
లక్‌పతి (ఫైల్)
జనగామ రూరల్: జనగామ మండలం పెద్దతండా శివారు బాచ్యా తండాకు చెందిన ఆర్మీ జవాన్ గుగులోతు లక్‌పతి(38) మృతి చెందారు. జమ్ము కశ్మీర్‌లో ఉదయం విధులకు వెళ్తుండగా లక్‌పతికి గుండెపోటు వచ్చినట్లు ఆర్మీ అధికారులు ఫోన్‌లో తెలిపారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గుగులోతు ఈర్యా–నేజమ్మ దంపతులకు ఏడుగురు సంతానం. నాలుగో కుమారుడు లక్‌పతి ఇంటర్ తర్వాత ఆర్మీ ఉద్యోగంలో చేరారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. కాగా, లక్‌పతి పార్థివ దేహాన్ని సైనిక అధికారులు తీసుకువస్తున్నారని, శనివారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.