ఆకతాయితో రాంకీ | Re-entry into Telugu Chitra industry | Sakshi
Sakshi News home page

ఆకతాయితో రాంకీ

Dec 25 2016 11:26 PM | Updated on Aug 28 2018 4:32 PM

ఆకతాయితో రాంకీ - Sakshi

ఆకతాయితో రాంకీ

‘సింధూరపువ్వు’, ‘ఒసేయ్‌ రాములమ్మ’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాంకీ చాలా ఏళ్లుగా టాలీవుడ్‌కి ....

‘సింధూరపువ్వు’, ‘ఒసేయ్‌ రాములమ్మ’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాంకీ చాలా ఏళ్లుగా టాలీవుడ్‌కి దూరంగా ఉన్నారు. తాజాగా ‘ఆకతాయి’ చిత్రంతో మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారాయన. ఆశిష్‌రాజ్, రుక్సార్‌ మీర్‌ జంటగా రామ్‌భీమన దర్శకత్వంలో విజయ్‌ కరణ్, కౌశల్‌ కరణ్, అనిల్‌ కరణ్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘లవ్, యాక్షన్, థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది.

ఇండియన్‌ స్క్రీన్‌పై ఇప్పటి వరకూ చూడని పోరాట సన్నివేశాలు ఉంటాయి. అమీషా పటేల్‌ ప్రత్యేక గీతం అదనపు ఆకర్షణ. మణిశర్మగారు స్వరపరచిన పాటలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి’’ అన్నారు. ‘‘త్వరలో పాటలు, జనవరిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాతలు చెప్పారు. సుమన్, నాగబాబు, రాశి, బ్రహ్మానందం, అలీ, ప్రదీప్‌ రావత్, పోసాని, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ గంగదారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement