వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలను నాశనం చేస్తున్నారు. పెద్దలను, పిల్లలను రోడ్డున పడేస్తున్నాయి. పెళ్లి అయినప్పటికీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న ఓ మహిళ వ్యవహారం హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. నగరంలోని రహమత్‌నగర్‌లో ఆర్మీ జవాన్ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. కాగా, జవాన్ భార్య.. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏకంగా ప్రియుడినే తన భర్త అని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని రాసలీలలు కొనసాగిస్తోంది. ఇదిలా కొనసాగుతుండగా.. అకస్మాత్తుగా ఇంటికి వచ్చిన ఆర్మీ జవాన్ ఏకాంతంగా ఉన్న భార్య, ప్రియుడు జ్ఞానేశ్వర్ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
అనంతరం షాక్ నుంచి తేరుకొని.. ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారిద్దరినీ ఇంట్లోనే ఉంచి తాళం వేసి.. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో జవాన్ ఇంటికి వచ్చిన పోలీసులు.. తాళం తీసి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, జవాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. తన భార్యను ప్రేమించి పెళ్లిచేసుకున్నానని జవాన్ చెప్పాడు. ఇద్దరు పిల్లలు ఉన్నా.. ఆమె మరో వ్యక్తితో ఇలా వివాహేతర సంబంధం పెట్టుకోవడమేంటని ప్రశ్నించాడు. ఆమె తనను నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇది కూడా చదవండి: దారుణం.. బాలికపై వరుసకు సోదరుడు లైంగికదాడి
Comments
Please login to add a commentAdd a comment