుర్హాన్‌పురం అంతటా వృక్షాలు నరకటం నిషేధించి, కొత్త మొక్కలను నాటించాడు. వచ్చే ఏటికల్లా.. వర్షాలు పడి చెరువులు నిండాయి. రాంకీ -
పాలీసైక్ల్‌తో రీ సస్టెయినబిలిటీ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యర్ధాల నిర్వహణ సంస్థ రీ సస్టెయినబిలిటీ (గతంలో రామ్కీ ఎన్విరో ఇంజినీర్స్) తాజాగా పాలీసైక్ల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో జట్టు కట్టింది. ప్లాస్టిక్ రసాయనాల రీసైక్లింగ్ కోసం దేశీయంగా ఫీడ్‌స్టాక్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కింద తక్కువ గ్రేడ్ ప్లాస్టిక్స్‌ను సేకరించి పాలీసైకిల్, దాని భాగస్వామ్య సంస్థల కెమికల్ రీసైక్లింగ్ ప్రాజెక్టుల కోసం ఫీడ్‌స్టాక్‌ను సిద్ధం చేయనున్నారు. ఒప్పందంలో భాగంగా ఢిల్లీలో తొలి సారి్టంగ్, ప్రీ–ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ఇటువంటి ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు తోడ్పడగలవని రీ సస్టెయినబిలిటీ సీఈవో మసూద్ మలిక్ తెలిపారు. -
‘రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’గా రామ్కీ ఎన్విరో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సమగ్ర పర్యావరణ నిర్వహణ సర్వీసులు అందించే రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ పేరు మారింది. ’రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్’గా దీన్ని రీబ్రాండ్ చేస్తున్నట్లు సంస్థ సీఈవో, ఎండీ గౌతమ్ రెడ్డి తెలిపారు. వచ్చే రెండు నెలల్లో దేశీయంగా తమ తొలి ఈ–వేస్ట్ రిఫైనింగ్ ప్లాంటును హైదరాబాద్‌లో ఆవిష్కరిస్తున్నట్లు ఆయన వివరించారు. వాహనాల స్క్రాపింగ్‌కు సంబంధించి తమ తొలి ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్ (ఈఎల్వీ) రీసైక్లింగ్ ప్లాంటు .. న్యూఢిల్లీలో వచ్చే ఆరు నెలల్లో ఏర్పాటవుతోందని గౌతమ్ రెడ్డి తెలిపారు. అలాగే ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లో కూడా ఈఎల్వీ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నట్లు ఆయన వివరించారు. వీటి ఏర్పాటుకు ఒక్కో దానికి రూ. 100 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. ‘ప్రస్తుతం భారత్ .. రీసైక్లింగ్ కోసం ఈ–వ్యర్థాలను యూరప్‌నకు ఎగుమతి చేస్తోంది. మేము హైదరాబాద్‌లో ఈ–వేస్ట్ రిఫైనింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నాం. ఇది రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుంది. రిఫైనింగ్ ప్రక్రియలో మదర్‌బోర్డులను ప్రాసెస్ చేసి .. బంగారం, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాలను రాబడతాం‘ అని ఆయన చెప్పారు. రూ. 5 వేల కోట్ల పెట్టుబడులు .. రాబోయే మూడేళ్లలో రూ. 5 వేల కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేయనున్నట్లు గౌతమ్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికైతే పబ్లిక్ ఇష్యూకి వెళ్లే యోచనేదీ లేదని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు దాదాపు రూ. 3,000 కోట్లుగాను, లాభాలు సుమారు రూ. 550 కోట్ల స్థాయిలోను ఉండగలవని అంచనా వేస్తున్నట్లు గౌతమ్ రెడ్డి వివరించారు. భారత్, సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాల్లో.. కంపెనీ ఏటా 6–7 మిలియన్ టన్నుల మేర ఘన వ్యర్ధాలను ప్రాసెస్ చేస్తోంది. -
యూఏఈలో రామ్కీ ఎన్విరో ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యావరణ నిర్వహణ సేవల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ తాజాగా యూఏఈలో ఓ ప్రాజెక్టును దక్కించుకుంది. రస్ అల్ ఖైమాలో పారిశ్రామిక ప్రమాదకర వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రస్ అల్ ఖైమా వేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీతో ఈ మేరకు రామ్కీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
‘కోట్లు సంపాదించాలని జర్నలిజాన్ని ఎంచుకోరు’
‘గంగపుత్రులు’ చిత్రం ఫేమ్ రామ్కీ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘జర్నలిస్ట్’. కె. మహేష్ దర్శకత్వం వహించారు. తషు కౌశిక్ హీరోయిన్గా నటించగా, ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్, సీనియర్ నటుడు సురేష్ కీలక పాత్రల్లో నటించారు. రాజ్ కుమార్ సమర్పణలో జి.ఆర్.కె ఫిలింస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్కీ మాట్లాడుతూ– ‘‘సామాజిక దృక్పథంతో ఉండే వారంటే నాకెంతో ఇష్టం. అలా ఉండే వ్యక్తుల్లో మొదట జర్నలిస్ట్‌లు ఉంటారు. అందుకే వారిపై ఈ సినిమా చేశాను. సమాజానికి, జనాలకి మంచి చేయాలనే ఉన్నతమైన అభిప్రాయంతో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకుంటారే కానీ, కోట్లు సంపాదించాలని కాదు. నిజమైన జర్నలిస్ట్ ఎంత బాధ్యతతో ఉంటాడో చూపించే ప్రయత్నమే మా సినిమా. కథ నచ్చడంతో ఎన్. శంకర్ నటించారు. సీనియర్ నటులు చలపతిరావు, సురేష్ అందించిన సహకారం ఎప్పటికీ మరువలేను’’ అన్నారు. ‘‘సమాజంలో జర్నలిస్ట్ పాత్ర ఎంత గొప్పదో మా చిత్రంలో చూస్తారు’’ అన్నారు సమర్పకులు రాజ్‌కుమార్. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, డా. జోస్యభట్ల, కెమెరా: ముజీర్ మాలిక్. -
స్త్రీల ఇమేజ్ పెంచేలా...
రాంకి (వీర్నాల రామకృష్ణ) హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘టెంప్ట్ రాజా’. దివ్యా రావు (డిగ్రీ కాలేజ్ ఫేమ్), ఆస్మ హీరోయిన్లుగా నటించారు. ఏఆర్కే ఆర్ట్స్ సమర్పణలో సే క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాంకి (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ– ‘‘ఫీమేల్ ఓరియంటెడ్‌గా రూపొందిన చిత్రమిది. మహిళల ఇమేజ్‌ని పెంచే ఓ మంచి సందేశాత్మక చిత్రం. రొమాన్స్ విషయంలో మహిళల ఫీలింగ్స్ ఏంటనేది చాలా సున్నితంగా చూపించాం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అవుతారు. గతంలో మేం విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన రాగా, తాజాగా టీజర్‌కి కూడా ఇంకా మంచి స్పందన వస్తోంది. దివ్యా రావు, ఆస్మ చాలా బాగా నటించారు. ముఖ్యంగా పోసాని కృష్ణమురళిగారు ఎంతో బిజీగా ఉన్నా కూడా మా సినిమాలో నటించి, నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆయన చేసిన కామెడీ సినిమాలో హైలైట్’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి. గురువరవ్, కెమెరా: రాజు, సంగీతం: హరి గౌర. -
దీక్షాయణి
జీవితంలో స్థిరత్వాన్ని సాధించిన తర్వాత ‘సమాజానికి తిరిగి ఇవ్వడం’ అనే యజ్ఞాన్ని దీక్షగా నిర్వహిస్తున్నారు దాక్షాయణి. ప్రభుత్వం చట్టం చేయడానికంటే ముందే స్వచ్ఛందంగా ఆ బాధ్యతను తలకెత్తుకున్నారామె. రామ్కీ ఫౌండేషన్ స్థాపించి దేశవ్యాప్తంగా వేలాది మంది జీవన స్థితిగతులను మెరుగుపరుస్తున్నారు. జీవితం వడ్డించిన విస్తరిలా ఉండేది కొందరికే. ఆ కొందరిలో ఒకరు దాక్షాయణి రెడ్డి ఆళ్ల. ఆమెకు జీవితంలో ఎటువంటి కష్టమూ ఎదురు కాలేదు. కానీ బతకడం కోసం కష్టపడే వాళ్ల ‘కష్టం’ విలువ తెలుసు. కష్టం చేసుకుని బతుకును గాడిలో పెట్టుకోవాలనే వాళ్ల ఆకాంక్షను అర్థం చేసుకున్నారు. ఆకు ఆకు పేర్చి విస్తరి కుట్టుకుని పదార్థాలు వండి వడ్డించుకోవాలనే వాళ్ల గుండె లోతుల్లో ఉండే ఆర్ద్రతను తెలుసుకోగలిగారు. విస్తరాకులు చేయడం వచ్చిన వాళ్లకు ఆ పనిలోనే ఉపాధి కల్పించారు. వండడం వచ్చిన వాళ్లకు అందులోనే నాలుగు డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని చూపించారు. సకాలంలో వర్షాలు లేక పంటలు పరిహసించినప్పుడు ఆ కుటుంబాన్ని ‘పాడి’ ఆదుకుంటుందని కుటుంబానికి రెండు గేదెలిచ్చి మరీ నిరూపించారు. ఇవేవీ చేయడం కుదరని చోట మహిళలను సంఘటిత పరిచి దుస్తులు కుట్టడం నేర్పించారు. వర్క్ ఆర్డర్లు తెచ్చి ఆ మహిళలకు నిరంతరాయంగా పని కల్పించడానికి ఆమె సొంతంగా ఒక నెట్‌వర్క్‌నే అభివృద్ధి చేశారు. గృహిణిగా ఉన్న ఆమెను ఇవన్నీ చేయడానికి ప్రేరేపించింది గొప్ప స్ఫూర్తి ప్రదాతలు, ప్రముఖ దార్శనికులు కాదు. పల్నాడులో రాజ్యమేలిన పేదరికమే తనను ‘సమాజం మనిషి’గా మార్చిందన్నారు దాక్షాయణి. ఆమె రామ్కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చట్టాన్ని ప్రభుత్వం 2013లో తెచ్చింది. కానీ తమ సంస్థ పాతికేళ్ల కిందటే సమాజానికి తిరిగి ఇవ్వడం అనే బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు దాక్షాయణి. 1996 నుంచి తమ గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడి వాళ్లు అడిగిన అవసరాలను తీరుస్తూ వచ్చామని, 2006 ఆగస్టు 12వ తేదీ నుంచి ఈ సర్వీస్‌ను వ్యవస్థీకృతంగా మొదలు పెట్టామని చెప్పారామె. కనకమ్మవ్వ హాస్టల్ ‘‘గ్రామాల్లో దిగువ మధ్య తరగతి, అల్పాదాయ వర్గాలకు ఆడపిల్లను కాలేజ్‌లో చదివించడం అనేది ఇప్పటికీ శక్తికి మించిన పనిగానే ఉంటోంది. ముఖ్యంగా గ్రామాల నుంచి పట్టణాలకు పంపించడానికి రవాణా సరిగ్గా ఉండదు. హాస్టల్లో పెట్టి చదివించడానికి ఖర్చులు భరించలేక బాగా చదివే అమ్మాయిలను కూడా చదువు మాన్పిస్తున్నారు. అలాంటి వాళ్ల కోసం నర్సరావు పేటలో హాస్టల్ పెట్టాం. ఆ హాస్టల్ పేరు కనకమ్మవ్వ హాస్టల్. అది మా వారి (ఆళ్ల అయోధ్య రామిరెడ్డి) నానమ్మ పేరు. ఆయనకు వాళ్ల నానమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని కోరిక. అందుకే హాస్టల్‌కి ఆ అవ్వ పేరు పెట్టాను. ఏటా నలభై ఐదు మంది విద్యార్థినులకు ప్రవేశం ఉంటుంది. ఆ హాస్టల్ నుంచి ఇప్పటి వరకు ఐదు వందల యాభై మంది చదువు పూర్తి చేసుకున్నారు. మా రామ్కీ ఫౌండేషన్ ద్వారా పర్యావరణ పరిరక్షణ, చిన్న పరిశ్రమల స్థాపన, ఆరోగ్య చైతన్య సదస్సులు, ఆదివాసీల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల నిర్వహణ వంటివి 20 రాష్ట్రాల్లో, 125 గ్రామాల్లో చేస్తున్నాం. ఆరు వందల మంది మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్‌లో ట్రైనింగ్, రెండు వందల నలభై మందికి పాడి గేదెలు, మరో నాలుగు వందల మందికి బ్యూటీషియన్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇప్పించాం. కానీ అన్నింటిలోనూ నాకు వ్యక్తిగతంగా సంతృప్తినిస్తున్న సర్వీస్ ఆడపిల్లలను చదివించడమే. వాళ్లు చదువుకున్న సర్టిఫికేట్లు, జాబ్ ఆర్డర్లు చూపించి ‘నేను ఇంజనీరింగ్ పాసయ్యాను మేడమ్, పీజీ పూర్తయింది మేడమ్, ఉద్యోగం వచ్చింది మేడమ్’ అని చెబుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది’’ అని చెప్పారు దాక్షాయణి రెడ్డి ఆళ్ల. – వాకా మంజులారెడ్డి, ఫొటో: అమర్ నాన్న బాధ్యత రామ్కీ వాళ్లు తీసుకున్నారు మాది ప్రకాశం జిల్లా, మారెళ్ల పంచాయితీలోని గంగన్నపాలెం గ్రామం. అద్దంకికి పద్నాలుగు కిలోమీటర్లు. మా ఊరికి బస్సు లేదు. రెండు కిలోమీటర్ల దూరానున్న మారెళ్లకు నడిచి వెళ్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకున్నాను. ఇంటర్‌కి అద్దంకి వెళ్లాల్సిందే. అద్దంకిలో జూనియర్ కాలేజ్‌కి వెళ్లాలంటే మారెళ్లకు నడిచి వెళ్లి, అక్కడ బస్సెక్కాలి. తిరిగి వచ్చేటప్పుడు అలాగే మారెళ్ల వరకు బస్సులో వచ్చి, రెండు కిలోమీటర్లు నడిస్తే ఊరు చేరతాం. మా దగ్గర ఆడపిల్లలకు కాలేజ్ చదువు అందని ద్రాక్షగా అవడానికి ఇదే ప్రధాన కారణం. అలాంటి చోట నేను ఇంటర్ వరకు చదవగలిగాను. మెడిసిన్‌లో సీటు వచ్చింది. మా ఊర్లో పెద్దాయన యలమందారెడ్డి తాతగారు నన్ను పిలిపించి మాట్లాడి, రామ్కీ ఫౌండేషన్ వాళ్లకు చెప్పారు. వాళ్లు నాలుగేళ్ల పాటు ఏటా లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేశారు. ఈ ఫౌండేషన్ నుంచి వందలమంది సహాయం పొందుతున్నారు. ఈ నెల 27వ తేదీన నేను ఎంబీబీఎస్ పట్టా అందుకోబోతున్నాను. నేను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నా వంతుగా ఒక స్టూడెంట్‌కి సహాయం చేస్తాను. – పోతిరెడ్డి నాగలక్ష్మి, వైద్య విద్యార్థిని -
‘జగతి’ ఎఫ్‌డీఆర్‌ను వెంటనే విడుదల చేయండి
సాక్షి, అమరావతి: జగతి పబ్లికేషన్స్, రాంకీ గ్రూపు ఆస్తుల జప్తు విషయంలో ఈడీ, అడ్జ్యుడికేటింగ్ అథారిటీల తీరును మనీ లాండరింగ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. జగతి పబ్లికేషన్స్, రాంకీ సంస్థ లేవనెత్తిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, అందుబాటులో ఉన్న ఆధారాలను పట్టించుకోకుండా ఏకపక్ష వైఖరిని అవలంభించిందని పేర్కొంది. జగతి పబ్లికేషన్స్ ఎఫ్డీఆర్ జప్తు విషయంలో అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను పాక్షికంగా సవరించింది. రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్‌ను వెంటనే జప్తు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఆ రూ.10 కోట్ల మొత్తానికి సమానమైన ఇండెమ్నిటీ బాండ్‌ను హామీగా ఈడీకి సమర్పించాలని జగతి పబ్లికేషన్స్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ మన్మోహన్సింగ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. మిగిలిన ఆస్తులను వెంటనే విడుదల చేయండి ప్రత్యేక కోర్టు తుది తీర్పునిచ్చేంత వరకు ఫార్మా సిటీ లోపల 50 మీటర్ల బఫర్ జోన్‌ను కొనసాగించాలని అప్పిలెట్ ట్రిబ్యునల్ రాంకీ ఫార్మాస్యూటికల్ సిటీ లిమిటెడ్‌ను ఆదేశించింది. దీని విషయంలో మాత్రం జప్తు కొనసాగుతుందని, మిగిలిన ఆస్తులను జప్తు నుంచి వెంటనే విడుదల చేయాలని తేల్చి చెప్పింది. అనుకూలంగా ఉత్తర్వులు వచ్చేంత వరకు బఫర్ జోన్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం గానీ, బఫర్ జోన్ ప్రాంతాన్ని అమ్మడం గానీ చేయరాదని రాంకీని ఆదేశించింది. అలాగే 16 ప్లాట్లను వెంటనే రాంకీ సంస్థకు స్వాధీనం చేయాలని ఈడీ అధికారులకు స్పష్టం చేసింది. ఈ ప్లాట్లను విక్రయించడం గానీ, ఇందులో నిర్మాణాలు చేపట్టడం గానీ, థర్డ్ పార్టీ హక్కులు సృష్టించడం గానీ చేయరాదని రాంకీకి సూచించింది. ఆరోపణల నిరూపణ బాధ్యత ఈడీదే జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్‌ను, అలాగే రాంకీ గ్రూపునకు చెందిన పలు ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ జప్తును సమర్థిస్తూ ఈడీ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్, రాంకీ సంస్థ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ జరిపిన ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ మన్మోహన్సింగ్ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను పాక్షికంగా సవరిస్తూ తాజాగా తీర్పు వెలువరించారు. ఈ మొత్తం కేసులో ప్రత్యేక కోర్టు ఇంకా అభియోగాలు నమోదు చేయలేదన్నారు. అభియోగాలను నమోదు చేయనంత వరకు వ్యక్తులపై, సంస్థలపై మనీ లాండరింగ్ ఆరోపణలు చేశారో, ఆ ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత ఈడీపై ఉంటుందన్నారు. ఈ కేసులో రాంకీ గ్రూపు ‘కళంకిత డబ్బు’తో భూములు కొన్నట్లు ఈడీ ఆధారాలు చూపలేదని తెలిపారు. రాంకీతో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలోని కొన్ని కీలక క్లాజులను ఈడీ, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ విస్మరించాయని వెల్లడించారు. ఫార్మా ఇండస్ట్రియల్ పార్కు గ్రీన్‌బెల్ట్ ఏరియాను 50 మీటర్లకు తగ్గించినందుకే రాంకీ గ్రూపు జగతి పబ్లికేషన్స్‌లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ. సీబీఐ చార్జిషీట్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. అదే చార్జిషీట్ ఆధారంగానే రాంకీ, జగతి పబ్లికేషన్స్ ఆస్తులను జప్తు చేసింది. ఆ జప్తును అడ్జ్యుడికేటింగ్ అథారిటీ సమర్థించింది. అయితే, మనీ లాండరింగ్ కింద ఈడీ స్వతంత్రంగా దర్యాప్తు చేయలేదు. సీబీఐ ఆరోపణలను ఆధారంగా చేసుకుంటూ జప్తు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మనీ లాండరింగ్ కింద తాను చేసిన ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంలో ఈడీ విఫలమైంది. ఆ రూ.10 కోట్లు ‘లంచం’ అని ప్రాథమికంగా నిరూపించలేకపోయింది. కేవలం అనుమానాలు, ఊహల ఆధారంగానే జగతి పబ్లికేషన్స్, రాంకీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. రాష్ట్రంలో ఫార్మా రంగం అభివృద్ధి కోసం 18.7.2000న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. విశాఖపట్నం పరవాడలో 2,162.5 ఎకరాల్లో ఫార్మా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీకి అప్పగించింది. రాంకీ గ్రూపునకు చెందిన రాంకీ ఫార్మాస్యూటికల్ సిటీ ఇండియా లిమిటెడ్ (ఆర్‌పీసీఐఎల్) ఫార్మా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడంతో 12.3.2004న ఏపీఐఐసీ–ఆర్‌పీసీఐఎల్ మధ్య జాయింట్ వెంచర్ కింద ఒప్పందం జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఈ ఒప్పందంలో గ్రీన్‌బెల్ట్ గురించి ప్రస్తావనే లేదు. అయినప్పటికీ ఎటువంటి వివాదాలు లేకుండా ఉండేందుకు 50 మీటర్ల గ్రీన్‌బెల్ట్‌కు అంగీకరించినట్లు రాంకీ చెప్పింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఈ ఒప్పందం జరిగింది. – మనీ లాండరింగ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ మన్మోహన్సింగ్ -
ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు
‘‘మాది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. నేనే మొదటి వ్యక్తిని. ఫిల్మ్ స్కూల్లో శిక్షణ తీసుకుని వచ్చాక నేను చేసిన ఎనిమిది సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. వంద రోజులు కూడా ఆడాయి. కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలో అప్పుడు నాకు తెలియలేదు. అందుకే హీరోగా ఎక్కువ సినిమాలు చేయకలేకపోయా’’ అన్నారు ‘సింధూర పువ్వు’ ఫేమ్, నటుడు రాంకీ. కార్తికేయ, పాయల్ రాజపుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ‘ఆర్ఎక్స్ 100’ ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన రాంకీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ► ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో నేను నటించడానికి ముఖ్య కారణం కథే. డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెన్నై వచ్చి నన్ను కలిశారు. కథ విన్నా. బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశా. అందరూ అనుకున్నట్లు ఈ సినిమాలో నేను హీరోకి తండ్రిగా నటించలేదు. ఈ చిత్రంలో నాకు పెళ్లే కాదు. హీరో కోసం, అతని లైఫ్ కోసం నా పాత్ర అంకితం అయిపోతుంది. నిజంగా ఇది గొప్ప పాత్ర. ► నేను ఇండస్ట్రీకొచ్చిన 30 ఏళ్లలో వందకు పైగా చిత్రాల్లో నటించా. కొందరు డైరెక్టర్లు ఒకటి చెప్తారు ఇంకోలా తీస్తారు. కానీ, అజయ్ మాత్రం ఏం చెప్పారో దాని కన్నా బాగా తీశారు. ఒక్క సీన్ కోసం ఐదు కెమెరాలు వాడిన సందర్భాలూ ఉన్నాయి. నటీనటుల నుంచి బాగా నటన రాబట్టుకున్నారాయన. నిజానికి ఈ సినిమా కోసం నేను కూడా ఓ కొత్త నటుడిలా మారిపోయా. ► ఎనిమిదేళ్లుగా తమిళంలో ఏ సినిమా చేయలేదు. నాకు డైరెక్షన్ అంటే బాగా ఆసక్తి. అందుకే డైరెక్షన్, ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. నేను చేసిన కొన్ని సీరియల్స్ బాగా హిట్ అయ్యాయి కూడా. ‘ఆకతాయి’ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చా. ఆ చిత్రం తర్వాత ‘ఆర్ఎక్స్ 100’లో చేశా. ► ప్రస్తుతానికి నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. రజనీకాంత్, కమల్‌హాసన్‌గార్లు ప్రజలకు మంచి చేయాలనే రాజకీయాల్లోకి వస్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం తర్వాత తెలుగులో ఇంకా ఏ సినిమా ఒప్పుకోలేదు. నాకు సరిపోయే ఏ పాత్ర అయినా చేస్తాను. అది విలన్‌గానా, మరొకటా అన్నది ముఖ్యం కాదు. -
‘ఆర్ఎక్స్ 100’ ఫస్ట్‌లుక్
కార్తికేయ, పాయల్ రాజ్పుట్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆర్ఎక్స్ 100 (RX 100). ప్రస్తుతం నిర్మాణాంతరకార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కేసీడబ్ల్యూ బ్యానర్ పై జి. అశోక్ రెడ్డి తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు రావురమేష్, సింధూర పువ్వు రాంఖీ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను భావోద్వేగాలతో కూడిన సహజమైన ప్రేమకథగా తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. కబాలి సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకు ప్రవీణ్ కే ఎల్ ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావటం విశేషం. జూన్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఆసక్తికరంగా ‘ఆర్ఎక్స్ 100’
కార్తికేయ, పాయల్ రాజ్పుట్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ RX 100. ఈ చిత్రం ప్రీ లుక్‌ను హోలీ సందర్భంగా ఈ రోజు విడుదల చేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. KCW బ్యానర్ పై జి. అశోక్ రెడ్డి తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు రావురమేష్, సింధూర పువ్వు రాంఖీ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఎమోషనల్ రియలిస్టిక్ లవ్ స్టొరీగా తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. కబాలీ సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకు ప్రవీన్ కే ఎల్ ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావటం విశేషం. వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
ఆకతాయితో రాంకీ
‘సింధూరపువ్వు’, ‘ఒసేయ్ రాములమ్మ’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాంకీ చాలా ఏళ్లుగా టాలీవుడ్‌కి దూరంగా ఉన్నారు. తాజాగా ‘ఆకతాయి’ చిత్రంతో మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారాయన. ఆశిష్‌రాజ్, రుక్సార్ మీర్ జంటగా రామ్‌భీమన దర్శకత్వంలో విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘లవ్, యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకూ చూడని పోరాట సన్నివేశాలు ఉంటాయి. అమీషా పటేల్ ప్రత్యేక గీతం అదనపు ఆకర్షణ. మణిశర్మగారు స్వరపరచిన పాటలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి’’ అన్నారు. ‘‘త్వరలో పాటలు, జనవరిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాతలు చెప్పారు. సుమన్, నాగబాబు, రాశి, బ్రహ్మానందం, అలీ, ప్రదీప్ రావత్, పోసాని, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ గంగదారి. -
రాంకీ హీరోగా ఆంగ్లపడం
నటుడు రాంకీ చాలా కాలం తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం ఆంగ్లపడం. ఆయనతో పాటు సంజీవ్ మరో కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో నటి మీనాక్షి, శ్రీజ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సింగంపులి, సింగముత్తు, మధుమిత నటించారు. ఆర్జే. మీడియా క్రియేషన్స పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు కుమరేశ్కుమార్ పరిచయం అవుతున్నారు. ఎంసీ.గిరీశ్ సం గీతాన్ని, సాయిసతీష్ ఛాయాగ్రహణాన్ని అం దించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ హా లీవుడ్ చిత్రాల తరహాలో అనూహ్య కథ, కథనాలతో చిత్రం జెట్ స్పీడ్‌లో సాగుతుం దని, అందుకే దీ నికి ఆంగ్లపడం అన్న టైటిల్‌ను నిర్ణయించి నట్లు తెలిపారు.నిజం చెప్పాలంటే ఈ చిత్ర కథను చాలా మంది నటులకు చెప్పానన్నారు. అయితే వారంతా చాలా బాగుందని, నువ్వు చెప్పినట్లు చిత్ర కథను తెరకెక్కించగలవా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారన్నారు. ఆ తరువాత రాంకీ, సంజీవ్ నటించడానికి ముందుకు వచ్చారని చెప్పారు. ఇంతకు ముందెప్పుడూ చూడని రాంకీని ఈ చిత్రంలో చూడనున్నారని తెలిపారు. అదే విధంగా తమిళ తెరకు ఆంగ్లపడం చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు. -
ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఇంధనం
రామ్కీతో చేతులు కలిపిన వెంటానా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెత్త నుంచి ఇంధనాన్ని తయారు చేస్తున్న వెంటానా క్లీన్టెక్.. వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్న రామ్కీ ఎన్విరాన్‌మెంట్‌తో చేతులు కలిపింది. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కలిసి ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి పారిశ్రామిక అవసరాలకు వాడే ఇంధనాన్ని తయారు చేసే ప్లాంట్లను నెలకొల్పుతాయి. తొలి దశలో హైదరాబాద్‌లో రామ్కీ ఎన్విరోకు చెందిన ఇంటెగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రంలో రోజుకు 15 టన్నుల సామర్థ్యం గల ప్లాంటును ఏర్పాటు చేయనున్నాయి. రెండో దశలో ఇతర ప్రాంతాల్లో ఇటువంటి ప్లాంట్లను స్థాపిస్తామని వెంటానా సీఈవో అమిత్ టాండన్ తెలిపారు. హైదరాబాద్‌లో రామ్కీ రోజుకు 400లకుపైగా టన్నుల తక్కువ నాణ్యతగల ప్లాస్టిక్ చెత్త సేకరిస్తోంది. ఇరు సంస్థలకు మేలు చేకూర్చే ఒప్పందమిదని రామ్కీ ఎన్విరాన్మెంట్ ఎండీ గౌతమ్‌రెడ్డి అన్నారు.