కొవ్వొత్తులు చేతబట్టి మౌనం పాటించిన విద్యార్థులు
తిరువళ్లూరు: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభు త్వ పాఠశాలలో విద్యార్థులు, ర్యాలీలు, సంతాప సభ లు నిర్వహించారు. తమిళనాడు దివంగత ముఖ్యమం త్రి జయలలిత సోమవారం రాత్రి అపోలోలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయలలిత మృతికి సంతాపంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆమె చిత్రపటాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. తిరువళ్లూరులోని బాలికల పా ఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్డీవో జయచంద్రన్ హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు అన్ని విధాల అండగా ఉండాలన్న ఉద్దేశంతో పలు సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. ఉచిత ల్యాప్‌టాప్, సైకిల్, మధ్యాహ్న భోజ నం, యూనిఫాం, పుస్తకాలు, ఉచిత బస్‌పాస్‌ను అం దించిన ఘనత ఆమెదే నన్నారు. ఆమెను అన్ని వర్గాల ప్రజలు గుర్తు చేసుకుంటారని సంతాప సభలో పాలొ ్గన్న పలువురు వక్తలు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు కొవ్వొత్తులను చేత పట్టి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సీఈవో రాజేంద్రన్ పాల్గొన్నారు.