mobile tower
-
ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో మొబైల్ టవర్!
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటారు. తనకు నచ్చిన అంశాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఫాలోవర్లలో స్ఫూర్తి నింపుతుంటారు. అలా ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సియాచిన్ పర్వత శ్రేణుల్లో జవాన్లు మొట్టమొదటగా మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేశారు. భారత జవాన్లు దీన్ని ఏర్పాటు చేయడంపై ఆనంద్ మహీంద్రా ఎక్స్(ట్వీటర్)లో స్పందించారు. ప్రపంచంలో ఇది ఒక చిన్న సంఘటన. మనల్ని రక్షించడానికి అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో ప్రతిరోజూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్న వారు ఇప్పుడు తమ కుటుంబాలతో కనెక్ట్ అవుతున్నారని ట్వీట్ చేశారు. అంత ఎత్తులో మొబైల్ టవర్ ఏర్పాటు చేసుకోవడం..విక్రమ్ ల్యాండర్ ఘనతతో సమానమైందని కొనియాడారు. సుమారు 15500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో బీఎస్ఎన్ఎల్ టవర్‌ను ఏర్పాటు చేసింది. These are photos shared by @devusinh of the first ever mobile tower installed in Siachen! A seemingly small event in our turbulent world. But it means our Jawans who put their lives on the line every single day on the world’s highest battlefield to defend us are now strongly… pic.twitter.com/bn1L260hLz — anand mahindra (@anandmahindra) October 13, 2023 -
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ఓటీపీ రాకుంటే.. ఓటు వేసే ప్రసక్తే లేదు!
యశవంతపుర(బెంగళూరు): ఇప్పుడు అందరూ ఆన్లైన్లో లావాదేవీలు చేయడం పరిపాటైంది. లావాదేవీల్లో ఓటీపీని ఎంటర్ చేశాకే పూర్తవుతుంది. కానీ తాము మొబైల్ టవర్లు– ఇంటర్నెట్ లేని కారణంగా ఓటీపీ వసతిని పొందలేకున్నామని చిక్కమగళూరు జిల్లా కళస తాలూకా బలిగె, మెణసిన హడ్య గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున ఓటుకు ముడిపెట్టారు. హామీలపై నమ్మకం లేదు నాయకులపై నమ్మకం వద్దు, వారిచ్చే హామీలు మాకొద్దు, మా గ్రామంలో మొబైల్ టవర్ కావాలని జనం డిమాండ్ చేస్తున్నారు. ఓటీపీ లేకుంటే– ఓటు లేదనే నినాదంతో ఆందోళన మొదలుపెట్టారు. ఈ నినాదంతో అంతటా బ్రోచర్లను అంటించడం ఆరంభమైంది. నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన పోలీసులు బలిగె, మెణసినహడ్య గ్రామాలకు మొబైల్ టవర్‌ను వేయలేదు. నెట్ లేకుంటే ఎలా టవర్లు వేయకుంటే, వచ్చే విధానసభ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. 70 కుటుంబాలున్న గ్రామంలో 10 ఏళ్ల నుంచి మొబైల్ నెట్వర్క్ లేదు, ఫలితంగా ఇంటర్నెట్ కూడా అందని పండే అయ్యింది. ఈ డిజిటల్ యుగంలో ప్రభుత్వం సౌకర్యాలు కావాలన్నా మొబైల్, ఇంటర్నెట్ చాలా ముఖ్యమయ్యాయని గ్రామస్థులు తెలిపారు. కాగా, ఓటీపీ లేకుంటే ఓటు లేదనే అభియానతో ప్రజాప్రతినిధులలో చలనం కనపడుతోంది. ఆందోళనలను విరమించాలని గ్రామాల పెద్దలకు రాయబారాలు పంపారు. ఈ అభియాన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లు గ్రామస్థులకు మద్దతుగా సందేశాలు పెడుతున్నారు. చదవండి విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎక్కడంటే? -
భార్య కాపురానికి రావడం లేదని టవర్ ఎక్కిన భర్త
సాక్షి, కడెం(ఆదిలాబాద్): భార్య కాపురానికి రావడం లేదని సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశాడు ఓ యువకుడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన సుతారి రవికి అదే గ్రామానికి చెందిన సౌజన్యతో సుమారు నాలుగేళ్ల క్రితం వివాహాం జరిగింది. వీరికి రెండు సంవత్సరాల వయస్సు గల బాబు ఉన్నాడు. కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లగా ఇటీవలే మామతో గొడవపడ్డాడు. ఈక్రమంలో మనస్తాపం చెందిన రవి శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి గంటపాటు హల్చల్ చేశాడు. చివరికి పోలీసులు, అతని మామ వచ్చి నచ్చజెప్పడంతో కిందకు దిగాడు. చదవండి: విషాదం: గడ్డివాములో కుటుంబం అంతా ఆహుతి -
సెల్‌టవర్ ఎక్కిన యువకుడు.. కారణం తెలిస్తే షాక్..
సాక్షి, చందంపేట(నల్లగొండ) : మండల కేంద్రానికి చెందిన ఇరగదిండ్ల మల్లేశ్ అనే వ్యక్తి తనకు డబుల్ బెడ్రూం ఇల్లు లక్కీ డ్రాలో రాలేదని గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న సెల్‌టవర్ ఎక్కాడు. తనకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించే వరకు కిందికి దిగిరానని భీష్మించాడు. మల్లేశ్‌కు మద్దతుగా అతడి భార్య, కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో లక్కీడ్రాలో ఇళ్లు రాని మరికొంత మంది కూడా బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సందీప్‌నాయుడు ఘటనా స్థలానికి చేరుకొని ఫోన్లో మాట్లాడి మల్లేశ్‌ను కిందికి దించే ప్రయత్నం చేశారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కిందికి దిగనని మల్లేశ్ చెప్పాడు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించాడు. సర్పంచ్ కవితఅనంతగిరి ఎమ్మెల్యేను ఫోన్ ద్వారా సంప్రదించారు. రాబోయే విడతలో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామ ని హామీ ఇవ్వడంతోపాటు, ఎంపీడీఓ రాములునాయక్, ఇన్చార్జ్ తహసీల్దా ర్ ముక్తార్, ఎస్ఐ సందీప్‌నాయుడు బాధితుడు, అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడడంతో మల్లేశ్ టవర్ దిగాడు. చదవండి: దొరికితే దొంగ.. లేదంటే దొర -
ప్రత్యేక సంస్థగా బీఎస్ఎన్ఎల్ టవర్స్ విభాగం
విభజనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కి చెందిన మొబైల్ టవర్స్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడగొట్టే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. దేశీయంగా ప్రస్తుతం 4,42,000 మొబైల్ టవర్స్ ఉండగా, వీటిలో బీఎస్ఎన్ఎల్కి చెందినవి 66,000 పైచిలుకు ఉన్నాయి. టవర్స్ విభాగాన్ని ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయడం వల్ల మరిన్ని టెల్కోలకు అద్దెకివ్వడం ద్వారా కొత్త కంపెనీ మరింత ఆదాయం ఆర్జించగలిగే అవకాశం ఉంటుందని పేర్కొంది. రెండేళ్లలో ప్రక్రియ పూర్తి..: కొత్తగా ఏర్పాటయ్యే మొబైల్ టవర్ కంపెనీ పూర్తిగా బీఎస్ఎన్ఎల్ ఆధీనంలోనే ఉంటుందని క్యాబినెట్ సమావేశం అనంతరం టెలికం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. కొత్త సంస్థ ఏర్పాటు ప్రక్రియ రెండేళ్లలో పూర్తవుతుందని చెప్పారు. బీఎస్ఎన్ఎల్, టెలికం విభాగం నుంచి 1,614 మంది ఉద్యోగులు ఈ సంస్థకు డిప్యుటేషన్ మీద వెడతారని, వ్యాపారం పెరిగే కొద్దీ కొత్త ఉద్యోగావకాశాలు పెరుగుతాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ సంస్థల జాయింట్ వెంచర్ అయిన ఇండస్ టవర్స్ సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద టెలికం టవర్ కంపెనీగా ఉంది. దీనికి 1,22,920 మొబైల్ టవర్స్ ఉన్నాయి. భారతీ ఇన్ఫ్రాటెల్ 90,646 టవర్స్‌తో రెండో స్థానంలో ఉంది. -
బీఎస్ఎన్ఎల్ పెట్టుబడుల జోరు..
-
బీఎస్ఎన్ఎల్ పెట్టుబడుల జోరు..
• ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7వేల కోట్ల వ్యయం • అక్టోబర్-మార్చి మధ్య రూ.2,500 కోట్ల పెట్టుబడులు • హాట్స్పాట్లు, టవర్ల విస్తరణ, నెట్వర్క్ బలోపేతం న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ టెలికం కంపెనీలకు గట్టి పోటీనిచ్చే దిశగా ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తన నెట్వర్క్ సామర్థ్యాలను బలోపేతం చేసుకునే పనిలో పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016-17)లో మిగిలి ఉన్న ఆరు నెలల కాలంలో రూ.2,500 కోట్లను పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. వైఫై హాట్స్పాట్లు, మొబైల్ టవర్ల ఏర్పాటు, కోర్ నెట్వర్క్ విస్తరణ సహా పలు రకాల ప్రాజెక్టులపై ఈ నిధులను వినియోగించనుంది. ‘పూర్తి ఆర్థిక సంవత్సరంలో మా పెట్టుబడులుగా రెండు భాగాలుగా ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ సొంతంగా చేపట్టిన ప్రాజెక్టులపై రూ.4,000 కోట్లు, ప్రభుత్వ నిధుల సాయంతో చేపట్టిన ప్రాజెక్టులపై రూ.3,000 కోట్లు ఖర్చు చేయనున్నాం’ అని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, ఎండీ అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు. మెరుగుపడనున్న సేవలు: సొంత నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై ఇప్పటికే రూ.1,500 కోట్లు వ్యయం చేశామని, అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలంలో మిగిలిన రూ.2,500 కోట్లను వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు, జీఎస్ఎం నెట్వర్క్ విస్తరణ, నెట్వర్క్ బలోపేతానికి ఖర్చు చేయనున్నట్టు అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో మొబైల్ టవర్ల ఏర్పాటు, స్పెక్ట్రమ్ ప్రాజెక్టు ‘భారత్‌నెట్ అండ్ డిఫెన్స్’ నెట్వర్క్ ఈ రెండూ ప్రభుత్వ నిధులతో బీఎస్ఎన్ఎల్ అమలు చేస్తున్న ప్రాజెక్టులన్నారు. ‘జీఎస్ఎం విస్తరణ ప్రాజెక్టులో భాగంగా 20వేల బీటీఎస్(బేస్ ట్రాన్సీవర్ స్టేషన్)లను ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేస్తున్నాం. వీటి వల్ల సేవల నాణ్యత మెరుగుపడుతుంది. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే 2,700 వైఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేసింది. ఈ సంఖ్యను 2018 నాటికి 40,000కు పెంచనున్నాం’ అని శ్రీవాస్తవ వివరించారు. -
సెల్ టవర్ దిగిన సంజీవరావు
-
సెల్ టవర్ దిగిన సంజీవరావు
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ... గుంటూరు జిల్లా పెదకాకానిలో సెల్ టవర్ ఎక్కిన ఎం. సంజీవరావు ఎట్టకేలకు మెత్తబడ్డారు. జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో సంజీవరావు ఆదివారం రాత్రి సెల్ టవర్ దిగాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్ చేస్తూ సంజీవరావు శనివారం పెదకాకానిలోని ఓ సెల్‌టవర్‌పైకి ఎక్కారు. గుంటూరు సీతానగరంకు చెందిన మామిళ్లపల్లి సంజీవరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని శనివారం ఉదయం పెదకాకాని పోలీసుస్టేషన్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. పోలీసులు అతడిని కిందకు దించేందుకు నిన్న రాత్రి నుంచి ప్రయత్నించినా అతడు కిందకి దిగలేదు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో మంచినీళ్లతో ఓ నలుగుర్ని పైకి పంపించారు. ఆ నలుగురు పది అడుగుల ఎత్తుకి ఎక్కగానే, అంతకంటే పైకి వస్తే తాను దూకేస్తానని సంజీవరావు బెదిరించాడు. దాంతో పోలీసుల సూచన మేరకు మంచినీళ్లను అతడికి సమీపంలో ఉంచి ఆ నలుగురు కిందకు దిగిపోయారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా సంజీవరావు తన పట్టును వీడలేదు. సంజీవరావు ఓ వేళ కిందకు దూకితే అతడ్ని కాపాడేందుకు పోలీసులు వలలు ఏర్పాటు చేశారు. కానీ జిల్లా కలెక్టర్ ప్రత్యేక హోదా విషయంపై కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో సంజీవరావు కిందకి దిగారు.