రాంగోపాల్‌పేట్: ఓ మైనర్ బాలికను బెదిరించి లైంగికదాడికి పాల్పడిన ఓ రిటైర్డ్ ఆర్మీ జవానుకు పోక్సో స్పెషల్ సెషన్స్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన 2017 సంవత్సరంలో జరిగింది. మార్కెట్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం ఓ మైనర్ బాలిక రెజిమెంటల్‌బజార్‌లోని హోంలో ఉంటూ 31బస్టాప్ ప్రాంతంలోని పాలికాబజార్‌లో ఉండే ఓ టైలరింగ్ సెంటర్‌లో టైలరింగ్ నేర్చుకుంటోంది.
2017 జూలై 24వ తేదీన ఉదయం 11గంటలకు టైలరింగ్ సెంటర్‌కు వెళ్తుండగా ఆర్మీలో పదవి విరమణ పొందిన యాప్రాల్‌లో నివాసం ఉండే పెరియాటి శ్రీధరన్(59) బాలికను ఆపి భోజనం చేశావా అంటూ ప్రశ్నించాడు. భోజనం పెట్టిస్తానని ముత్యాలమ్మ దేవాలయం ప్రాంతంలోని ఓ హోటల్‌కు తీసుకుని వెళ్లి భోజనం పెట్టించాడు. అక్కడి నుంచి ఆ బాలికను హోటల్‌కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అటు తర్వాత మనోహర్ థియేటర్ ప్రాంతంలోని ఓ లైన్‌లో ఆ బాలికను విడిచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. బాలిక హోంకు వెళ్లి రెండు రోజుల పాటు ఏడుస్తూ విచారంగా ఉంది.
హోంలోని ఓ ఆరోగ్య కార్యకర్త గమనించి ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. వెంటనే 27వ తేదీన హోం నిర్వాహకులు మంజుల, పద్మ బాలికను తీసుకుని వెళ్లి మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించి చార్జిïÙట్‌ను కోర్టుకు సమరి్పంచారు. పోక్సో ప్రత్యేక సెషన్స్ జడ్జి పుష్పలత కేసును విచారించి పోలీసులు సమరి్పంచిన సాక్ష్యాధారాలతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. మరో రూ.20వేల జరిమానా కూడా విధించారు. ఈ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి బాలిక తరఫున వాదనలు వినిపించి శిక్ష పడేలా చూశారు.
Comments
Please login to add a commentAdd a comment