
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప జయకుమార్ ఇంట్లో శనివారం ఉదయం ఆదాయపన్ను అధికారుల సోదాల కలకలం చెలరేగింది. పార్టీ పదవులను అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడలు జరిగినట్లు అందరూ భావించారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ సంచలనం కలిగించింది. దాడి చేసింది అసలు ఐటీ అధికారులు కాదు. గ్యాంగ్ సినిమా తరహాలో నకిలీ ఇన్‌కం టాక్స్ అధికారులు ఈ దాడులకు యత్నించారు.
ఐటీ దాడులకు వచ్చిన అధికారుల తీరుపై అనుమానం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీప నివాసానికి చేరుకొనేలోపే నకిలీ ఐటీ గ్యాంగ్ మెల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. సినిమాలో మాదిరి పెద్ద ఎత్తున డబ్బు, వస్తువులను దోపిడీ చేయవచ్చనే ఉద్దేశంతోనే నకిలీ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment