ఆసక్తికరంగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ | RX 100 Movie Pre Look | Sakshi
Sakshi News home page

Mar 1 2018 11:50 AM | Updated on Mar 1 2018 11:50 AM

RX 100 Movie Pre Look - Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ మూవీ ప్రీ లుక్‌ పోస్టర్‌

కార్తికేయ, పాయల్ రాజ్‌పుట్‌  హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ RX 100. ఈ చిత్రం ప్రీ లుక్‌ను హోలీ సందర్భంగా ఈ రోజు విడుదల చేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో రామ్‌ గోపాల్‌ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. KCW  బ్యానర్ పై  జి. అశోక్ రెడ్డి తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

సీనియర్‌ నటులు రావురమేష్, సింధూర పువ్వు రాంఖీ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఎమోషనల్ రియలిస్టిక్ లవ్ స్టొరీగా తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. కబాలీ సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకు ప్రవీన్‌ కే ఎల్‌ ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావటం విశేషం. వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement