పాకిస్థాన్ మరోసారి దురాఘతానికి పాల్పడింది. కశ్మీర్లోని నౌషెరా ప్రాంతంలో కాల్పులకు తెగబడింది. దీంతో ఒక భారత ఆర్మీ జవాను వీరమరణం పొందాడు.
శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి దురాఘతానికి పాల్పడింది. కశ్మీర్లోని నౌషెరా ప్రాంతంలో కాల్పులకు తెగబడింది. దీంతో ఒక భారత ఆర్మీ జవాను వీరమరణం పొందాడు. మరో ఇద్దరు సైనికులు గాయాలపాలయ్యారు. భారత బలగాలు పాకిస్థాన్ సైనికుల మధ్య ఈ కాల్పులు ఉదయం 8.45గంటల ప్రాంతంలో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
రోజంతా పాక్ రేంజర్స్ మోర్టార్ షెల్స్తో దాడులు చేస్తునే ఉన్నారు. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించారు. మరోపక్క, పూంచ్ సెక్టార్లోని సాగా, బాల్నోయి, సాలోత్రి ప్రాంతంలో భారీ స్థాయిలో కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.