రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్ల కిడ్నాప్, ఒకరు మృతి | JK: Two Indian Army Soldiers Abducted By Terrorists One Escaped, Another Found Dead | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్ల కిడ్నాప్, ఒకరు మృతి

Published Wed, Oct 9 2024 4:21 PM | Last Updated on Wed, Oct 9 2024 4:41 PM

JK: Two Indian Army Soldiers Abducted By Terrorists One Escaped, Another Found Dead

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా ఇద్దరు ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అనంత్‌నాగ్‌ జిల్లాలో ఇద్దరు ఆర్మీ జవాన్లు కిడ్నాప్‌కు గురయ్యారు. కాకర్‌నాగ్‌ ప్రాంతం టెరిటోరియల్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు  ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల చెర నుంచి ఒక జవాన్ తప్పించుకుని బయటపడగా.. ఇంకో జవాన్ వారి చేతులో చిక్కుకుపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న భారత సైన్యం.. ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. గాయపడిన జవాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిస్‌ అయిన మరో జవాన్‌.. కొన్ని గంటలకే కోకెర్‌నాగ్‌లోని అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. చనిపోయిన సైనికుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.

మృతుడిని అనంత్‌నాగ్‌లోని ముక్ధంపోరా నౌగామ్‌కు చెందిన హిలాల్ అహ్మద్‌ భట్‌గా అధికారులు గుర్తించారు. గాయపడిన జవాన్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. ఇటీవలె జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా.. ఆ ఫలితాలు వెల్లడైన ఒక రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement