ఆంధ్రా బ్యాంక్ వీసా సిగ్నేచర్ క్రెడిట్ కార్డు | andhra bank introduce visa signature card | Sakshi
Sakshi News home page

ఆంధ్రా బ్యాంక్ వీసా సిగ్నేచర్ క్రెడిట్ కార్డు

Published Wed, Dec 31 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

ఆంధ్రా బ్యాంక్ వీసా సిగ్నేచర్ క్రెడిట్ కార్డు

ఆంధ్రా బ్యాంక్ వీసా సిగ్నేచర్ క్రెడిట్ కార్డు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఆంధ్రా బ్యాంక్ బహుళ ప్రయోజనాలతో కూడిన వీసా సిగ్నేచర్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. రోజుకు రూ. 4,000 విలువైన ఇంధన కొనుగోలుపై ఎటువంటి సర్‌చార్జీలు లేకపోవడం, క్రెడిట్ కార్డు దొంగలించబడితే రూ. 1.50 లక్షల బీమా రక్షణ వంటి సౌకర్యాలను ఈ కార్డు అందిస్తోంది.

ఈ కార్డు కనీస క్రెడిట్ లిమిట్‌ను రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. మంగళవారం జరిగిన మేనేజర్ల మీటింగ్ సందర్భంగా వీసా సిగ్నేచర్ కార్డును ఆంధ్రా బ్యాంక్ సీఎండీ సి.వి.ఆర్.రాజేంద్రన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్డు ద్వారా నగదును అడ్వాన్స్‌గా తీసుకుంటే 2 శాతం చార్జీలు, అదే రోలోవర్ ఫెసిలిటీ వినియోగించుకుంటే 1.50 శాతం సర్వీస్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement