Northern
-
వసంతపు వెలుగులు
సరిగ్గా సగ భాగం చీకట్లో, మరో సగం ఉదయపు కాంతుల్లో నిండుగా వెలిగిపోతూ కనిపిస్తున్న భూమిని చూస్తున్నారుగా! వసంత విషువత్తు (స్ప్రింగ్ ఈక్వినాక్స్) సందర్భంగా బుధవారం అంతరిక్షం నుంచి భూ గ్రహం ఇలా కని్పంచింది. అచ్చెరువొందించే ఈ ఫొటోను యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ ద ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ మెటరోలాజికల్ శాటిలైట్స్ (ఈయూఎంఈటీఎస్ఏటీ) విడుదల చేసింది. సంవత్సరంలో రెండు రోజులు భూమిపై రాత్రింబవళ్ల నిడివి సమానంగా ఉంటుంది. ఆ రోజుల్లో సూర్యుడు భూమధ్యరేఖపై నేరుగా ఉండటమే ఇందుకు కారణం. వీటినే విషువత్తులుగా పిలుస్తారు. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే క్రమంలో ఇవి ఏర్పడతాయి. మొదటిదైన వసంత విషువత్తు ఏటా మార్చి 20కి అటూ ఇటుగా వస్తుంది. ఆ రోజుతో ఉత్తరార్ధ గోళం అధికారికంగా శీతాకాలం నుంచి వసంత కాలంలోకి ప్రవేశిస్తుంది. అక్కడినుంచి ఆ ప్రాంతంలో పగటికాలం, ఉష్ణోగ్రతలు పెరుగుతూ రాత్రుళ్ల నిడివి తగ్గుతూ వస్తాయి. రెండోదైన శరది్వషువత్తు (ఆటమల్ ఈక్వినాక్స్) సెపె్టంబర్ 22కు ఇటూ ఇటుగా వస్తుంది. విషువత్తులకు జ్యోతిశ్శాస్త్రంలో చాలా ప్రాధాన్యముంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కన్నడ కాంతార కాదు.. కేరళ కలియట్టం
-
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం భూసేకరణ సర్వే పూర్తి.. అక్కడ మాత్రం!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ సర్వే ప్రక్రియ పూర్తయింది. భూములిచ్చేది లేదంటూ రైతులు భీష్మించటంతో సంగారెడ్డి, రాయగిరి ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల అధికారులు సర్వే పూర్తి చేశారు. రోడ్డు నిర్మాణం జరిగే 100 మీటర్ల వెడల్పుతో అలైన్మెంట్ ప్రకారం హద్దులు నిర్ధారించారు. అలైన్మెంట్ ప్రకారం జెండాలు కట్టిన కర్రలు పాతారు. సర్వే నంబర్ల వారీగా రైతుల సమక్షంలో వారి వివరాలను రికార్డు చేశారు. ఆ రెండు చోట్ల తీవ్ర నిరసనలు.. రీజనల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియకు కోసం ఎనిమిది ‘కాలా’ (కాంపిటెంట్ అథారి టీస్ ఫర్ లాండ్ అక్విజిషన్) లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అధికారులు అన్ని విభాగాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. అయితే భువనగిరి కాలాకు సంబంధించి సర్వే అసలు జరగలేదు. ఇక్కడ రైతులు భూసేకరణ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో పలు ప్రాజెక్టులకు భూమి ఇచ్చినందున మరోసారి భూమిని కోల్పేయే ప్రసక్తే లేదంటూ ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూసేకరణ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. అలాగే సంగారెడ్డి పట్టణం సమీపంలోని గ్రామాల రైతులు కూడా అధికారులను సర్వే చేయనివ్వలేదు. సంగారెడ్డిని దాదాపు ఆనుకుని ఉన్నందున తమ భూములకు ఎక్కువ ధర ఉందని, అయితే పరిహారం చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున భూములు ఇవ్వబోమంటూ సర్వేను అడ్డుకున్నారు. భువనగిరి కాలా పరిధిలో 22 కి.మీ. నిడివి గల రోడ్డుకు సంబంధించి సర్వే జరగలేదు. సంగారెడ్డి కాలా పరిధిలో 8 కి.మీ. నిడివి గల రోడ్డుకు సంబంధించి సర్వే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి రైతులతో చర్చించి, సర్వే జరపాలని అధికారులు భావిస్తున్నారు. కుదరని పక్షంలో పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారుల నుంచి స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. -
ఈ ఏడాదిలో ఈరోజు చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా?
ఈ ఏడాదిలోనే ఈరోజుకి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే, డిసెంబర్ 21ని అత్యంత చిన్నరోజుగా నాసా అధికారులు గుర్తించారు. నేడు సూర్యుడి నుంచి ఉత్తరార్ధగోళం తన కక్ష్యలో దూరంగా వంగి ఉన్నందున ఈ సంవత్సరంలో ఇదే తక్కువ పగలు రోజుగా నిలుస్తుందని వారు తెలిపారు. సూర్యుని నుంచి దూరంగా వంగి ఉండటం వల్ల ఉత్తరార్ధగోళం మీద తక్కువ సూర్యకాంతి పడుతుంది. దీంతో ఈ రోజు చాలా తొందరగా గడిచినట్లు ఉత్తరార్ధగోళంలో నివసించే వారికి అనిపిస్తుంది. ఈరోజు పగటి పుట సమయం చాలా తక్కువగా ఉండటం, రాత్రి ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఇలా సంవత్సరంలో రెండుసార్లు సంభవిస్తుంది. ఉత్తరార్ధగోళంలో డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 22 మధ్య కాలంలో, దక్షిణార్థ గోళంలో జూన్ 20 నుంచి 21 మధ్య కాలంలో ఇలా సంభవిస్తుంది. పురాతన కాలంలో ఈ రోజున రోమన్లు శనిదేవుడిని తిరిగివచ్చినట్లుగా భావించేవారు. మన దేశంలో అత్యల్ప తక్కువ రోజుగా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఇదే పండుగను చైనీయులు, జపనీయులు కూడా జరుపుకుంటారు. (చదవండి: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఆదాయం ఎంతనో తెలుసా..!) -
దక్షిణాదికి, ఉత్తరాదికి ఎంత వ్యత్యాసం!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య భాష, సంస్కృతుల పరంగానే కాకుండా సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ఎంతో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెల్సిందే. అయితే ఇది మహిళల విషయంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాదితో పోలీస్తే దక్షిణాది మహిళలు ఎక్కువ స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఎక్కువ విద్యావంతులు, చిన్నతనంలో కాకుండా యుక్త వయస్సు వచ్చాకే పెళ్లిళ్లు చేసుకుంటారు. తమ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకోవడంతో కొంత స్వేచ్ఛ ఉంది. భర్తలతో ఎక్కువ చనువుగా ఉంటారు. తక్కువ సంతానం కలిగి ఉంటారు. సొంతంగా ఆస్తులు కలిగి ఉంటారు. తల్లిదండ్రులు ఇచ్చే కట్నాలకు తామే హక్కుదారులుగా ఉంటారు. స్నేహితులతో కలసిమెలసి తిరుగుతారు. ఆఫీసుల్లో మగవాళ్లతో కలసి పనిచేస్తారు. ఉత్తర, వాయువ్య భారత్‌లో మహిళలు ఎక్కువగా పురుషుల ఆధిపత్యం కింద ఒదిగి జీవిస్తారు. వారిలో విద్యార్హతలు తక్కువే. సెకండరీ స్కూల్ పూర్తి చేసిన మహిళలు కూడా జీవిత భాగస్వామిని సొంతంగా ఎంపిక చేసుకోరు. కుటుంబ సభ్యులపైనే ఆధార పడతారు. మహిళలు ఉద్యోగాలు చేయడం తక్కువే. అక్షరాస్యత, స్వయం ప్రతిపత్తి, ఉద్యోగం చేయడంలోను తక్కువే. వీరితో పోలిస్తే దక్షిణాది మహిళలు కులం, మతం విషయంలోనూ స్వేచ్ఛా జీవులే. ఉత్తర భారత్‌తో పోలిస్తే, దక్షిణ భారత్‌కు చెందిన ఆడి పిల్లల్లో శిశు మరణాలు తక్కువ. 1800 శతాబ్దంలో మద్రాస్, ముంబై ప్రాంతాల్లో సతీసహగమనం చాలా తక్కువకాగా, బెంగాల్లో 90 శాతం సతీసహగమనం సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1876–78లో మద్రాస్‌ను కరవు పరిస్థితులు కబళించినప్పుడు లింగ నిష్పత్తిలో పెద్దగా వ్యత్యాసం రాలేదు. 1896–97లో పంజాబ్‌లో కరవు పరిస్థితులు తాండవించినప్పుడు అధిక సంఖ్యలో బాలికలు మరణించారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 1880లోనే 15, 16 ఏళ్లు వచ్చాకే ఆడ పిల్లలు పెళ్లి చేసుకోగా, రాజస్థాన్ బాలికలు ఆ స్థాయికి చేరుకోవడానికి వందేళ్లు పట్టింది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో చదువుకునే మహిళల సంఖ్య చాలా తక్కువ. ఉత్తరాదిలో స్త్రీ, పురుషుల మధ్య విద్యాభ్యాసంలో వ్యత్యాసం 26 శాతం ఉండగా, అదే దక్షిణాదిలో ఈ వ్యత్యాసం 9 శాతం మాత్రమే. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో దక్షిణాది మహిళలు చురుగ్గా పాల్గొనడం, గాంధీ, నెహ్రూ, సరోజని నాయుడు లాంటి వారు సంఘ సంస్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం, దక్షిణాది మహిళలను వారు ఎక్కువ ప్రభావితం చేయడం, కందుకూరి వీరేశలింగం లాంటి సంఘ సంస్కర్తలు దక్షిణాదికి చెందిన వారవడం, దక్షిణాదిలో మహిళల విద్యను ప్రోత్సహించడం, మహిళా సంఘాలు పుట్టుకురావడం, వ్యవసాయ పనుల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల నేడు ఉత్తరాదికన్నా దక్షిణాది మహిళలు ముందున్నారు. 1900 దశాబ్దంలోనే మద్రాస్‌లో ‘విమెన్స్ ఇండియన్ అసోసియేషన్’ ఏర్పడడం, ఆ తర్వాత 1917లో పుణె కేంద్రంగా ‘ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్’ ఏర్పాటవడం ఇందుకు ఉదాహరణ. (లండన్ కింగ్స్ కాలేజీలో అధ్యాపకురాలిగా పనిచేస్తోన్న ఎలైస్ ఎవాన్స్ తన వెబ్సైట్లో రాసిన పరిశోధనా వ్యాసం నుంచి) చదవండి: యూపీలోనే ఎక్కువ.. ఎందుకిలా? -
భారీ వర్షాలు.. హై అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారు. మరో రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాగల 36 గంటల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో కేదార్నాథ్, యమునోత్రి యాత్రికులకు ముందుస్తు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్ష సూచన ఉండటంతో వరదలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలను రంగంలోకి దింపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాదిన కురుస్తున భారీ వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పది మందికి పైగా మృతి చెందారు. కొండచరియలు విరిగిపడడంతో కొండ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారు. హిమచల్ ప్రదేశ్‌లోని బీయాస్ నది తీవ్ర ఉదృతంగా ప్రవహిస్తుడడంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే హై అలర్టు ప్రకటించారు. -
నైరుతి.. మరో నాలుగు రోజులు..!
సాక్షి, హైదరాబాద్: నేడో రేపో తెలంగాణలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు మళ్లీ ఆలస్యం కానున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా, బెంగాల్ వైపు తరలిపోవడంతో రుతుపవనాలు మందగించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. దీంతో ఈనెల 10–12 తేదీల మధ్యలో రాష్ట్రంలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు 14వ తేదీ నాటికి వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలోనూ అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. వాస్తవంగా నైరుతి రుతుపవనాలు గత నెల 30వ తేదీన కేరళలోకి ప్రవేశించాయి. సాధారణం కంటే రెండు రోజుల ముందే అక్కడ ప్రవేశించడంతో తెలంగాణకు ఈనెల ఐదు–ఆరు తేదీల్లోనే ప్రవేశిస్తాయని అంచనా వేశారు. అయితే అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రుతుపవనాలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ఆ అడ్డంకి తొలిగింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా వచ్చింది. కానీ అది కాస్తా ఒడిశా–బెంగాల్ వైపు తరలిపోవడంతో ఇప్పుడు రుతుపవనాలు మందగించాయి. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే కోస్తాకు సమీపంలో అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనమైనా రావాలి లేకుంటే బంగాళాఖాతంలోనైనా రావాలి. దీనిపై అతి క్షుణ్నంగా పరిశీలన చేస్తున్నట్లు వై.కె.రెడ్డి తెలిపారు. అల్పపీడనం ఒడిశా–బెంగాల్‌వైపు పోవడంతో రాష్ట్రంలో భారీ వర్షాలకు బ్రేక్ పడినట్లు పేర్కొన్నారు. నేటి నుంచి వచ్చే నాలుగు రోజులు కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన వివరించారు. మరోవైపు గత 24 గంటల్లో లక్సెట్టిపేటలో 6 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, ధర్మపురిలలో 5 సెంటీమీటర్ల చొప్పున, గాండీడ్, హకీంపేట, మేడ్చల్‌లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
మళ్లీ వణికిన ఉత్తరాది
నేపాల్‌లో మళ్లీ భూకంపంతో బెంగాల్, బిహార్, ఢిల్లీలో ప్రకంపనలు ⇒ ఇళ్ల నుంచి భయంతో పరుగులు పెట్టిన జనం ⇒ దేశంలో 62కు చేరిన మృతుల సంఖ్య.. ఒక్క బిహార్‌లోనే 51 మంది మృత్యువాత ⇒ మృతుల కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్రం ⇒ సహాయక చర్యలపై ప్రధాని మోదీ సమీక్ష న్యూఢిల్లీ: ఉత్తరాది మళ్లీ వణికింది! శనివారం నాటి పెను భూకంపం నుంచి తేరుకోకముందే ఆదివారం మరోసారి ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలను కుదిపేసింది. నేపాల్‌లో తాజాగా 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రభావం పశ్చిమబెంగాల్, బిహార్, అస్సాం, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ వరకు విస్తరించింది. ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం 12.42 గంటలకు 30 సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, దేశంలో భూకంపంతో మరణించిన వారి సంఖ్య 62కు చేరింది. ఒక్క బిహార్‌లోనే 51 మంది మృత్యువాత పడ్డారు. నిబంధనలను సడలిస్తూ మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.6 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాలతోపాటు నేపాల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. నేపాల్‌లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు విమాన మార్గంతోపాటు రోడ్డు మార్గాన్ని కూడా వినియోగించాలని అధికారులకు సూచించారు. బాధితులకు తక్షణమే మంచినీరు, ఆహారం, పాల పౌడర్ అందేలా చూడాలని ఆదేశించారు. శనివారం దేశంలో మృతుల సంఖ్య 51 కాగా, ఆదివారం నాటికి 62 చేరినట్లు విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్, హోంశాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్ తెలిపారు. మరో 259 మంది గాయపడినట్లు వివరించారు. బిహార్ బిక్కుబిక్కు... నేపాల్ భూకంపం బిహార్‌ను వణికిస్తోంది! ఆదివారం మరోసారి ప్రకంపనలు రావడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఏకంగా 8సార్లు ప్రకంపనలు వచ్చాయి. భూకంపంతో బిహార్‌లో మరణించినవారి సంఖ్య 51కి చేరడంతో ముఖ్యమంంత్రి నితీశ్‌కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల పరిహారం అందించినట్లు సీఎం విలేకరులకు తెలిపారు. ప్రకంపనలు కొనసాగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నేపాల్‌లోని పొఖారా ప్రాంతంలో పెద్దసంఖ్యలో చిక్కుకుపోయిన బిహార్వాసులను కాపాడేందుకు అక్కడికి ప్రత్యేకంగా బస్సులు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూకంపాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ కేంద్రాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భూకంపం ప్రభావానికి గురైన కతిహార్, పూర్ణియా జిల్లాల్లో ఆదివారం కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇక మన వంతు! న్యూఢిల్లీ: భారీ భూకంపానికి నేపాల్ అతలాకుతలమైన నేపథ్యంలో.. భారత్‌కూ ఆ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తర భారత ప్రాంతంలో అదే స్థాయిలో పెను భూకంపం వచ్చే అవకాశముందంటున్నారు. అసలు ఈ ప్రాంతంలో ఇప్పటికే భూకంపం రావాల్సి ఉందని.. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌ల్లోని హిమాలయాల సానువుల్లో ఇప్పటి నుంచి 50 ఏళ్లదాకా ఏ క్షణమైనా ఇది జరగవచ్చని పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అహ్మదాబాద్‌లోని భూకంప పరిశోధన ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ జనరల్ బి.కె.రస్తోగీ చెప్పారు. ‘ఉత్తర భారత్‌లో హిమాలయాలకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో పెను భూకంపం వచ్చే అవకాశముంది. ఈ ప్రాంత భూమి పొరల్లో ఖాళీలున్నాయి. టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల తీవ్ర ఒత్తిడి పుడుతోంది. దీనివల్ల పైపొరలోని భారీ శిలలు పగులుతాయి. ఆ ఒత్తిడి మరిం తగా పెరిగితే భూకంపాలు వస్తాయి. హిమాలయాల వద్ద 2 వేల కిలోమీటర్ల పొడవునా ప్రతి వంద కి.మీ. ప్రాంతంలో ఎక్కడైనా భారీ ప్రకంపనలు రావచ్చు. అయితే కింది పొరల్లోని టెక్టానిక్ ప్లేట్లు కలుసుకునే ఈ మొత్తం 2 వేల కి.మీ. పొడవునా ఎక్కడ ఒత్తిడి తీవ్రంగా పెరిగితే అక్కడ భూకంపం వస్తుంది. ఎక్కడ ఒత్తిడి బాగా పెరుగుతోంది, ఏ సమయంలో ప్రకంపనలు రావొచ్చనే విషయం మనకు తెలియదు. కానీ ఈ ప్రాంతంలో పెను భూకంపం రావడం ఖాయం’ అని రస్తోగీ తెలిపారు.