
బాధిత మహిళా హోమ్‌గార్డును పోలీసుల సమక్షంలో వివాహమాడుతున్న జవాన్ తరిణి మహేంద్ర
బరంపురం : గంజాం జిల్లాలోని బల్లిగుడ ప్రాంగణంలో ఓ మహిళా హోమ్‌గార్డుపై జవాన్ అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో బాధి త మహిళకు నిందితుడితో పోలీసులు సోమవారం వివాహం జరిపిం చారు. వివరాలిలా ఉన్నాయి. కొందమాల్ జిల్లా బల్లిగుడ పోలీస్‌స్టేషన్‌లో హోమ్‌గార్డుగా విధులు నిర్వహిస్తున్న మహిళపై..జవాన్ తరిణి మహేంద్ర అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఈ సంఘటనపై బాధిత మహిళా హోమ్‌గార్డు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు బాధితురాలితో నిందితుడు తరిణి మహేంద్రకు రాజీ కుదిర్చి సోమవారం జి.ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరికీ సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment