పాతపట్నం (శ్రీకాకుళం) : స్నానం కోసం బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకిన ఓ సైనికుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం బ్రాహ్మణ వీధికి చెందిన మల్లేడి మధుబాబు(25) ఆర్మీ సైనికుడిగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. సెలవుపై స్వస్థలం వచ్చిన మధుబాబు శనివారం సాయంత్రం మహేంద్ర తనయ నది వద్దకు వెళ్లాడు.
స్నానం చేసే క్రమంలో సరదాకొద్దీ బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకాడు. అయితే ఆ ప్రాంతంలో రాళ్లు ఉండడంతో దూకినప్పుడు తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మధుబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం అతడి మృతదేహాన్ని గుర్తించారు.
బ్రిడ్జిపై నుంచి దూకిన సైనికుడు
Published Sun, Sep 27 2015 9:59 AM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM
Advertisement
Advertisement