వసంతపు వెలుగులు | Vernal equinox 2024 brings spring to the Northern Hemisphere | Sakshi
Sakshi News home page

వసంతపు వెలుగులు

Published Thu, Mar 21 2024 4:49 AM | Last Updated on Thu, Mar 21 2024 4:49 AM

Vernal equinox 2024 brings spring to the Northern Hemisphere - Sakshi

సరిగ్గా సగ భాగం చీకట్లో, మరో సగం ఉదయపు కాంతుల్లో నిండుగా వెలిగిపోతూ కనిపిస్తున్న భూమిని చూస్తున్నారుగా! వసంత విషువత్తు (స్ప్రింగ్‌ ఈక్వినాక్స్‌) సందర్భంగా బుధవారం అంతరిక్షం నుంచి భూ గ్రహం ఇలా కని్పంచింది. అచ్చెరువొందించే ఈ ఫొటోను యూరోపియన్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ ద ఎక్స్‌ప్లాయిటేషన్‌ ఆఫ్‌ మెటరోలాజికల్‌ శాటిలైట్స్‌ (ఈయూఎంఈటీఎస్‌ఏటీ) విడుదల చేసింది.

సంవత్సరంలో రెండు రోజులు భూమిపై రాత్రింబవళ్ల నిడివి సమానంగా ఉంటుంది. ఆ రోజుల్లో సూర్యుడు భూమధ్యరేఖపై నేరుగా ఉండటమే ఇందుకు కారణం.  వీటినే విషువత్తులుగా పిలుస్తారు. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే క్రమంలో ఇవి ఏర్పడతాయి. మొదటిదైన వసంత విషువత్తు ఏటా మార్చి 20కి అటూ ఇటుగా వస్తుంది. ఆ రోజుతో ఉత్తరార్ధ గోళం అధికారికంగా శీతాకాలం నుంచి వసంత కాలంలోకి ప్రవేశిస్తుంది. అక్కడినుంచి ఆ ప్రాంతంలో పగటికాలం, ఉష్ణోగ్రతలు పెరుగుతూ రాత్రుళ్ల నిడివి తగ్గుతూ వస్తాయి. రెండోదైన శరది్వషువత్తు (ఆటమల్‌ ఈక్వినాక్స్‌) సెపె్టంబర్‌ 22కు ఇటూ ఇటుగా వస్తుంది. విషువత్తులకు జ్యోతిశ్శాస్త్రంలో చాలా ప్రాధాన్యముంటుంది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement