
కాల్పుల్లో తెలుగు జవాను మృతి
శ్రీనగర్‌లో జరిగిన కాల్పుల్లో వెంకటకృష్ణయ్య(25) అనే యువ జవాను మృతిచెందాడు.
రుద్రవరం (కర్నూలు జిల్లా): శ్రీనగర్‌లో జరిగిన కాల్పుల్లో వెంకటకృష్ణ(25) అనే యువ జవాను మృతి చెందాడు. ఇతని స్వస్థలం కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామం. గురువారం తెల్లవారుజామున పై అధికారితో తలెత్తిన విభేదాల కారణంగా ఇద్దరు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో వెంకటకృష్ణ తీవ్రంగా గాయపడి చనిపోయాడు.
సదరు పై అధికారి కూడా తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కాగా వెంకటకృష్ణ అవివాహితుడు. తండ్రి ఇడిగ పెద్ద వెంకటన్న కొన్నేళ్ల క్రితమే చనిపోగా గ్రామంలో అతని తల్లి, ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వెంకటకృష్ణ మృతదేహం ఈనెల 8వ తేదీన స్వగ్రామం చేరుకునే అవకాశం ఉంది.