tourists dead
-
గ్లేసియర్ టూరిజం... ప్రాణాంతకం!
తెల్లని రంగులో మెరిసిపోతూ చూడగానే మనసుకు హాయిగొలిపే హిమానీ నదాలు (గ్లేసియర్స్) మనసును ఇట్టే ఆకర్షిస్తాయి. వాటికి సమీపంలోకి వెళ్లాలని, మంచును బంతులుగా చేసి ఆడుకోవాలని, మంచు ముద్దలతో గుహలాగా చేసుకొని అందులో సేదదీరాలని పర్యాటకులు ఆరాటపడుతుంటారు. అందుకే గ్లేసియర్ టూరిజానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. గ్లేసియర్స్ ఉన్న దేశాలకు ఈ పర్యాటకంతో భారీ ఆదాయం లభిస్తోంది. హిమానీనదాలను ప్రత్యక్షంగా చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. అయితే ఆనందం మాటున విషాదం అన్నట్లుగా గ్లేసియర్ టూరిజం ప్రాణాంతకంగా మారుతోంది. గ్లోబల్ వారి్మంగ్ దెబ్బకు కొన్నేళ్లుగా గ్లేసియర్స్ శరవేగంగా కరిగిపోతుండటం పర్యాటకుల పాలిట శాపమవుతోంది. హిమానీ నదాలను సందర్శించే క్రమంలో కొన్నేళ్లలో పదుల సంఖ్యలో మృతి చెందారు. మంచులో చిక్కి విగత జీవులయ్యారు. వాతావరణాన్ని ముందుగానే అంచనా వేయడానికి ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి ఉన్నా గ్లేసియర్లలో పరిస్థితులు అనూహ్యం. అవి ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేమని గ్లేసియర్ గైడ్లు అంటున్నారు. ‘‘అప్పటిదాకా రాయిలా స్థిరంగా కనిపించే మంచు క్షణాల్లో కరిగిపోతుంది. ఆ సమయంలో అక్కడు వాళ్లంతా మంచులో కూరుకుపోయి మరణించాల్సిందే’’ అని చెబుతున్నారు...! వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ధ్రువాల్లో మంచు కరిగిపోతోంది. భూమిపై ఉన్న మొత్తం గ్లేసియర్లలో 2100 నాటికి సగం అంతరించిపోతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే అవి చాలావరకు కరిగిపోయాయి కూడా. అందుకే సాహసికులు త్వరపడుతున్నారు. గ్లేసియర్లను సందర్శించడం చాలామందికి ఒక కల. దాన్ని నిజం చేసుకోవడానికి ధ్రువపు ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. గ్లేసియర్ పర్యాటకాన్ని ‘లాస్ట్–చాన్స్ టూరిజం’గా భావిస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా అసోసియేట్ ప్రొఫెసర్ జాకీ డాసన్ చెప్పారు. కరిగే మంచు.. పెను ముప్పు సాధారణంగా ఎండాకాలంలోనే గ్లేసియర్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు నిపుణులు గుర్తించారు. గ్లేసియర్ల ఉపరితలంపై మంచు కరుగుతుండడంతో వాటిపై ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ముక్కలుగా విచి్ఛన్నమవుతున్నాయి. స్థిరంగా ఉన్న గ్లేసియర్ కంటే కరుగుతున్నవి మరింత ప్రమాదకరం. వాటికి దూరంగా ఉండాలని అసోసియేషన్ ఆఫ్ ఐస్లాండ్ మౌంటెయిన్ గైడ్స్ ప్రతినిధి గరార్ సిగుర్‌జాన్సన్ చెప్పారు. కొన్నేళ్ల క్రితం వరకు గ్లేసియర్లపై సమ్మర్ స్కీయింగ్‌కు జనం అమితాసక్తి చూపేవారు. ప్రమాదాల నేపథ్యంలో వేసవి కాలంలో స్కీయింగ్ను చాలా దేశాలు రద్దు చేశాయి. ప్రమాదాలు, మరణాల పెరుగుతున్నా పర్యాటకుల సంఖ్య తగ్గడం లేదు! ఎన్నెన్ని విషాదాలో...! → 2019లో అలాస్కాలోని వాల్డెజ్ గ్లేసియర్‌లో చిక్కుకొని ముగ్గురు పర్యాటకులు మరణించారు. వీరిలో ఇద్దరు జర్మన్లు, ఒకరు ఆ్రస్టేలియన్. → 2018లో అలాస్కా గ్లేసియర్లలో రెండు ప్రమాదాల్లో 32 ఏళ్ల మహిళ, ఐదేళ్ల బాలుడు చనిపోయారు. → 2022 జూలైలో ఉత్తర ఇటలీలో మార్మోలడా గ్లేసియర్ నుంచి 64 వేల మెట్రిక్ టన్నుల మంచు, నీరు, రాళ్లు విరిగిపడ్డాయి. మంచు మొత్తం నదిలా పారుతూ దిగువన పర్యాటకులను ముంచెత్తింది. దాంతో 11 మంది మరణించారు. → 2023లో ఐస్లాండ్లోని ఓ గ్లేసియర్‌లో మంచు గుహ హఠాత్తుగా కుప్పకూలడంతో అమెరికన్ టూరిస్టు మృతి చెందాడు. ఇది ఐస్లాండ్లో సంచలనం సృష్టించింది. గ్లేసియర్ టూరిజం సంస్థలు వేసవిలో ఐస్ కేవ్ టూర్లను నిలిపేశాయి. పర్యాటకుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు..
గోపేశ్వర్: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. గౌచర్– కర్ణప్రయాగ్ మార్గంలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై చట్వాపీపల్ వద్ద శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని మోటారు సైకిల్‌పై వస్తున్న నిర్మల్ షాహి(36), సత్యనారాయణ(50)లపై పర్వత ప్రాంతం నుంచి బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి పడటంతో చనిపోయా రన్నారు. ఇద్దరి మృతదేహాలను బయటకు తీశామని చెప్పారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బద్రీనాథ్ హైవేపై సుమారు డజను చోట్ల రహదారి మూసుకుపోయిందని పోలీసులు వివరించారు. కొండచరియలు విరిగి పడటంతో రుద్రప్రయాగ్– కేదార్నాథ్ జాతీయ రహదారిలో కూడా రాకపోకలు నిలిచిపోయాయన్నారు. రాష్ట్రంలోని కుమావ్, గఢ్వాల్ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ విభాగం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. -
దాల్ సరస్సులో ఘోర అగ్ని ప్రమాదం
శ్రీనగర్: శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు హౌస్బోట్లలో శనివారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో విదేశీ ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మాడి మసైన హౌస్‌బోట్ శిథిలాల నుంచి గుర్తుపట్టలేని విధంగా కాలిన మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. మృతులు బంగ్లాదేశ్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. వీరిని అనిందయ కౌశల్, మహ్మద్ మొయినుద్, దాస్ గుప్తా అని తెలిసిందన్నారు. వీరున్న సఫీనా అనే హౌస్‌బోట్ పూర్తిగా దగ్ధమైందన్నారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను వారి కుటుంబీకులకు అందజేస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం అయిదు హౌస్బోట్లు, వాటికి పక్కనే ఉన్న ఏడు నివాస కుటీరాలు, కొన్ని ఇళ్లు కూడా పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఘటనలో కోట్లలో ఆస్తినష్టం సంభవించింది. తొమ్మిదో నంబర్ ఘాట్‌లో అగ్ని ప్రమాదంపై ఉదయం 5.15 గంటల సమయంలో ఫోన్లో సమాచారం అందగానే రంగంలోకి దిగి, ఎనిమిది మంది పర్యాటకులను రక్షించగలిగామని స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఫైర్ సర్వీస్) ఫరూక్ అహ్మద్ తెలిపారు. ఒక హౌస్‌బోట్‌లో చెలరేగిన మంటలు వేగంగా మిగతా బోట్లకు వ్యాపించాయన్నారు. అతికష్టమ్మీద మంటలను అదుపులోకి తేగలిగామని వివరించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. ఒక బోటులోని హీటింగ్ పరికరాల్లో లోపం కారణంగానే మంటలు అంటుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 2022లోనూ డాల్, నగీన్ సరస్సుల్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడు హౌస్బోట్లు బూడిదగా మారాయి. అప్పటి ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
ఇటలీలో బ్రిడ్జిపై నుంచి పడిన బస్సు..
వెనీస్: ఇటలీలోని వెనీస్ నగర సమీపంలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న బస్సు అదుపు తప్పి, 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. అనంతరం బస్సులో మంటలు చెలరేగడంతో 21 మంది ప్రయాణికులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది విదేశీ పర్యాటకులే. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పేశారు. సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సు ప్రమాదంలో 21 మంది మృతిచెందడం పట్ల వెనీస్ సిటీ మేయర్ బ్రుగ్నారో సంతాపం ప్రకటించారు. -
బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి
రియో డి జెనారో: అమెజాన్ అడవుల్లో బార్సెలోస్ ప్రాంతానికి వెళ్తోన్న టూరిస్టు విమానం కుప్పకూలడంతో సిబ్బందితో కలిపి మొత్తం 14 మంది మృతి చెందారు. బ్రెజిల్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన అమెజాన్ అడవుల్లోని బార్సెలోస్ను సందర్శించేందుకు 14 మందితో కూడిన టూరిస్టు విమానం వాతావారణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అడవుల్లో కుప్పకూలింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మంది పర్యాటకులతోపాటు ఇద్డరు సిబ్బంది కూడా మృతిచెందారు. భారీ వర్షంలో ప్రయాణిస్తున్న ఈ విమానం పైలట్ ఎదురుగా ఏమీ కలిపించకపోయిన అలాగే నడుపుకుంటూ వెళ్లారు. ఇదే క్రమంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించగా పరిస్థితులు అనుకూలించక విమానం అడవుల్లో కుప్పకూలిందని ఆమెజోనా స్టేట్ సెక్యూరిటీ సెక్రెటరీ వినిషియస్ అల్మెయిదా తెలిపారు. ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని మృతుల్లో స్పోర్ట్ ఫిషింగ్ నిమిత్తం బయలుదేరిన 12 మంది మగవారితో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారని ఒక స్టేట్మెంట్లో తెలిపింది అక్కడి ప్రభుత్వం. మృతుల కుటుంబానికి స్నేహితులకు ప్రగాఢ సానుభూతులు తెలిపిన గవర్నర్ విల్సన్ లిమా ప్రమాదం గురించి తెలిసిన మరుక్షణం నుండి విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. మీడియా కథనాల ప్రకారం ప్రమాదానికి గురైన విమానం బ్రెజిలియన్ ఎయిర్‌క్రాఫ్ట్ మేకర్ ఎంబ్రేయర్ తయారు చేసిన ట్విన్-ఇంజన్ టర్బోప్రాప్ ఈఎంబీ-10 12 మంది టూరిస్టులతో మనౌస్ నుంచి బార్సెలోస్‌కు బయలుదేరింది.. మనౌస్ నుంచి బార్సెలోస్‌కు గంటన్నర ప్రయాణ సమయం పడుతుందని వాతావరణంసరిగ్గా లేనందునే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. #Breaking A small plane crashed in Amazonas, Brazil, leaving at least 14 people dead, including the pilot and co-pilot. Among the victims were several American tourists. pic.twitter.com/RZ0GrYbfe6 — Bowner (@agentbowner) September 16, 2023 ఇది కూడా చదవండి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ఆగుతుందటే.. -
కశ్మీర్లో హిమపాతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో బుధవారం మంచు చరియల కింద చిక్కుకుని ఇద్దరు విదేశీ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మంచు కింద చిక్కుకుపోయిన మరో 21 మందిని పోలీసులు కాపాడారు. 21 మంది పోలండ్, రష్యా దేశస్తులు, ఇద్దరు స్థానిక గైడ్లు మూడు బృందాలుగా ఏర్పడి ప్రఖ్యాత స్కై రిసార్ట్ హపట్‌ఖుడ్ కాంగ్డోరి వద్ద ఉండగా భారీ 20 అడుగుల పొడవైన మంచు పెళ్ల వారికిపైకి దొర్లుకుంటూ వచ్చి పడింది. ఈ ఘటనలో మంచు కింద చిక్కుబడిన ఇద్దరు పోలండ్ జాతీయులు చనిపోగా, మిగతా వారినందరినీ కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో నిషేధ హెచ్చరికలు ఏర్పాటు చేశామన్నారు. -
విహారయాత్రలో విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
రాయ్‌పుర్: వారాంతంలో సరదగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో పడిపోయి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లాలో జరిగినట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన 15 మంది కుటుంబ సభ్యులు కొటడాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామ్‌దాహా వాటర్‌ఫాల్స్ వద్దకు ఆదివారం పిక్నిక్కు వచ్చినట్లు చెప్పారు. జలపాతం కింద స్నానం చేస్తుండగా అక్కడి నీటిలో ఏడుగురు తప్పిపోయినట్లు ఆదివారం సమాచారం అందిందని అధికారులు తెలిపారు. అందులో ఇద్దరిని రక్షించించి ఆసుపత్రికి తరలించారు. అయితే, అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆ తర్వాత మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. సోమవారం ఉదయం మిగిలిన ముగ్గురు టూరిస్టుల మృతదేహాలను వెలికితీశారు. సోమవారం వెలికి తీసిన మృతులు.. శ్వేత సింగ్(22), శ్రద్ధా సింగ్(14), అభయ్ సింగ్(22)లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. నీటిలోకి దిగి స్నానం చేయకూడదనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ.. టూరిస్టులు స్నానం చేసేందుకు వెళ్లటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: గుంతలో పడి అదుపుతప్పిన బైక్.. లారీ తొక్కటంతో యువకుడు మృతి! -
అమాంతం కిందపడిపోయిన కేబుల్ కారు, 13 మంది మృతి
రోమ్: ఉత్తర ఇటలీ ఆదివారం ఓ కేబుల్ కారు తెగిపడి... 13 మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరు చిన్నారులు గాయపడగా... వీరి పరిస్థితి విషమంగా ఉంది. మాగియోర్ సరస్సు అందాలను ఎత్తైన ప్రదేశం నుంచి చూసేందుకు వీలుగా పక్కనే ఉన్న మొటారోన్ పర్వతం పైకి కేబుల్ కారు మార్గాన్ని ఏర్పాటు చేశారు. మరో 100 మీటర్లు వెళితే పర్వత శిఖరంపై దిగుతారనగా... ఒక్కసారిగా కేబుల్ తెగిపోయింది. 15 మంది ప్రయాణికులు కూర్చున్న కేబుల్ కారు అమాంతం కిందపడిపోయి పల్టీలు కొడుతూ చెట్లను ఢీకొని ఆగిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు దూరంగా విసిరేసినట్లుగా పడిపోయారు. 2016లోనే ఈ కేబుల్ లైన్‌ను పునర్నిర్మించారని స్టెసా మేయర్ మార్సెల్లా సెవెరినో తెలిపారు. కరోనా కారణంగా మూతబడిన ఈ పర్యాటక ప్రదేశాన్ని ఇటీవలే తెరిచారని వెల్లడించారు. 1998 తర్వాత జరిగిన అతి పెద్ద ప్రమాదం ఇదేనని మీడియా తెలిపింది. -
థాయ్‌లో బోటు బోల్తా 37 మంది మృతి
ఫుకెట్: పర్యాటకులకు స్వర్గధామమైన థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుకెట్ దీవికి సమీపంలో 105 మందితో గురువారం సముద్రంలోకి వెళ్లిన బోటు బోల్తా కొట్టడంతో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు 50 మంది పర్యాటకుల్ని అధికారులు రక్షించగలిగారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి 16 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడటంతో ఫీనిక్స్ అనే బోటు గురువారం పల్టీ కొట్టిందని ఫుకెట్ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. అలలు ఎగిసిపడే అవకాశముందని హెచ్చరించినప్పటికీ బోటు యజమాని, కెప్టెన్ తమ సూచనల్ని పెడచెవిన పెట్టారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారంతా చైనీయులే. -
పడవ మునక.. పర్యాటకుల మృతి!
చెన్నై: పడవ మునిగిపోయిన ప్రమాదంలో 9 మంది పర్యాటకులు మృతిచెందగా, మరో 11 మందిని రెస్క్యూ బృందం రక్షించింది. ఈ ఘటన తమిళనాడులోని ట్యూటికోరిన్ సమీపంలో మనప్పాడ్ లో చోటుచేసుకుంది. బోటులో దాదాపు 20 మంది పర్యాటకులు ఆదివారం షికారుకు వెళ్లగా అలల తాకిడి ఎక్కువై సముంద్రంలో పడవ మునిగిపోయింది. దీంతో పడవలోని అందరూ గల్లంతయ్యారని అధికారులు భావించగా, ఆపై 11 మందిని రక్షించినట్లు తెలిపారు. మృతదేహాలు వెలికి తీసేందుకు ఇంకా చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.