
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ, అంతరిక్ష రంగానికి అవసరమైన ఉత్పత్తుల తయారీలో ఉన్న ఎంటీఏఆర్ టెక్నాలజీస్ తాజాగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్‌తో (ఇన్–స్పేస్) ఒప్పందం కుదుర్చుకుంది.
ఎంవోయూ కాలపరిమితి మూడేళ్లు. ఇందులో భాగంగా రెండు దశల నుండి భూమికి తక్కువ కక్ష్య వరకు ప్రయాణించే సెమి క్రయోజనిక్ సాంకేతికత ఆధారిత పూర్తి ద్రవ చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం రూపకల్పన, అభివృద్ధి బాధ్యతలను ఎంటీఏఆర్ చేపడుతుంది. 500 కిలోల బరువు మోయగల సామర్థ్యంతో ఈ వాహనాన్ని రూపొందిస్తారు.