
శంషాబాద్ : ఆర్మీ జవాను తల్లెపురెడ్డి క్రిష్ణారెడ్డి(21) పార్ధివ దేహం శుక్రవారం శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకుంది. జమ్ము కశ్మీర్లోని నౌశిరాలోని పూంచ్ సెక్టర్లో గురువారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో క్రిష్ణారెడ్డి అమరులయ్యారు. క్రిష్ణారెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఒబుళాపురం గ్రామం. పోలీసులు విమానాశ్రయంలో క్రిష్ణారెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్మీ అధికారులు తల్లెపురెడ్డి క్రిష్ణారెడ్డి మృతదేహాన్ని స్వగ్రామనానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment