హైదరాబాద్: జవాన్ లాన్స్‌నాయక్ హనుమంతప్ప (33) మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. దేశం కోసం హనుమంతప్ప ప్రాణత్యాగం చేశాడని ట్విటర్లో పేర్కొన్నారు. ఆయన మనకు స్ఫూర్తిదాయకమని, ఎప్పటికీ చిరస్మరణీయుడిగా ఉంటాడని జగన్ నివాళులు అర్పించారు. హనుమంతప్ప కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. సియాచిన్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హనుమంతప్ప ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం 12 గంటల ప్రాంతంలో కనుమూశారు.
హనుమంతప్ప మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. దేశం ఓ గొప్ప సైనికుడిని కోల్పోయిందని నివాళులు అర్పించారు.
హనుమంతప్ప మనందరికీ స్ఫూర్తి:వైఎస్ జగన్
Published Thu, Feb 11 2016 2:33 PM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM
Advertisement
Advertisement