
అత్యాచారం కేసులో సైనికుడి అరెస్టు
జమ్ము కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఓ మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఓ సైనికుడిని పోలీసులు అరెస్టు చేశారు. హక్ నవాజ్ అనే ఆ సైనికుడు 6 ఇంజనీర్స్ రెజిమెంటులో ఉన్నాడు. కశ్మీర్లో పోస్టింగ్ రావడంతో పూంచ్ జిల్లాలో పనిచేస్తున్నాడు.
ప్రస్తుతం సెలవులో ఉన్న అతడు.. మన్కోటె ప్రాంతంలో ఓ ఇంట్లోకి చొరబడి.. అక్కడ ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించి, అక్కడినుంచి పారిపోయాడన్నారు. బాధితురాలు తమకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని, తీవ్రంగా గాలించి సైనికుడిని పట్టుకుని అరెస్టు చేశామని చెప్పారు.