ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో మొబైల్‌ టవర్‌! | Mobile Tower Installed In Siachen Battlefield | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో మొబైల్‌ టవర్‌!

Published Fri, Oct 13 2023 1:25 PM | Last Updated on Fri, Oct 13 2023 1:58 PM

Mobile Tower Installed In Siachen Battlefield - Sakshi

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటారు. తనకు నచ్చిన అంశాలను ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తూ ఫాలోవర్లలో స్ఫూర్తి నింపుతుంటారు. అలా ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ఆయన పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

సియాచిన్‌ పర్వత శ్రేణుల్లో జవాన్లు మొట్టమొదటగా మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేశారు. భారత జవాన్లు దీన్ని ఏర్పాటు చేయడంపై ఆనంద్‌ మహీంద్రా ఎక్స్‌(ట్వీటర్‌)లో స్పందించారు. ప్రపంచంలో ఇది ఒక చిన్న సంఘటన. మనల్ని రక్షించడానికి అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో ప్రతిరోజూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్న వారు ఇప్పుడు తమ కుటుంబాలతో కనెక్ట్ అవుతున్నారని ట్వీట్‌ చేశారు. అంత ఎత్తులో మొబైల్‌ టవర్‌ ఏర్పాటు చేసుకోవడం..విక్రమ్ ల్యాండర్ ఘనతతో సమానమైందని కొనియాడారు. సుమారు 15500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ను ఏర్పాటు చేసింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement