రాంకీ హీరోగా ఆంగ్లపడం | Ramki as hero anglapadam | Sakshi
Sakshi News home page

రాంకీ హీరోగా ఆంగ్లపడం

Published Mon, Nov 14 2016 3:01 AM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

రాంకీ హీరోగా ఆంగ్లపడం

రాంకీ హీరోగా ఆంగ్లపడం

నటుడు రాంకీ చాలా కాలం తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం ఆంగ్లపడం. ఆయనతో పాటు సంజీవ్ మరో కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో నటి మీనాక్షి, శ్రీజ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సింగంపులి, సింగముత్తు, మధుమిత నటించారు. ఆర్‌జే. మీడియా క్రియేషన్‌‌స పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు కుమరేశ్‌కుమార్ పరిచయం అవుతున్నారు. ఎంసీ.గిరీశ్ సం గీతాన్ని, సాయిసతీష్ ఛాయాగ్రహణాన్ని అం దించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదలకు ముస్తాబవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ హా లీవుడ్ చిత్రాల తరహాలో అనూహ్య కథ, కథనాలతో చిత్రం జెట్ స్పీడ్‌లో సాగుతుం దని, అందుకే దీ నికి ఆంగ్లపడం అన్న టైటిల్‌ను నిర్ణయించి నట్లు తెలిపారు.నిజం చెప్పాలంటే ఈ చిత్ర కథను  చాలా మంది నటులకు చెప్పానన్నారు. అయితే వారంతా చాలా బాగుందని, నువ్వు చెప్పినట్లు చిత్ర కథను తెరకెక్కించగలవా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారన్నారు. ఆ తరువాత రాంకీ, సంజీవ్ నటించడానికి ముందుకు వచ్చారని చెప్పారు. ఇంతకు ముందెప్పుడూ చూడని రాంకీని ఈ చిత్రంలో చూడనున్నారని తెలిపారు. అదే విధంగా తమిళ తెరకు ఆంగ్లపడం చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement